Loksabha Elections 2024-Assam Family Nearly 350 Voters: బాహుబలి ఫ్యామిలీ.. ఒకే కుటుంబంలో ఏకంగా 350 ఓట్లు

బాహుబలి ఫ్యామిలీ.. ఒకే కుటుంబంలో ఏకంగా 350 ఓట్లు

Loksabha Elections 2024: ఒక కుటుంబం మహా అయితే అది కూడా చాలా అరుదుగా 40-50 మంది ఓటర్లు ఉండవచ్చు. కానీ ఇప్పుడ మేం చెప్పబోయే ఫ్యామిలీలో ఏకంగా 350 మంది ఓటర్లు ఉన్నారు. ఆ వివరాలు. .

Loksabha Elections 2024: ఒక కుటుంబం మహా అయితే అది కూడా చాలా అరుదుగా 40-50 మంది ఓటర్లు ఉండవచ్చు. కానీ ఇప్పుడ మేం చెప్పబోయే ఫ్యామిలీలో ఏకంగా 350 మంది ఓటర్లు ఉన్నారు. ఆ వివరాలు. .

లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడింది. దాంతో దేశంలో రాజకీయ వాతావరణ హీటెక్కింది. అధికార, విపక్ష పార్టీలు అభ్యర్థుల ప్రకటన, మేనిఫెస్టో విడుదల వంటి కార్యక్రమాలతో బిజీగా ఉన్నాయి. దాంతో పాటు ప్రచార కార్యక్రమాలు కూడా ప్రారంభించాయి. ఇక ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ కాగానే.. కొత్త ఓటర్ల నమోదు.. ఓటర్ ఐడీలో మార్పులు, చేర్పులు వంటివి చేసుకోవడానికి కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పిస్తుంది. దాంతో ఓటర్లకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తాయి. ఇక తాజాగా ఇలాంటి వెరైటీ వార్తే వెలుగులోకి వచ్చింది. ఓ కుటుంబంలో ఏకంగా పది కాదు వంద కాదు.. 350 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిసింది. ఆ వివరాలు..

సాధారణంగా అయితే ఒక కుటుంబంలో నలుగురైదుగురు ఓటర్లు ఉంటారు. ఒకవేళ ఉమ్మడి కుటుంబం అయితే 10, 20 మంది ఓటర్లు ఉంటారు. చాలా అరుదుగా కొన్ని కుటుంబాల్లో 40 నుంచి 50 మంది ఓటర్లు కూడా ఉంటారు. కానీ ఇప్పుడు మీకు మేం చెప్పబోయే ఫ్యామిలీలో ఏకంగా 350 మంది ఓటర్లు ఉన్నారు. మరి ఈ బాహుబలి కుటుంబం ఎక్కడ నివసిస్తోంది అంటే.. అసోంలో. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఒకే కుటుంబానికి చెందిన ఈ 350 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు.

ఈ బాహుబలి ఫ్యామిలీ వివరాలకు వస్తే.. అసోం రాష్ట్రం సోనిట్‌పూర్‌ జిల్లాలోని ఫులోగురి నేపాలీ పామ్‌ గ్రామంలో దివంగత రోన్‌ బహదూర్‌ తాపాకు ఐదుగురు భార్యలు. వీరి ద్వారా ఆయన 12 మంది కొడుకులను, 9 మంది బిడ్డలను కన్నాడు. 12 మంది కొడుకుల పిల్లలు 56 మంది కాగా, 9 మంది బిడ్డలకు కూడా దాదాపు 50 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ల పిల్లలు, వాళ్ల పిల్లల పిల్లలు కలిపి మొత్తం రోన్‌ తాపా కుటుంబసభ్యుల సంఖ్య 1200 దాటింది. వారిలో ప్రస్తుతం 350 మందికి ఓటు హక్కు ఉంది. వారంతా ఈ లోక్ సభ ఎన్నికల్లో తమ ఓటు వేయబోతున్నారు.

ఏప్రిల్‌ 19న జరిగే లోక్‌ సభ తొలి విడత ఎన్నికల పోలింగ్‌లో ఈ 350 మంది కుటుంబ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 350 మంది ఓటర్లతో అత్యధిక మంది ఓటర్లున్న అతికొద్ది కుటుంబాల్లో ఒకటిగా తాపా కుటుంబం రికార్డులెకెక్కింది. అసోంలోని మొత్తం 14 లోక్‌సభ స్థానాలకు మూడు విడతల్లో ఏప్రిల్‌ 19, ఏప్రిల్‌ 26, మే 7న పోలింగ్‌ జరగనున్నది. ఈ బాహుబలి ఫ్యామిలీని చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు.

Show comments