iDreamPost
android-app
ios-app

కర్నాటక రిజర్వేషన్స్ తో సగం బెంగుళూరు ఖాళీ కానుందా?

Karnataka: కర్ణాటక ప్రభుత్వం లోకల్ రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చింది. ఈ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుతో స్థానికేతరుల్లో కొత్త టెన్షన్ మొదలైంది. బెంగుళూరు నగరం సగం ఖాళీ కానుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Karnataka: కర్ణాటక ప్రభుత్వం లోకల్ రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చింది. ఈ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుతో స్థానికేతరుల్లో కొత్త టెన్షన్ మొదలైంది. బెంగుళూరు నగరం సగం ఖాళీ కానుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కర్నాటక రిజర్వేషన్స్ తో సగం బెంగుళూరు ఖాళీ కానుందా?

దేశంలో రోజు రోజుకు నిరుద్యోగం పెరిగిపోతున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇది తలనొప్పిగా మారింది. మరోవైపు ప్రైవేట్ సంస్థల్లో స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలనే డిమాండ్ కూడా కొంత కాలం నుంచి వస్తోంది. పలు రాష్ట్రాలు కూడా దీనిపై చర్చలు మొదలుపెట్టాయి. ఈ క్రమంలో కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రతి కంపెనీ మేనేజ్ మెంట్ పోస్టుల్లో 50 శాతం స్థానికులకు, నాన్ మేనేజ్ మెంట్ పోస్టుల్లో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని ఓ బిల్లు రూపొందించింది. ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో బెంగుళూరు సిటీ సగం ఖాళీ కానుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.

సాఫ్ట్ వేర్ కంపెనీలకు నిలయమైన బెంగుళూరు సిటీని సిలికాన్ సిటీగా పేర్కొంటారు. దేశం నలుమూలల నుంచి ఇక్కడికి ఉద్యోగాల కోసం వేలాది మంది తరలివస్తుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వేల సంఖ్యలో జాబ్స్ కోసం వెళ్లి అక్కడ ఉపాధి పొందుతూ స్థిరపడిన వారు కూడా ఉన్నారు. ఇప్పుడు స్థానికులకే ఉద్యోగాలు అని కర్ణాటక ప్రభుత్వం రిజర్వేషన్స్ తీసుకు వస్తుండడంతో స్థానికేతరులకు టెన్షన్ మొదలైంది. ముఖ్యంగా నార్త్ స్టేట్స్ నుంచి బెంగుళూరుకు యువత పెద్ద ఎత్తున వచ్చి స్థానికుల అవకాశాలను దెబ్బకొడుతున్నారనే ఆగ్రహం కూడా ఉంది. అంతేకాదు కర్ణాటకలో యాంటీ హిందీ ఆందోళనలు కూడా వెల్లువెత్తాయి.

కర్ణాటక ప్రభుత్వం స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని ఓ బిల్లు రూపొందించింది. ఈ బిల్లును కేబినెట్ ఆమోదించింది. ఇక ఇది అసెంబ్లీలో పాస్ కావాల్సి ఉంది. ఈ బిల్లు ఐటీ సెక్టార్ తో పాటు అన్ని ప్రేవేట్ సంస్థలకు వర్తించనున్నది. కన్నడిగిలుకు ప్రాధాన్యతనిచ్చే విధంగా తీసుకొచ్చిన ఈ బిల్లు స్థానికేతరులు ఉపాధి కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. స్థానికుడు అంటే తప్పనిసరిగా కన్నడ లాంగ్వేజీతో ఎస్సెస్సీ సర్టిఫికెట్ కలిగి ఉండాలి, ప్రభుత్వం గుర్తించిన నోడల్ ఏజెన్సీ ద్వారా నిర్వహించబడే కన్నడ ప్రొఫిషియెన్సీ టెస్టు పాసై ఉండాలి. 15 సంవత్సరాలు రాష్ట్రంలో నివసించి ఉండాలి. అలా అయితేనే స్థానికులుగా గుర్తిస్తారు. దీనికితోడు ప్రతి కంపెనీ గ్రూప్ సి, గ్రూప్ డి పోస్టుల్లో వంద శాతం స్థానికులకే అవకాశం ఇవ్వాలని సీఎం సిద్ధరామయ్య సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టాడు.

స్థానిక యువతకు నైపుణ్యం ఉన్నప్పుడు ఇతర రాష్ట్రాల వారికి అవకాశాలు ఎందుకు ఇవ్వాలని.. ఇక్కడి వారికే ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. కర్ణాటక తీసుకొచ్చిన ఈ రిజర్వేషన్ బిల్లు చట్టరూపం దాల్చితే స్థానికేతరులు బెంగుళూరు నగరం నుంచి వెళ్లిపోక తప్పదు. తెలుగు రాష్ట్రాలతో పాటు, నార్త్ స్టేట్ నుంచి వచ్చిన లక్షలాది మంది బెంగుళూరును విడిచి వెళ్లక తప్పదంటున్నారు పలువురు వ్యక్తులు. ప్రభుత్వ నిర్ణయంతో బెంగూళూరు నగరం సగం ఖాళీ కానుందా అన్న ఊహాగానాలకు కర్ణాటక ప్రభుత్వ నిర్ణయం మరింత బలాన్ని చేకూరుస్తోంది.