Arjun Suravaram
కాంక్రీట్ జంగిల్ వేగంగా విస్తరిస్తోంది. దాంతో అడవుల విస్తీర్ణం అంతకంతకూ తగ్గిపోయింది. దాంతో అడవిలో ఉండాల్సిన వన్యప్రాణులు, క్రూరమృగాలు జనవాసాల్లోకి వచ్చి చేరుతున్నాయి. తాాజాగా ఓ చిరుత ఏకంగా ఇంట్లోకి దూరింది.
కాంక్రీట్ జంగిల్ వేగంగా విస్తరిస్తోంది. దాంతో అడవుల విస్తీర్ణం అంతకంతకూ తగ్గిపోయింది. దాంతో అడవిలో ఉండాల్సిన వన్యప్రాణులు, క్రూరమృగాలు జనవాసాల్లోకి వచ్చి చేరుతున్నాయి. తాాజాగా ఓ చిరుత ఏకంగా ఇంట్లోకి దూరింది.
Arjun Suravaram
ఇటీవల కాలంలో వన్యమృగాలు అడవులను వదిలి.. జనవాసాల్లోకి వస్తున్నాయి. ముఖ్యంగా అడవులకు సమీపంలో ఉండే గ్రామాల్లోకి చిరుతలు, ఏనుగులు, ఎలుగుబంట్లు,పెద్ద పులు వంటివి ప్రవేశిస్తున్నాయి. దీంతో ఫారెస్ట్ కు సమీపంలో ఉండే పట్టణాలు, గ్రామాల ప్రజలు ఆందోళకు గురవుతున్నారు. ఇప్పటికే పలు జనవాస ప్రాంతాల్లో చిరుత,పెద్ద పులి వంటివి సంచరిస్తూ ప్రజలపై దాడి చేస్తున్నాయి. ఇటీవలే శ్రీకాకుళం జిల్లాలో ఎలుగు బంటి దాడి చేయగా ఇద్దరు మరణించారు. ఈ సారి ఓ చిరుత ఏకంగా ఇంట్లోకి దూరి ఐదుగురిపై దాడి చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి… ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ప్రస్తుతం సమాజంలో మనిషి చేసే తప్పుల కారణంగా అనేక ఘోరాలు జరుగుతున్నాయి. చెట్టలను పెంచేది పోయి.. నరకడం ప్రారంభిచడంతో భూతాపం పెరిగి.. నీటి సమస్య ఏర్పడింది. అలానే అడవుల్లోని చెట్లను నరకడంతో ఆ ప్రాంతాల్లో నివసించే వన్యప్రాణాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అందుకే అడవిలో ఉండాల్సిన వన్యప్రాణులు, క్రూరమృగాలు జనవాసాల్లోకి వచ్చి హంగామా సృష్టిస్తున్నాయి. గ్రామాలు, పట్టణాల్లోకి ప్రవేశించిన చిరుత, పెద్దపులి వంటి వన్యమృగాలు పలుమార్లు ప్రజలపై దాడి చేశాయి. ఈ ఘటనలకుసోషల్ మీడియాలో కూడా ఇలాంటి దృశ్యాలు, సంఘటనలకు సంబంధిన వీడియోలు తరచూ చూస్తుంటాం. ఇందులో ముఖ్యంగా చిరుతలు, పెద్దపులుల, ఎలుగుబంట్లు ప్రజల ఇళ్లలోకి కూడా ప్రవేశించి జనాలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా ఓ చిరుత ఓ ఇంట్లోకి ప్రవేశించి ఐదుగురిపై దాడి చేసింది.
ఢిల్లీలోని బురారీ అనే ప్రాంతంలో సోమవారం ఉదయం ఓ చిరుత హాల్ చల్ చేసింది. బురారీ ప్రాంతంలోకి వచ్చిన చిరుత స్థానిక ప్రజలను భయాందోళకు గురి చేసింది. చాలా సేపు ఆ ప్రాంతంలో తిరుగుతూ కలకలం సృష్టించింది. ఈక్రమంలోనే ఏకంగా ఓ ఇంట్లోకి దూరి ఐదుగురు వ్యక్తులపై దాడికి పాల్పడినట్లు అధికారులు తెలిపారు. దీనికి సోమవారం ఉదయం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంల బురారీ ప్రాంతంలోకి ప్రవేశించిన చిరుత ఇళ్ల కప్పులపై దూకుతూ స్థానిక ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేసింది. అందరు పెద్ద ఎత్తున కేకలు పెడుతూ ఆ చిరుతకు దూరంగా పారిపోయారు.
STORY | Leopard barges into house in Delhi’s Roop Nagar, 5 injured
READ: https://t.co/EbH7OulTMV
VIDEO:
(Source: Third Party) pic.twitter.com/7bJRdu08YH— Press Trust of India (@PTI_News) April 1, 2024
ఇదే సమయంలో చిరుత ఇళ్లపై నుంచి దూకుతూ హంగామా చేసింది. అలానే ఏకంగా ఓ ఇంట్లోకి ఆ చిరుత దూరింది. అనంతరం ఆ ఇంట్లో ఉన్న ఐదుగురిపై దాడి చేసి గాయపరిచింది. దీంతో అప్రమత్తమైన స్థానికులు వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి చేరుకొని చిరుత దాడిలో గాయపడిన వారిని ముందుగా ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సాయంతో రెస్క్యూ టీం చిరుతను పట్టుకున్నారు. మరోవైపు ఇళ్లపై చిరుత దూకుతూ పరుగులు తీస్తున్న దృశ్యాలను స్థానికులు మొబైల్స్ లో వీడియో తీశారు. అనంతరం ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. ఇలా ఘటనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
दिल्ली के बुराड़ी इलाके के जगतपुर में घुसा तेंदुआ, कई लोगों पर किया हमला, दहशत का माहौल #Leopard #Delhi #India pic.twitter.com/NSvnfaFFxv
— Indian Observer (@ag_Journalist) April 1, 2024