iDreamPost
android-app
ios-app

వీడియో: ఘోర ప్రమాదం.. కాలి బూడిదైన ప్యాసింజర్ రైలు బోగీలు!

Lakhisarai Junction- Passenger Train Catches Fire: ప్యాసింజర్ రైలులో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా వ్యాపించిన మంటలకు బోగీలు దాదాపుగా కాలి బూడిద అయిపోయాయి. ప్రస్తుతం ఆ దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Lakhisarai Junction- Passenger Train Catches Fire: ప్యాసింజర్ రైలులో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా వ్యాపించిన మంటలకు బోగీలు దాదాపుగా కాలి బూడిద అయిపోయాయి. ప్రస్తుతం ఆ దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

వీడియో: ఘోర ప్రమాదం.. కాలి బూడిదైన ప్యాసింజర్ రైలు బోగీలు!

ఘోర రైలు ప్రమాదం ప్రస్తుతం దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఒక ప్యాసింజర్ రైలు తగలబడిపోయింది. ఆ రైలులో ఉన్న పలు బోగీలు అగ్నికి ఆహుతి అయ్యాయి. దాదాపుగా కొన్ని బోగీలు కాలి బూడది అయ్యాయి. ప్రస్తుతం ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘోర రైలు అగ్నిప్రమాదం లఖీ సారాయ్ జంక్షన్, బిహార్ లో జరిగింది. పాట్నా నుంచి జార్ఖండ్ వెళ్లే ప్యాసింజర్ రైలులో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఎందుకు ఈ ప్రమాదం జరిగింది? ఎంతమందికి గాయాలు అయ్యాయి? ఎవరైనా ప్రాణాలు కోల్పోయారా? అనే వివరాలను ఇంకా అధికారులు వెల్లడించలేదు.

ఈ ప్యాసింజర్ రైలులో మొదట ఒక బోగీలో ఈ మంటలు చెలరేగాయి. ఆ తర్వాత మంటలు పలు బోగీలకు వ్యాపించాయి. అందరూ చూస్తుండగానే.. బోగీలు అగ్నికి ఆహుతి అయిపోయాయి. ఎమెర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. సమాజారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అయితే ఎందుకు ఈ ప్రమాదం జరిగింది అనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు. అలాగే ఎంత మందికి గాయాలు అయ్యాయి అనే విషయం కూడా తెలియాల్సి ఉంది. రైలు ప్రమాద దృశ్యాలు చూసిన నెటిజన్స్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆ దృశ్యాల్లో దాదాపుగా కొన్ని బోగీలు పూర్తిగా కాలిపోయినట్లు కనిపిస్తోంది. అందరూ సురక్షితంగానే ఉన్నారని భావిస్తున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై కూడా అగ్నిమాపక సిబ్బంది, రైల్వే సిబ్బంది దర్యాప్తు చేస్తారు. ఆ తర్వాత అధికారిక సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంటుంది.