iDreamPost
android-app
ios-app

ఎయిర్‌పోర్ట్‌లో వృద్ధుడికి గుండెపోటు.. సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన లేడీ డాక్టర్

గుండెపోటు మరణాలతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్ కు గురవుతున్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఓ వృద్ధుడు గుండెపోటుకు గురవ్వగా సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడింది లేడీ డాక్టర్.

గుండెపోటు మరణాలతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్ కు గురవుతున్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఓ వృద్ధుడు గుండెపోటుకు గురవ్వగా సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడింది లేడీ డాక్టర్.

ఎయిర్‌పోర్ట్‌లో వృద్ధుడికి గుండెపోటు.. సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన లేడీ డాక్టర్

ఇటీవలి కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుకు గురవుతున్నారు. హార్ట్ ఎటాక్ మరణాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. చిన్న పిల్లల దగ్గర్నుంచి వృద్ధుల వరకు గుండెపోటుతో ప్రాణాలను కోల్పోతున్నారు. అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంతో ఉన్నవారు ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతున్నారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకునే వారు సైతం హార్ట్ ఎటాక్ భారిన పడుతున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఓ ప్రయాణికుడు హార్ట్ ఎటాక్ కు గురయ్యాడు. ఆకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. వెంటనే అక్కడే ఉన్న ఓ డాక్టర్ అతనికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడింది.

కరోనా అనంతరం గుండెపోటు మరణాలు ఎక్కువైపోయాయని పలు నివేదికలు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎవరైనా వ్యక్తులు హార్ట్ ఎటాక్ కు గురైనప్పుడు వెంటనే సీపీఆర్ చేస్తే ప్రాణాలను కాపాడొచ్చని విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఇలా సీపీఆర్ చేసి గుండెపోటుకు గురైన వ్యక్తుల ప్రాణాలు కాపాడిన సంఘటనలు చాలానే ఉన్నాయి. ఈ క్రమంలో ఓ వైద్యురాలు ఢిల్లీ ఎయిర్ పోర్టులో హార్ట్ ఎటాక్ కు గురైన వ్యక్తికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడింది. ఢిల్లీ ఎయిర్ పోర్టులో 60 ఏళ్ల వయసున్న వ్యక్తి గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే మహిళా డాక్టర్ అతడి ఛాతిపై నొక్కుతూ ఊపిరి నిలిపేందుకు శాయశక్తులా ప్రయత్నించింది. సీపీఆర్ చేసి చివరికి అతడి ప్రాణాలను కాపాడింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. సీపీఆర్ చేసి వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్యురాలిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తల్లి జన్మనిస్తే.. డాక్టర్ పునర్జన్మనిచ్చిందంటూ కొనియాడుతున్నారు.