Arjun Suravaram
ఓ మహిళ గొప్ప డాక్టర్ కావాలనీ ఎంతో మందికి సేవలు అందించాలని భావించింది. అందుకే పీజీ చదివేందుకు కుటుంబానికి దూరంగా హాస్టల్ లో ఉంటుంది. అయితే సోమవారం నాడు దారుణం చోటుచేసుకుంది.
ఓ మహిళ గొప్ప డాక్టర్ కావాలనీ ఎంతో మందికి సేవలు అందించాలని భావించింది. అందుకే పీజీ చదివేందుకు కుటుంబానికి దూరంగా హాస్టల్ లో ఉంటుంది. అయితే సోమవారం నాడు దారుణం చోటుచేసుకుంది.
Arjun Suravaram
మానవ జీవితం అనేది చాలా అరుదైనది. అందుకే తమ లైఫ్ ను ఎంతో గొప్పగా గడపాలని భావిస్తుంటారు. ఈ క్రమంలో కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు అధిరోహిస్తుంటారు. అలానే ఓ మహిళ కూడా వైద్య విద్యాను పూర్తి చేసింది. గొప్ప డాక్టర్ కావాలనీ ఎంతో మందికి సేవలు అందించాలని భావించింది. అందుకే పీజీ చదివేందుకు కుటుంబానికి దూరంగా హాస్టల్ లో ఉంటుంది. అయితే అదే హాస్టల్లో దారుణమైన స్థితిలో ఆ మహిళ కనిపించింది. మరి.. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..
చెన్నైలోని లేడీస్ హాస్టల్ లో శరణిత(32) అనే మహిళ ఉంటుంది. ఎంబీబీఎస్ చదివిన ఆమె కోయంబత్తూరులో వైద్యురాలిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆమె భర్త కూడా వైద్యుడే. ఇలా అందంగా వారి సంసార జీవితం సాగిపోతుంది. శరణిత గొప్పడాక్టర్ కావాలనే ఉద్దేశంతో పీజీ చదువుతుంది. చెన్నైలోని మహిళ వసతి గృహంలో ఉంటూ పీజీని చదువుతున్నారు. ఆమె పీజీ సంబంధించిన ఒక పరీక్ష రాయడం కోసం ఆమె చెన్నైకి వెళ్లి లేడీస్ హాస్టల్లో వుంటున్నారు. ఈక్రమంలోనే రోజూ భర్తతో ఫోన్ లో మాట్లాడేది. అలానే సోమవారం రోజున శరణితకు భర్త ఫోన్ చేశాడు. శరణిత వైపు నుంచి స్పందన రాలేదు.
కాసేపటి తరువాత తిరిగి ఫోన్ చేసిన.. కూడా ఆమెవైపు నుంచి స్పందన లేదు. దీంతో ఆయన లేటీస్ హాస్టల్ ఓనర్ కి ఫోన్ చేసి విషయం చెప్పాడు. దీంతో వారు శరణితి ఉంటే రూమ్ కి వెళ్లగా లోపలి నుంచి గడియ పెట్టి ఉంది. దీంతో వారు తలుపులు పగులగొట్టి లోపలకి వెళ్ళి చూశారు. లోపల చేతుల్లో లాప్‌టాప్, ఛార్జర్ పట్టుకుని వున్న శరణిత కుప్పకూలిపోయిన స్థితిలో కనిపించారు. ఆమెను పరీక్షించగా అప్పటికే చనిపోయారని గుర్తించారు. లాప్‌టాప్ ఛార్జర్ కేబుల్ డ్యామేజ్ అవడం వల్ల కరెంట్ షాక్ కొట్టి ఆమె చనిపోయినట్టు తెలుస్తోంది. శరణిత మృతి వారి కుటుంబంలో విషాద ఛాయాలు అలుముకున్నాయి.
ఇలా ఛార్జీంగ్, ఫోన్ లు పేలడం వంటి ఘటన కారణంగా ఇప్పటికే పలువురు మృతి చెందారు. ఇంజినీరింగ్ చదువుతున్న ఓ యువతి కూడా ల్యాప్ టాప్ పేలిపోయి మృతి చెందింది. అలానే ఓ యువకుడు కూడా సెల్ ఫోన్ ఛార్జీంగ్ పెడుతుండగా కరెంట్ షాక్ కొట్టి మరణించాడు. ఇలా ఎలక్ట్రిక్ వస్తువులు పేలిపోయిన ఘటనల్లో మరెందరో తీవ్రంగా గాయపడి జీవితాన్ని నరకంగా అనుభవిస్తున్నారు. తాజాగా గొప్ప వైద్యురాలిగా కలలు కన్న ఆ మహిళ జీవితం అర్ధాంతరం ముగిసింది. మరి.. ఇలాంటి విషాద ఘటనల నివారణకు చర్యలు ఏమిటి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.