iDreamPost
android-app
ios-app

వీడియో: స్కూటీని తగిలాడని స్విగ్గీ బాయ్‌పై మహిళ అరాచకం!

  • Published Sep 15, 2023 | 5:35 PM Updated Updated Sep 15, 2023 | 5:35 PM
  • Published Sep 15, 2023 | 5:35 PMUpdated Sep 15, 2023 | 5:35 PM
వీడియో: స్కూటీని తగిలాడని స్విగ్గీ బాయ్‌పై మహిళ అరాచకం!

ఈ మధ్య కాలంలో జనాల్లో అసహనం బాగా పెరిగిపోయింది. చిన్న చిన్న విషయాలకు కూడా చాలా సీరియస్‌గా స్పందిస్తున్నారు. తమ తప్పు ఉన్నా కూడా ఎదుటి వ్యక్తిని నిందిస్తున్నారు. తాజాగా, ఓ మహిళ స్విగ్గీ డెలివరీ బాయ్‌పై అరాచకానికి పాల్పడింది. అతడి బైకు ఆమె స్కూటీని తాకిందన్న కోపంతో తీవ్ర స్థాయిలో రెచ్చిపోయింది. నడి రోడ్డుపై అతడిని బూటుతో చావకొట్టింది. ఆ వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన ఓ స్విగ్గీ డెలివరీ బాయ్‌ తన బైకుపై డెలివరీకి వెళుతున్నాడు.

రోడ్డుపై వెళుతుండగా అతడి బైకు, ఓ మహిళ స్కూటీని చిన్నగా తాకింది. ఈ ప్రమాదం జరగటానికి సదరు మహిళ కూడా ఓ కారణమే. అయినప్పటికి మహిళ తన తప్పును పక్కన పెట్టి.. స్విగ్గీ డెలివరీ బాయ్‌పై రెచ్చిపోయింది. తన బూటు తీసి అతడిపై విచక్షనా రహితంగా దాడి చేసింది. శరీరంపై ఎక్కడ పడితే అక్కడ బూటుతో కొట్టింది. అంతటితో ఆగకుండా కాలుతో కూడా దాడి చేసింది. ఇష్టం వచ్చినట్లు బూతులు కూడా తిట్టింది. రోడ్డుపై ఉన్న వారు ఇదంతా చూస్తూ నిలబడ్డారే తప్ప ఆమెను పక్కు లాగే ప్రయత్నం చేయలేదు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ ఈ మధ్య కాలంలో ఇలాంటి సంఘటనకు బాగా పెరిగిపోయాయి’’.. ‘‘ పాపం డెలివరీ బాయ్స్‌ని చాలా దారుణంగా చూస్తూ ఉన్నారు’’.. ‘‘ ఇలాంటి వాళ్ల వల్లే ఆడవాళ్లకు చెడ్డ పేరు వస్తోంది’’.. ‘‘ ఆమె మహిళ కాదు.. రాక్షసి ’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişajaxbet girişgrandpashabet