iDreamPost
android-app
ios-app

75 మంది కూలీలను తొలిసారి విమానం ఎక్కించిన యజమాని.. ఎందుకో తెలుసా?

  • Published Feb 07, 2024 | 9:23 PM Updated Updated Feb 07, 2024 | 9:23 PM

చాలా మందికి ఆర్థిక స్థోమత లేక పోవడంతో విమానం ఎక్కాలనే కోరిక నెరవేరకుండానేపోతుంది. అలాంటిది 75 మంది కూలీలకు విమానం ఎక్కాలనే కల నెరవేరింది.. ఎలాగో తెలుసా?

చాలా మందికి ఆర్థిక స్థోమత లేక పోవడంతో విమానం ఎక్కాలనే కోరిక నెరవేరకుండానేపోతుంది. అలాంటిది 75 మంది కూలీలకు విమానం ఎక్కాలనే కల నెరవేరింది.. ఎలాగో తెలుసా?

75 మంది కూలీలను తొలిసారి విమానం ఎక్కించిన యజమాని.. ఎందుకో తెలుసా?

ఆకాశంలో విమానం చూస్తున్నప్పడల్లా జీవితంలో ఒక్కసారైనా విమానం ఎక్కాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. కానీ విమానం ఎక్కాలంటే అంత ధర చెల్లించే స్థోమత లేక చాలా మందికి ఆ కోరిక.. కోరికగానే మిగిలిపోతుంది. ఇటీవల కొన్ని విమాన సంస్థలు ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తూ.. సామాన్యులకు విమాన ప్రయాణం చేసే సౌకర్యం కల్పిస్తున్నారు. మరికొంతమందికి ఏదోఒక అదృష్టం కలిసి వచ్చి విమాన ప్రయాణం చేసే అవకాశం లభిస్తుంది. ఓ సంస్థ యజమాని పుణ్యమా అని భవన నిర్మాణ కూలీలుగా పనిచేసే వారు ఎన్నడూ ఊహించని విధంగా విమాన ప్రయాణం చేసే అదృష్టం కలిసి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

తమిళనాడులోని మధురైకి చెందిన ఓ నిర్మాణ సంస్థ యజమాని తన వద్ద పనిచేస్తున్న 75 మంది భవన నిర్మాణ కార్మికులను మధురై నుంచి చెన్నైకి విమానంలో తీసుకువెళ్లారు. చెన్నైకి చేరుకున్న కార్మికులకు  వసతి ఏర్పాటు చేసి అక్కడ ఉండే ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలను చూపించారు. చెన్నైలోని మెరీనా బీచ్, ఎంజీఆర్, అన్నాదొరై సమాధులు, డీఎండీ అధినేత విజయ్ కాంత్ స్మారక స్థూపం తో సహా ఇతర ప్రాంతాలను ఆయన దగ్గరుండి మరీ చూపించారు. తర్వాత  హూటల్ లో వారికి నచ్చిన విందు ఏర్పాటు చేశారు. అనంతరం వారందరినీ లగ్జరీ బస్సులో తిరిగి మధురైకి పంపించారు. ఇలా చేయడం వల్ల తనకు ఎంతో సంతృప్తిగా ఉందని భవన నిర్మాణ యజమాని మాయన్ అన్నారు.

ఈ సందర్బంగా భవన నిర్మాణ సంస్థ యజమాని మాయన్ మాట్లాడుతూ.. ‘నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను.. చిన్నతనంలో చాలా కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు పడ్డాం. నేను 2001 లో మొదటిసారి విమానం ఎక్కాను. అప్పుడు ఎయిర్ పోర్ట్ లోకి వెళ్లి విమానం టికెట్ ఎలా కొనాలో కూడా నాకు తెలియాదు. విమానంలో ప్రయాణించాలంటే ఏం చేయాలని కొంతమందిని అడిగాను. తెలిసిన ఓ వ్యక్తి నాకు వివరాలు చెప్పారు.. అక్కడికి వెళ్లి టికెట్ కొన్నాను. అది నాకు చెక్కులా అనిపించింది.. విమానం టికెట్ చూసి నాకు ఎంతో ఆనందం కలిగింది. ఇప్పుడు నాకు దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు.. అందుకే నేను నా వద్ద పనిచేస్తున్న కార్మికులను తీసుకువెళ్లేందుకు ప్లాన్ చేశాను., వారందరినీ పిలిచి విషయం చెప్పాను. ఎయిర్ పోర్టులో వారి చేతుల్లో టికెట్ పెట్టగానే అందరి కళ్లలో ఆనందం వెల్లువిరిసింది. విమానం లోకి ఎక్కిన తర్వాత టేకాఫ్ అవుతుంటే వారి ముఖాల్లో సంతోషం నాకు స్పష్టంగా కనిపించింది’ అని అన్నారు. ఈ సందర్భంగా భవన కార్మికులు మాట్లాడుతూ.. మేం తొలిసారిగా విమాన ప్రయాణం చేశాం, మా యజమాని చెప్పినపుడు చాలా సంతోషం అనిపించింది. చాలా మందికి ఒక్కసారైనా విమానం ఎక్కాలనే కోరిక ఉంటుంది. మా కల నెరవేర్చిన మాయన్ సార్ కి ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాం అని అన్నారు. దీనికి సంబందించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.