కోల్‌కొతా వైద్యురాలి కేసు.. సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు!

Kolkata Trainee Doctor Murder Case: కోల్‌కొతాలో ట్రైనీ డాక్టర్‌ని కామాంధులు దారుణంగా అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన ఘటన యావత్ భారత్ దేశంలో తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.

Kolkata Trainee Doctor Murder Case: కోల్‌కొతాలో ట్రైనీ డాక్టర్‌ని కామాంధులు దారుణంగా అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన ఘటన యావత్ భారత్ దేశంలో తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.

ఒక మహిళ అర్థరాత్రి సమయంలో ఒంటరిగా  నడిచినపుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు అని గాంధీజీ అన్నారు. కానీ ఇప్పుడు మహిళలు పట్టపగలు నడిరోడ్డుపై నడవాలంటే భయపడే పరిస్థితులు వచ్చాయి. ఒంటరి మహిళలపై కామాంధులు రెచ్చిపోతున్నారు. చిన్న పిల్లల నుంచి వృద్ద మహిళల వరకు ఎవరినీ వదలడం లేదు. దారుణం ఏంటంటే సామూహిక అత్యాచారాలకు పాల్పపడి అన్యాయంగా హత్యలు చేస్తున్న ఘటనలు నిత్యం ఎక్కడో అక్కడ వెలుగు చూస్తూనే ఉన్నాయి. కోల్‌కొతాలోని ఆర్జీకార్ మెడికల్ కాలేజ్ లో వైద్యరాలి పై అత్యాచారం, హత్య తీవ్ర సంచలనం సృష్టించింది. సామాన్యులు నుంచి సెలబ్రెటీల వరకు ఈ దారుణ ఘటనపై గళం విప్పారు. తాజాగా ఈ కేసులో కీలక పరిణామాం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

కోల్‌కొతాలోని ఆర్‌జీ కర్‌ మెడియల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ సెమినార్ హాల్లో హత్యకు గురైన ట్రైనీ డాక్టర్ కేసులో ఎన్నో దారుణాలు వెలుగు చూశాయి.  ఈ ఘోర ఘటనకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో దుమ్మురేపాయి. యావత్ దేశం ఈ ఘటనపై స్పందిస్తూ ఆమె న్యాయం జరగాలని కోరుతున్నారు. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైద్యురాలి హత్య, అత్యాచారం కేసును సుప్రీం కోర్టు ఆదివారం సుమోటాగా స్వీకరించింది. ఆగస్టు 20న (మంగళవారం) సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డి వై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. కోల్‌కొతా హై కోర్టు ఆదేశఆల మేరకు ఈకేసును సీబీఐ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.

ఆగస్టు 9న కోల్‌కొతాలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టరపై సామూహిక అత్యాచారం, హత్య ఘటన సుమోటాగా స్వీకరించాలని ప్రధాన న్యాయమూర్తికి లేఖ పంపారు. సికింద్రాబాద్ లోని ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ పిటీషన్ తో సహా మూడు లేఖలు పిటీషన్లు సిజెఐ కి పంపించబడ్డాయి. ఈ కేసు  సిజెఐ సుమోటోగా స్పందించి, వెంటనే చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని పిటీషన్లో పేర్కొన్నారు. ఇద్దరు పిటీషనర్లు సుప్రీం కోర్టు న్యాయవాదులు రోహిత్ పాండె, ఉజ్వల్ గౌర్ లు. రోహిత్ పాండే ప్రీం కోర్టు బార్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి గా కొనసాగుతుండగా, ఉజ్వల్ గౌర్ సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ సభ్యుడిగా కొనసాగుతున్నారు. సికింద్రబాద్ లోని ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ కాలేజ్ లో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ మోనికా సింగ్ మూడో పిటీషనర్ గా ఉన్నారు. ఇదిలా ఉంటే.. ఆర్‌జీ కర్‌ ఆస్పత్రి కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు చేస్తుందన్న కారణంతో ట్రైనీ డాక్టర్ పై అఘాయిత్యానికి పాల్పపడి ఉండవొచ్చని సన్నిహితులు అంటున్నారు. ఈ ఉదంతంలోఆమెను టార్గెట్ చేసినట్లు స్నేహితులు అంటున్నారు.

Show comments