iDreamPost
android-app
ios-app

మ్యూజిక్ ఫెస్టివల్‌లో తొక్కిసలాట.. నలుగురు మృతి!

  • Published Nov 26, 2023 | 3:29 PM Updated Updated Nov 26, 2023 | 3:29 PM

ఇటీవల కొన్నిసార్లు ప్రమాదాలు ఎలా ముంచుకు వస్తాయో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. కొన్ని ప్రైవేట్ కార్యక్రమాల్లో జరుగుతున్న ప్రమాదాల వల్ల అమాయకుల ప్రాణాలు కోల్పోతున్నారు.

ఇటీవల కొన్నిసార్లు ప్రమాదాలు ఎలా ముంచుకు వస్తాయో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. కొన్ని ప్రైవేట్ కార్యక్రమాల్లో జరుగుతున్న ప్రమాదాల వల్ల అమాయకుల ప్రాణాలు కోల్పోతున్నారు.

మ్యూజిక్ ఫెస్టివల్‌లో తొక్కిసలాట.. నలుగురు మృతి!

కొన్నిసార్లు అత్యుత్సాహం ప్రాణాల మీదకు తీసుకువస్తుంటుంది. అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఉన్నవాళ్లంతా విషాదంలో మునిగిపోతుంటారు. ఇటీవల కొన్ని ఈవెంట్స్ లో నిర్వాహకులు చేస్తున్న చిన్న పొరపాట్ల వల్ల ప్రమాదాలు సంభవించి పలువురు మృత్యుఒడిలోకి చేరుకుంటున్నారు. ఎంతోమంది గాయాలపాలై ఆస్పత్రుల్లో చేరుతున్నారు. కేరళాలోని ఓ ఇంజనీరింగ్ కాలేజ్‌లో ఎంతో సంతోషంగా జరుపుకుంటున్న మ్యూజిక్ ఫెస్టివల్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

కేరళాలో విషాద ఘటన చోటు చేసుకుంది. కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (సీయూఎస్ఏటీ) లో జరిగిన మ్యూజిక్ ఈవెంట్ లో హఠాత్తుగా తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో నలుగురు విద్యార్థులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో 60 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. శనివారం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన టెక్ ఫెస్ట్ సందర్భంగా ఈ విషాద ఘటన జరిగింది. వాస్తవానికి మ్యూజికల్ ఫెస్టివల్ కి పాసులు ఉన్నవారికి మాత్రమే అనుమతి ఇచ్చారు. ఓపెన్ ఎయిర్ ఆడిటోరియంలో లోపలి వెళ్లేందుకు, బయటకు వచ్చేందుకు ఒకటే గేట్ ఉంది. పాసులు ఉన్నవారికి ఎంట్రీ గేట్ నుంచి నిర్వహకులు బ్యాచ్ ల వారీగా లోపలికి పంపించారు.

పాస్ లు లేని వారు.. యూనివర్సికటీకి సంబంధం లేని వారంతా బయట వెయిట్ చేస్తున్నారు. అంలోనే వర్షం కురియడంతో వేదిక బయట ఉన్నవాళ్లంతో ఒక్కసారిగా లోపలికి రావడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో నలుగురు విద్యార్థులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో ఇద్దరు యువకులు, ఇద్దరు యువతులు ఉన్నారు. ఈ ఘటనలో 60 మందికి పైగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడ్డ విద్యార్థులను కలమస్సేరి ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు, అగ్నిమాకప సిబ్బంది, వైద్య బృందం ఘటనా స్థలానికి చేరుకొని సహాయకచర్యలు చేపట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనపై కేరళ సీఎం పినరయి విజయన్ విచారం వ్యక్తం చేశారు.  మంత్రి వర్గం బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందేలా ఆదేశాలు జారీ చేశారు. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.