Dharani
Kerala Floods Wayanad 2024: కేరళ వరద ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆ యువతి కష్టం చూసి దేశం అంతా కన్నీరు పెడుతోంది. ఆ వివరాలు..
Kerala Floods Wayanad 2024: కేరళ వరద ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆ యువతి కష్టం చూసి దేశం అంతా కన్నీరు పెడుతోంది. ఆ వివరాలు..
Dharani
మరి కొన్ని రోజుల్లో ఆ కుటుంబంలో పెళ్లి బాజాలు మోగాల్సి ఉంది. పెద్ద కుమార్తె శృతికి ఆమె తల్లిదండ్రులు వివాహం కుదిర్చారు. ఇంట్లో ఎక్కడ చూసిన ఆ సందడే కనిపిస్తోంది. పెళ్లి పనుల గురించే మాట్లాడుకుంటున్నారు. అసలే వర్షాకాలం.. త్వరగా అన్ని పనులు పూర్తి చేసుకోవాలని భావించారు ఆ తల్లిదండ్రులు. సోమవారం రాత్రి కూడా పెళ్లి పనుల గురించే చర్చించుకుని ఆ తర్వాత నిద్రపోయారు. అయితే వారికి ఏమాత్రం అవగాహన లేదు. ఆ రాత్రి వారి జీవితాల్లో కాళరాత్రి అవుతుందని.. తెల్లారేలోపు తమ బతుకులు తెల్లారతాయని వారు ఏమాత్రం ఊహించలేదు. భారీ వరదల కారణంగా కొండచరియలు విరిగిపడి వినాశనం నెలకొనగా.. శృతి తల్లిదండ్రులు, తోబుట్టుబులు, బంధువులు అందరు కొట్టుకుపోయారు. ఆమె మాత్రమే ఏకాకిగా మిగిలింది. సోదరి మృతదేమం మాత్రమే లభ్యమయ్యింది. చెల్లి డెడ్‌బాడీని పట్టుకుని.. అమ్మానాన్న ఎక్కడ అంటూ గుండెలు పగిలేలా రోదిస్తుంది. ఆమెను చూసిన ప్రతి ఒక్కరు కన్నీరు పెట్టుకుంటున్నారు. వరద వారి జీవితాల్లో కన్నీరు తప్ప ఇంకేం మిగల్చలేదు.
కేరళ వయనాడులో చోటు చేసుకున్న కొండచరియలు విరిగిపడి భారీ వరదలు ముంచెత్తిన సంఘటన రాష్ట్రంలో తీవ్ర విషాద ఛాయలు నింపింది. ఊళ్లకు ఊళ్లే మునిగిపోయాయి. వందల మంది వరదల్లో గల్లంతయ్యారు. ఇప్పటి వరకు 160 మంది వరకు మృతి చెందినట్లుగా అధికారులు చెబుతున్నారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. ఇక వరదల్లో మెప్పడి ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం తుడిచిపెట్టుకుపోయింది. 9 మంది కుటుంబ సభ్యుల్లో ఏడుగురు గల్లంతవ్వగా.. ఒకరి మృతదేమం మాత్రమే లభించింది. ఈఘటనలో ఒక్కరు మాత్రమే బతికి బట్టకట్టారు.
మెప్పడి ప్రాంతానికి చెందిన శృతి(25) కుటుంబంలో మొత్తం 9 మంది ఉంటున్నారు. తండ్రి బొమలప్పాన్, తల్లి సావిత్రి, నానమ్మ, తాతయ్యలతో పాటుగా శృతి, ఆమె తోబుట్టువులు మొత్తం తొమ్మిది మంది ఉన్నారు. తాజాగా శృతికి వివాహం నిశ్చయమైంది. మరి కొన్ని రోజుల్లో ఆమెకి పెళ్లి చేసి అత్తారింటికి పంపనున్నారు. శృతి కోజికోడ్ మిమ్స్ ఆస్పత్రిలో పని చేస్తుంది. ఇలా ఉండగానే మంగళవారం చోటు చేసుకున్న వరదలు ఆ కుటుంబాన్ని మింగేశాయి. శృతి, ఆమె చెల్లి శ్రేయ తప్ప మిగతా అందరూ గల్లంతయ్యారు. తనకు తోడుగా కనీసం చెల్లి అయినా ఉందని భావించేలోపే.. శ్రేయ కూడా మృతి చెందింది. ఇక ఆ కుటుంబంలో శృతి ఒక్కతే మిగిలింది. చెల్లి డెడ్‌బాడీని పట్టుకుని శృతి కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది. ఆమె కథ తెలిసిన ప్రతి ఒక్కరు కన్నీరు పెట్టుకుంటున్నారు. మిగతా కుటుంబ సభ్యులు మృతదేహాల కోసం శృతి పీహెచ్‌సీ వద్ద ఎదురు చూస్తోంది.