Wayanad: వయనాడులో ప్రకృతి విలయ.. కొట్టుకుపోయిన 4 గ్రామాలు.. వినాశనానికి కారణం ఇదే!

Wayanad Landslide Disaster: భారీ వర్షంతో దేవభూమి కేరళ.. అతలాకుతలం అవుతోంది. మరి ఈ ప్రకృతి ప్రకోపానికి గల కారణాలు ఏంటి అంటే..

Wayanad Landslide Disaster: భారీ వర్షంతో దేవభూమి కేరళ.. అతలాకుతలం అవుతోంది. మరి ఈ ప్రకృతి ప్రకోపానికి గల కారణాలు ఏంటి అంటే..

భారీ వర్షాలతో దేవ భూమి కేరళ అల్లకల్లోలం అయిపోతుంది. ఆకస్మిక వరదల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో.. వయనాడ్‌లోని మెప్పడిలో భారీ విలయం సంభవించింది. భారీ వరదల నేపథ్యంలో.. సుమారు 146 మందికి పైగా జనాలు ప్రాణాలు విడిచారు.. 650 మంది వరదల్లో తప్పిపోయారు. ఇక వందల మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. కేరళలో ఆరు సంవత్సరాల క్రితం అనగా 2018లో సంభవించిన వరదలు భారీ వినాశనాన్ని సృష్టించాయి. నాటి వరదల్లో సుమారు 483 మంది మృతి చెందారు. అయితే ఈ సారి దానికి మించిన విలయం సంభవించింది. ఎక్కడ చూసినా హృదయవిదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. భారీ వరదల నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన బలగాలు నిరంతరాయంగా సహాయక చర్యలు చేపడుతున్నాయి. కేరళకు పక్క రాష్ట్రాలు ఆర్థిక సాయం అందిస్తున్నాయి.

అయితే వయనాడులో ఈ స్థాయిలో ప్రకృతి విపత్తులకు కారణం అరేబియా సముద్ర జలాలు వేడెక్కడమేనని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీని ప్రభావంతో స్వల్ప వ్యవధిలోనే దట్టమైన మేఘాలు ఏర్పడి అత్యంత భారీ వర్షాలకు కారణమైందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఇదేకాక కేరళలోని 14.5 శాతం భూభాగంలో భారీ వర్షాలు, వరదల సంభవించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీని ఫలితంగానే వయనాడ్‌, కోజికోడ్‌, మలప్పురం, కన్నూర్‌లలో భారీ వర్షాలు కురిశాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక పర్యావరణ మార్పులు, అడవుల నరికివేత వంటివి వర్షాకాలంలో కొండ చరియలు విరిగిపడుతున్న ఘటనలకు ప్రధాన కారణం అంటున్నారు.

అయితే, అరేబియా తీరంలో ఈ తరహా దట్టమైన మేఘాల ధోరణిని శాస్త్రవేత్తలు ముందుగానే గుర్తించారు. ముఖ్యంగా ఆగ్నేయ అరేబియా జలాలు వేడెక్కడంతో కేరళ సహా ఈ ప్రాంతం ఉష్ణగతికంగా అస్థిరంగా మారితున్నట్టు తమ పరిశోధనలో వెల్లడయ్యిందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వాతావరణంలోని ఈ అస్థిరతే దట్టమైన మేఘాలు ఏర్పడటానికి కారణమని తెలిపారు. ఫలితంగానే ఈ భారీ వర్షాలు కురుస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా.. ఇప్పటికే భారీ వరదలు, కొండచరియలు విరిగిపడి.. అతలాకుతలంగా మారిన కేరళను వరదలు ఇప్పట్లో వదిలే సూచన కనిపించడం లేదు. మరి కొన్ని రోజులు ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక వయనాడ్‌, మలప్పురం, కోజికోడ్‌, కన్నూర్‌, ఇడుక్కి, త్రిసూర్, కాస్‌గోఢ్, పాలక్కడ్ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. తిరువనంతపురం, కొల్లాం మినహా మిగతా అన్ని జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు. వయనాడ్‌ బాధితులంతా.. వలస కార్మికులే అని తెలుస్తోంది.

Show comments