కార్మికురాలి బిడ్డ ఆకలి తీర్చిన మహిళా పోలీస్! హేట్సాఫ్!

పోలీసులు అంటే కఠిన హృదయులు అని భావిస్తుంటారు. కానీ.. ఎంతోమంది పోలీసులు ఆపదలో ఉన్నవారిని ఆదుకొని మంచి మనసు చాటుకున్నారు.

పోలీసులు అంటే కఠిన హృదయులు అని భావిస్తుంటారు. కానీ.. ఎంతోమంది పోలీసులు ఆపదలో ఉన్నవారిని ఆదుకొని మంచి మనసు చాటుకున్నారు.

సాధారణంగా పోలీసులు అంటే ఎంతో కఠినమైన మనసు ఉన్నవాళ్లు అని భావిస్తుంటారు. శాంతి భద్రతలను సంరక్షిస్తూ, ప్రజా జీవితాలకు.. వారి ఆస్తులకు రక్షణ కల్పిస్తూ, నేరాలు, విధ్వంసాలు జరగకుండా చూసేందుక ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యవస్థ పోలీస్. పోలీసులు నేరస్తుల విషయంలో కఠినంగా ఉంటారు. సమాజంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రతిక్షణం రక్షణ కల్పిస్తూ.. న్యాయాన్ని కాపాడే క్రమంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది. దీంతో వారితో మాట్లాడాలన్నా.. ఏదైనా విషయం చెప్పాలన్నా సామాన్య పౌరులు భయపడుతుంటారు. కానీ పోలీసుల్లో కూడా మంచి మనసు ఉందని.. ఆపద సమయంలో ఆదుకుంటారని ఎంతోమంది నిరూపించారు. ఓ తల్లి అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉంటే.. ఆమె రెండు నెలల చిన్నారికి ఓ మహిళా పోలీసు పాలు ఇచ్చి ఆకలి తీర్చింది. ఈ ఘటన కేరళాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

బిడ్డ ఆకలి తల్లికే అర్తమవుతుందని అంటారు. గుక్క పట్టి ఏడుస్తున్న ముక్కూ ముఖం తెలియని ఓ చిన్నారికి ఆ తల్లి పాలిచ్చి లాలించింది. పోలీసులు అంటే కఠిన హృదయులే కాదు.. మంచి మనసుతో ప్రేమగా ఉంటారని నిరూపించింది ఓ మహిళా కానిస్టేబుల్. కేరళాలో జరిగిన ఈ సంఘటన కోట్లాది మంది ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. కేరళా రాష్ట్రం కొచ్చిలో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ శైలజన్ చేసిన గొప్ప పని గురించి దేశం మొత్తం చర్చ జరుగుతుంది. కొచ్చిలోని పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఓ ఫోన్ కాల్ వచ్చింది. వలసకార్మికురాలు అయిన ఓ మహిళ హృదయ సంబంధిత వ్యాధితో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.. ఆమెకు నలుగురు పిల్లలు. ఆసుపత్రి వద్ద ఆకలితో ఇబ్బంది పడుతూ ఏడుస్తు బిక్కు బిక్కుమంటున్నారు. వారి వద్ద ఎవరూ లేరు.. కాపాల్సిందిగా కోరుతున్నాం.. ఇదీ ఆ ఫోన్ కాల్ సారాంశం. వెంటనే స్పందించిన పోలీసులు ఆస్పత్రికి చేరుకొని ఆ చిన్నారులను స్టేషన్ కి తీసుకువచ్చారు.

ఆ నలుగురు పిల్లల్లో నాలుగు నెలల పసికందు ఉంది. పాల కోసం గుక్క పెట్టి ఏడుస్తుంది.. అది చూసి స్టేషన్ లో అందరూ బాధపడుతున్న సమయంలో శైలజన్ అనే మహిళా పోలీస్ వెంటనే స్పందించి తన పై అధికారికి పాప విషయం చెబుతూ.. తాను పాపకు పాలు ఇస్తానని చెప్పింది. అందుకు ఆయన అంగీకరించడంతో చిన్నారికి పాలు పట్టి ఆకలి తీర్చింది. తనకు 9 నెలల పాప ఉందని.. పిల్లల ఆకలి ఎలా ఉంటుందో తనకు తెలుసు అని.. పాలు పట్టి ఆకలి తీర్చినందుకు సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. వలస కార్మికురాలి పాపకు తన స్తన్యమిచ్చి ఆకలి తీర్చిన మహిళా పోలీస్ శైలజన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Show comments