ఇక మందుబాబులకు పండగే.. ముందుగానే వైన్స్‌ ఓపెన్‌.. డ్రై డేస్‌ ఎత్తివేత!

Kerala New Liquor Policy- Bars Opening Hours, Dry Days: మందుబాబులకు కిక్కిచ్చే వార్త ఇది. కొత్త లిక్కర్‌ పాలసీలో భాగంగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోబోతుంది. ఆ వివరాలు..

Kerala New Liquor Policy- Bars Opening Hours, Dry Days: మందుబాబులకు కిక్కిచ్చే వార్త ఇది. కొత్త లిక్కర్‌ పాలసీలో భాగంగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోబోతుంది. ఆ వివరాలు..

మద్యం సమాజాన్ని పట్టి పీడించే అతి పెద్ద మహామ్మారి. మద్యపానం వల్ల ఏటా ఎందరో ప్రాణాలు కోల్పోతుంటారు. మందు తాగి అనారోగ్యం బారిన పడి మృతి చెందేవారు కొందరైతే.. ఆ మత్తులో చోటు చేసుకునే ప్రమాదాలు, నేరాలు, దారుణాల వల్ల కన్నుమూసేవారే అధికం. సమాజంలో చోటు చేసుకుంటున్న అనేక దారుణాలు, నేరాలకు ప్రధాన కారణం మద్యపానం అని చెప్పవచ్చు. మరి ఈ అలవాటు వల్ల ఇన్ని నష్టాలు వాటిల్లుతున్నా.. జనాలు మారడం లేదు.. పైగా ప్రభుత్వాలు కూడా సంపూర్ణ మద్యపానం అమలు చేసే ధైర్యం చేయవు. కారణం.. ప్రభుత్వాలకు ఆదాయ వనరు మద్యపానం అనే చెప్పవచ్చు. అందుకే ఏ సర్కార్‌ మద్యపాన నిషేధం చేసే సాహసం చేయదు. కుదిరితే రేట్లు పెంచడం, మరిన్ని వైన్స్‌కు అనుమతివ్వడం చేస్తాయి. తాజాగా ప్రభుత్వం ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. మందుబాబులకు భారీ శుభవార్త చెప్పడానికి రెడీ అవుతోంది. దీనిలో భాగంగా వైన్స్‌ ముందుగానే ఓపెన్‌ చేయడమే కాక.. డ్రై డేస్‌ను ఎత్తివేసే దిశగా ఆలోచనలు చేస్తోంది. ఆ వివరాలు..

కేరళ ప్రభుత్వం మందుబాబులకు శుభవార్త చెప్పడానికి రెడీ అవుతోంది. కొత్త లిక్కర్‌ పాలసీ ఏర్పాటుకు రెడీ అవుతోంది. ఈ ఏడాది అనగా.. 2024, ఆగస్టు మధ్య నాటికి దీన్ని అమలు చేసేందుకు కేరళ సర్కార్‌ రెడీ అవుతోంది. కొత్త మద్యం పాలసీ అమలు నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వానికి అనేక విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. దీనిలో ప్రధానమైంది.. డ్రై డే ఎత్తివేత. సాధారణంగా జాతీయ పండుగలు, కొన్ని లోకల్‌ పర్వదినాల సమయాల్లో వైన్స్‌ బంద్‌ చేస్తారు. కానీ కేరళలో మాత్రం ప్రతి నెలా ఒకటో తారీఖు డ్రై డే పాటిస్తారు. అంటే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే.. కేరళలో డ్రై డేస్‌ అధికం. ప్రతి నెల ఒకటో తారీఖు డ్రై డే అంటే.. ఏడాదికి 12 డ్రై డేలుంటాయి. దాంతో వీటిని ఎత్తి వేయాలని చాలా ఏళ్లుగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం తాజా లిక్కర్‌ పాలసీలో కీలక నిర్ణయాలు తీసుకుంది.

ఇక కొత్త లిక్కర్‌ పాలసీలో భాగంగా ప్రభుత్వం డ్రై డే ఉపసంహరణకు అంగీకరించలేదు. నెల ప్రారంభం అనగా మొదటి తారీఖున డ్రై డేస్‌ కొనసాగింపు ఉంటుందని తెలిపింది. కాకపోతే వైన్స్‌ ఒపెనింగ్‌ టైమింగ్స్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అనగా ఇప్పటి సమయం కన్నా ముందుగానే వైన్స్‌ ఓపెన్‌ చేయడానికి కేరళ ప్రభుత్వం అనుమతిస్తోంది. అంతేకాక పర్యాటక శాఖకు లబ్ధి చేకూర్చేలా కొత్త లిక్కర్‌ పాలసీలో అనేక నిర్ణయాలు తీసుకుందని సమాచారం. అలానే ఆన్‌లైన్‌లో మద్యం అమ్మకాలపై కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో మద్యం హోం డెలివరీపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు.

ఇక మద్యం హోం డెలివరీకి అనుమతిస్తే.. వైన్స్‌ దగ్గర రద్దీ తగ్గే అవకాశం ఉండటమే కాక.. దీని ద్వారా సుమారు 3 వేల మందికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉందని.. ప్రీమియం బ్రాండ్స్‌ కొనుగోళ్లు పెరుగుతాయని.. దాని ద్వారా ప్రభుత్వానికి కూడా ఆదాయం సమకూరుతుంది అంటున్నారు. మరి కొత్త లిక్కర్‌ పాలసీలో ఎలాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయో తెలియాలంటే కొన్ని రోజులు ఎదురు చూడాలి.

Show comments