Dharani
Gold Smuggling: ఇక్కడ ఉన్న యువతిని చూశారా.. ఎంత అందంగా ఉందో. పైగా మంచి ఉద్యోగం కూడా. కానీ ఆమె చేసే చండాలపు పనుల గురించి తెలిస్తే మాత్రం అసహ్యించుకుంటారు.
Gold Smuggling: ఇక్కడ ఉన్న యువతిని చూశారా.. ఎంత అందంగా ఉందో. పైగా మంచి ఉద్యోగం కూడా. కానీ ఆమె చేసే చండాలపు పనుల గురించి తెలిస్తే మాత్రం అసహ్యించుకుంటారు.
Dharani
భారతీయులకు బంగారం అంటే ఎంత మోజో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ధర ఎంత పెరిగినా సరే.. మనవాళ్లు పసిడి కొనుగోలు మాత్రం ఆపరు. పండగలు, శుభకార్యాలు ఇలా సందర్భం దొరికిన ప్రతి సారి బంగారం కొంటారు. ధర చుక్కలను తాకుతున్న సరే.. మన దేశంలో మాత్రం గోల్డ్ అమ్మకాలకు బ్రేక్ పడటం లేదు. ఇక బంగారం కొనుగోళ్లు ఏ రేంజ్‌లో సాగుతున్నాయో.. దేశంలోకి అక్రమ గోల్డ్ రవాణా కూడా అదే స్థాయిలో సాగుతుంది. బంగారం అక్రమ రవాణాను అరికట్టడం కోసం కస్టమ్స్ అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నప్పటికి.. పూర్తి స్థాయిలో దీన్ని కట్టడి చేయలేకపోతున్నారు. నిత్యం ఏదో ఓ చోట బంగారం అక్రమ రవాణాకు సంబంధించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక తాజాగా మరో సారి ఈ తరహా ఘటన వెలుగు చూసింది. కానీ ఇక్కడ బంగారం అక్రమ రవాణాకు పాల్పడ్డ వ్యక్తి ఎవరో తెలిస్తే.. షాక్‌కు గురవుతారు.
కస్టమ్స్ అధికారులు బంగారం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నాలు చేస్తూంటే.. అక్రమార్కులు మాత్రం రెచ్చిపోతున్నారు. కొన్ని సార్లు గోల్డ్‌ను అక్రమంగా రవాణా చేసే వారిలో విమానాయన సిబ్బంది ఉండటం సంచలనంగా మారుతుంది. తాజాగా ఈ తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో పని చేస్తోన్న మహిళా క్యాబిన్ క్రూ సిబ్బంది ఒకరు బంగారం అక్రమ రవాణాకు ప్రయత్నించి.. అధికారులకు పట్టబడింది. పైగా సదరు ఉద్యోగిని.. మలద్వారంలో బంగారాన్ని దాచి.. దాన్ని దాటించే ప్రయత్నం చేసింది. ఈ ఘటన కన్నూరు ఎయిర్ పోర్ట్‌లో వెలుగు చూసింది.
కోల్‌కతాకు చెందిన సురభి అనే మహిళ.. ఎయిర్‌ఇండియా క్యాబిన్ క్రూ మెంబర్‌గా విధులు నిర్వహిస్తోంది. ఈక్రమంలో తాజాగా ఆమె చాలా చండాలమైన పనికి పాల్పడింది. బంగారం అక్రమ రవాణాకు పాల్పడింది. అది కూడా అత్యంత అసహ్య రీతిలో. సురభి తన మలద్వారంలో బంగారాన్ని దాచి.. దాన్ని అక్రమంగా రవాణా చేసే ప్రయ్నతం చేసింది. తను మస్కట్ నుంచి వస్తుండగా ఇలాంటి చర్యలకు పాల్పడింది. అయితే సురభి మీద అనుమానం వచ్చిన అధికారులు ఆమెను చెక్ చేసి పసిడి అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. సుమారు కేజీ బంగారాన్ని మలద్వారంలో దాచి.. అక్రమంగా తరలించే ప్రయత్నం చేసింది సురభి.
అధికారుల సురభి వద్ద నుంచి బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమెని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి.. జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. ఇక తాజాగా బంగారం అక్రమ రవాణా కేసులో శశి థరూర్ పీఏ శివకుమార్ పట్టుబడ్డాడు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
ఇక మన దేశంతో పోలిస్తే.. దుబాయి, సౌదీ అరేబియా దేశాల్లో గోల్డ్ రేట్ తక్కువగా ఉంటుంది. అందుకే చాలా మంది అక్కడ నుంచి బంగారం కొనుగోలు చేసి తీసుకొస్తూ ఉంటారు. ఇలా అక్రమంగా తరలించే బంగారాన్ని వివిధ రూపాల్లో.. వేర్వేరు వస్తువులతో కలిపి.. పేస్టు రూపంలోకి మార్చి తీసుకొస్తున్న ఘటనలు కూడా వెలుగుచూశాయిమరికొందరు ఏకంగా తమ శరీరం లోపలికి చొప్పించుకుని తీసుకొచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే అరబ్ దేశాల నుంచి వచ్చే విమానాలపై నిఘా ఎక్కువగా ఉంటుందని స్మగ్లర్లు దారి మార్చుకుంటున్నారు.