Wayanad Disaster: కేరళ వయనాడ్ వరద బాధితుల లోన్లను మాఫీ చేసిన బ్యాంకు

Bank Waives All Loans For Them: మామూలుగా రైతులు తీసుకున్న రుణాలు మాఫీ అవుతాయి. అది కూడా ప్రభుత్వ పథకంలో రుణమాఫీ హామీ ఉంటేనే. కానీ హోమ్ లోన్లు, వెహికల్ లోన్లు వంటివి మాఫీ చేయడం అనేది జరుగుతుందా? కానీ ఒక బ్యాంకు అదే చేసింది.

Bank Waives All Loans For Them: మామూలుగా రైతులు తీసుకున్న రుణాలు మాఫీ అవుతాయి. అది కూడా ప్రభుత్వ పథకంలో రుణమాఫీ హామీ ఉంటేనే. కానీ హోమ్ లోన్లు, వెహికల్ లోన్లు వంటివి మాఫీ చేయడం అనేది జరుగుతుందా? కానీ ఒక బ్యాంకు అదే చేసింది.

బ్యాంకుల్లో చాలా మంది చాలా రకాల లోన్లు తీసుకుంటూ ఉంటారు. ఇంటి రుణాలు, వాహన రుణాలు, వ్యవసాయ రుణాలు, వ్యక్తిగత రుణాలు ఇలా అవసరాన్ని బట్టి తీసుకుంటారు. అయితే హోమ్ లోన్, వాహన రుణం, పర్సనల్ లోన్ ఏది తీసుకున్నా గానీ మాఫీ అనే కాన్సెప్ట్ ఉండదు. వ్యవసాయ రుణాలు తీసుకునే రైతులకు తప్ప ఇంకెవరికీ రుణమాఫీ అనేది ఉండదు. కొంతమంది మహిళలకు ప్రభుత్వ్ పథకాల ద్వారా ఇచ్చే రుణాలు ఉంటాయి. అవి అప్పుడప్పుడూ మాఫీ చేస్తుంటారు. కానీ టూవీలర్ లోన్లు, హోమ్ లోన్లు తీసుకున్న వారి లోన్లు మాఫీ చేయడం అనేది కొత్త కాన్సెప్ట్. ఓ బ్యాంకు బాధల్లో ఉన్నారని వారి లోన్లను అన్నిటినీ మాఫీ చేసేసింది. 

కేరళలోని వయనాడ్ లో ఇటీవల వరదల విలయతాండవం ఎంత మంది ప్రాణాలను బలి తీసుకుందో అందరికీ తెలిసిందే. వందలాది మంది మృత్యువాత పడ్డారు. వంద మందికి పైగా జనం మిస్ అయ్యారు. ప్రజలు తమ ఇళ్లు, ఆస్తులు అన్నీ పోగొట్టుకుని రోడ్డున పడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ ఈఎంఐ కట్టమని ఓ వరద బాధితుడికి ఫోన్ చేసింది. అయితే దీనికి విరుద్ధంగా ఓ బ్యాంకు మాత్రం గొప్ప మనసు చాటుకుంది. తమ బ్యాంకుల్లో తీసుకున్న లోన్లను మాఫీ చేస్తున్నామని సంచలన ప్రకటన చేసింది. జిల్లా సహకార బ్యాంకుల సమాఖ్య కేరళ బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది జూలై 30న వయనాడ్ వరదల కారణంగా నష్టపోయిన బాధితుల రుణాలను మాఫీ చేస్తామని ప్రకటన విడుదల చేసింది. వయనాడ్ జిల్లాలో సంభవించిన విపత్తుని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంకు తెలిపింది.

చూరల్ మల బ్రాంచిలో లోన్లు తీసుకుని చనిపోయిన వారి రుణాలు మాఫీ చేయడంతో పాటు.. లోన్ల కోసం తనకా పెట్టిన ఆస్తులు, ఇళ్లు కోల్పోయిన వారి రుణాలను మాఫీ చేస్తామని కేరళ బ్యాంకు తెలిపింది. మొత్తం లోన్ల విలువ 30 కోట్ల రూపాయలు ఉంటుందని బ్యాంకు అధికారులు అంచనా వేశారు. ఈ మొత్తాన్ని మాఫీ చేస్తున్నామని వెల్లడించారు. వ్యవసాయ రుణాలు, వాహన రుణాలు, ఇంటి రుణాలు అన్నిటినీ మాఫీ చేస్తామని తెలిపారు. బ్యాంకు తీసుకున్న నిర్ణయంతో నెటిజన్స్ ప్రశంసిస్తున్నారు. వడ్డీలు, ఈఎంఐలు అంటూ వాళ్ళని భయపెట్టకుండా, ఇబ్బంది పెట్టకుండా సరైన నిర్ణయం తీసుకున్నారని ప్రశంసిస్తున్నారు. బ్యాంకు మనసుతో ఆలోచించి నిర్ణయం తీసుకుందని కొనియాడుతున్నారు. మరి వయనాడ్ వరద బాధితుల విషయంలో బ్యాంకు తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

Show comments