Keerthi
కర్ణాటక రాష్ట్రంలోని ప్రైవేట్ సంస్థల్లో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించేలా.. తీసుకొస్తున్న బిల్లు పై ఆ రాష్ట్ర ప్రభుత్వం వెనక‍్కి తగ్గింది. కారణం ఇదే..
కర్ణాటక రాష్ట్రంలోని ప్రైవేట్ సంస్థల్లో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించేలా.. తీసుకొస్తున్న బిల్లు పై ఆ రాష్ట్ర ప్రభుత్వం వెనక‍్కి తగ్గింది. కారణం ఇదే..
Keerthi
ప్రైవేట్ సంస్థల్లో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంకు కన్నడికులు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. ప్రైవేట్ ఉద్యోగాల్లో 75 శాతం రిజర్వేషన్లు కల్పించేలా బిల్లుకు కర్ణాటక క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అంతేకాకుండా.. ఈ బిల్లును గురువారం రాష్ట్ర ప్రభుత్వం శాసన సభలో ప్రవేశ పెట్టాలని భావించింది. అయితే ఈ బిల్లుపై తాజాగా సిద్ధరామయ్య సర్కార్ వెనక్కి తగ్గింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..
కర్ణాటకలోని ప్రైవేట్ సంస్థల్లో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న బిల్లుపై తాజాగా సిద్ధరామయ్య సర్కార్ వెనక్కి తగ్గింది. అయితే,కర్ణాటక క్యాబినెట్ ఆమోదం తెలిపిన బిల్లుపై పారిశ్రామిక వర్గాలు, దిగ్గజ టెక్ సంస్థల నుంచి భారీ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో ఈ బిల్లు విషయంలో సిద్ధ రామయ్య సర్కారు వెనక్కి తగ్గింది. అయితే మొదట రిజర్వేషన్లు బిల్లుపై సీఎం సిద్ధరామయ్య మంగళవారం చేసిన ట్వీట్టింట తీవ్ర దూమరమే రేపింది.
ఈ కారణంతోనే.. సిద్ధరామయ్య బుధవారం ఆ పోస్టును తొలగించారు. ఇక ఆ తర్వాత.. అడ్మినిస్ట్రేషన్‌లో 50%, గ్రూపు సీ, డీ ఉద్యోగాల్లో 75% ఉద్యోగాలను స్థానిక కన్నడిగులకు ఇవ్వాలని తాజాగా ‘ఎక్స్’లో ఆయన మరో పోస్ట్ పెట్టారు. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం బిల్లు విషయంలో ఆలోచనలో పడగా.. చివరికి తాత్కాలికంగా బిల్లును నిలిపివేసింది. అలాగే పారిశ్రామిక సంస్థలు, ఐటీ సంస్థల నుంచి అభిప్రాయాలను తీసుకుని, సమీక్షించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.
ఇకపోతే కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రి రాందాస్ అథవాలే ఈ బిల్లుకు మద్దతు ఇవ్వడం గమన్హారం. పైగా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలు అయిన వెనుకబడిన తరగతులకు ప్రయోజనం చేకూర్చే అన్ని చర్యలకు తాను మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. అలాగే,‘భారత ప్రభుత్వం, ఇతర రాష్ట్రాలు కూడా ప్రైవేట్ సెక్టార్‌లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని మా పార్టీ డిమాండ్ చేస్తుందని, ఇక తాము జనరల్ కేటగిరీకి వ్యతిరేకం కాదు’ అని ఆయన పేర్కొన్నారు. మరి, కన్నడ ఉద్యోగులకు ప్రధాన్యత ఇచ్చే రిజర్వేషన్ల బిల్స్ పై రాష్ట్రా ప్రభుత్వం వెనక్కి తగ్గడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.