iDreamPost

Panipuri: పానీపూరి లవర్స్‌ తస్మాత్‌ జాగ్రత్త.. క్యాన్సర్‌ వచ్చే ఛాన్స్‌

  • Published Jul 01, 2024 | 11:35 AMUpdated Jul 01, 2024 | 11:35 AM

పానీపూరి కనిపించగానే లొట్టలేసుకుని మరీ తింటున్నారా.. అయితే ఓ సారి ఈ వార్త చదవండి.. ఆ తర్వాత పానీపూరి తినాలా వద్దా ఆలోచించుకోండి.

పానీపూరి కనిపించగానే లొట్టలేసుకుని మరీ తింటున్నారా.. అయితే ఓ సారి ఈ వార్త చదవండి.. ఆ తర్వాత పానీపూరి తినాలా వద్దా ఆలోచించుకోండి.

  • Published Jul 01, 2024 | 11:35 AMUpdated Jul 01, 2024 | 11:35 AM
Panipuri: పానీపూరి లవర్స్‌ తస్మాత్‌ జాగ్రత్త.. క్యాన్సర్‌ వచ్చే ఛాన్స్‌

పానీపూరి.. ఈ పేరు చెబితే చాలు చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ల వారకు ప్రతి ఒక్కరి నోట్లో నీళ్లూరతాయి. మనకే కాక విదేశీయులకు కూడా పానీపూరి ఫెవరెట్‌ స్నాక్‌ ఐటమ్‌గా మారింది అని చెప్పవచ్చు. ఇక మన దగ్గర గ్రామాల్లోకి కూడా పానీపూరి బళ్లు వచ్చాయి. ఇక చిన్న చిన్న పట్టణాలు, నగరాల్లో అయితే గల్లికి రెండు, మూడు పానీపూరి బళ్లు దర్శనం ఇస్తుంటాయి. పిల్లలు, యువత మరీ ముఖ్యంగా అమ్మాయిలు ఎంతో ఇష్టంగా వీటిని తింటుంటారు. పెద్ద పెద్ద స్టార్‌ హోటల్స్‌ మెనులో కూడా పానీపూరి ఉంటుందంటే దాని క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు. చాలా మంది పెళ్లి భోజనంలో పానీపూరి పెడుతున్నారు. అంతలా ఇది మన జీవితాల్లో భాగం అయ్యింది. అయితే ఇదంతా ఒకవైపు మాత్రమే.

మరోసైడు పానీ పూరి వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని.. వైద్యులు చెబుతుంటారు. ముఖ్యంగా చాలా చోట్ల పానీపూరి బండి చుట్టూ ఉండే వాతావరణం ఎంతో అపరిశుభ్రంగా ఉంటుంది. ఇక పానీ కోసం వాడే నీరు, అక్కడ వాడే పదార్థాల నాణ్యత గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇక వర్షాకాలంలో పానీపురి తింటే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తారు. ఈ క్రమంలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. పానీపూరి తింటే క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఆ వివరాఉల..

పానీపూరి తింటున్నారా.. అయితే క్యాన్సర్‌ బారిన పడే అవకాశం ఉంది అని హెచ్చరిస్తున్నారు వైద్యులు. పానీపూరి తయారీలో వినియోగించే కృత్రిమ రంగుల్లో క్యాన్సర్‌ కారక రసాయనాలు ఉన్నట్టు తేలిందట. ఈ విషయాన్ని కర్ణాటక ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటికే అనేక రకాల ఆహారాల్లో కృత్రిమ రంగులు కలుపుతుండటంపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. ఇప్పుడు పానీపూరిలో వినియోగించే కృత్రిమ కలర్స్‌లో ఏకంగా క్యాన్సర్‌ కారకాలు ఉన్నట్లు వెల్లడి కావడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కర్ణాటకలో ఆహార భద్రత విభాగం అధికారులు రాజధాని బెంగళూరుతో సహా 79 చోట్ల తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా సంచలన విషయాలు గుర్తించారు.

చాలా పానీపూరి నమూనాల్లో వాటి సాస్‌, స్వీట్‌ చిల్లీ పౌడర్లలో క్యాన్సర్‌ కారక రసాయనాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారని.. ది టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా నివేదించింది. చాలా వరకూ నమూనాల్లో సన్‌సెట్‌ యెల్లో, బ్రిలియంట్‌ బ్లూ, కార్మోసిన్‌ రంగులు ఉన్నట్టు తేలిందని సంబంధిత అధికారులు తెలిపారు. బెంగళూరులో సేకరించిన 49 శాంపిల్స్‌లో సుమారు 19 నమూనాలలో సింథటిక్‌ రంగులు ఉన్నట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో పానీపూరి తయారీలో కృత్రిమ రంగులతో తయారు చేసే సాస్‌లు, స్వీట్‌ చిల్లీ పౌడర్లను రాష్ట్రవ్యాప్తంగా నిషేధించే యోచనలో అధికారులు ఉన్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.

కాగా, కృత్రిమ రంగుల వలన అలర్జీ, పిల్లల్లో హైపర్‌ యాక్టివిటీ, అరుగుదల వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని, ఇదే సమయంలో ఎక్కువ కాలం ఈ సింథటిక్‌ రంగులను తీసుకోవడం వలన క్యాన్సర్‌కు గురయ్యే ప్రమాదం కూడా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ఇటీవల గోబీ మంచూరియా, కబాబ్‌ల వంటి ఆహార పదార్థాల తయారీలో కృత్రిమ రంగుల వాడకాన్ని నిషేధిస్తూ కర్ణాటక ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ జాబితాలో పానీపూరి చేరింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి