Venkateswarlu
Venkateswarlu
మనిషి తన అవసరాల కోసం డబ్బును సృష్టించాడు. కాలం మారుతున్న కొద్ది ఆ అవసరం కాస్తా.. వ్యసనంగా మారింది. డబ్బే జీవితం అన్నట్లుగా బతుకున్న మనుషులు ఈ ప్రపంచంలో నూటికి 90 శాతం మంది ఉన్నారు. మిగిలిన 10 శాతం మంది తమ జీవితంలో డబ్బు కంటే.. ప్రశాంతత, బంధాలు, బంధుత్వాలకు ఎక్కువ వాల్యూ ఇస్తూ ఉంటారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీలో పెద్దాయన కూడా అంతే. దాదాపు 70 ఏళ్ల వయసున్న ఆయన చూడ్డానికి బికారీలా ఉంటాడు.
ఒంటిపై ఓ చెడ్డీ వేసుకుని తిరుగుతూ ఉంటాడు. చూసే వారికి ఆయన అత్యంత సాధారణ వ్యక్తిలా కనిపిస్తాడు. తినడానికి కూడా తిండిలేని వాడు అని అనుకుంటారు. కానీ, అసలు విషయం తెలిస్తే మాత్రం షాక్ అవుతారు. కర్ణాటకకు చెందిన ఆ పెద్దాయన పెద్ద చదువులే చదివాడు. ఓ ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యాడు. తర్వాత తన శేష జీవితాన్ని సింపుల్‌గా గడపాలని డిసైడ్ అయ్యాడు. ప్రస్తుతం ఆయన ఆస్తి విలువ అక్షరాలా 11 కోట్ల రూపాయలు పైనే. అయినా చాలా సింపుల్‌గా ఉంటాడు.
చడ్డీతో ఊర్లో తిరుగుతూ.. ఇంటి దగ్గర ఉన్న పెరట్లో మొక్కలు పెంచుకుంటూ ఎంతో సంతోషంగా జీవితాన్ని సాగిస్తున్నాడు. ఈయనకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలు ఆయన తన ఆస్తుల గురించి చెప్పుకొచ్చారు. లార్సెన్ అండ్ టర్బోకు సంబంధించి 8 కోట్ల రూపాయలు విలువ చేసే షేర్లు ఉన్నాయని, 2 కోట్లు విలువ చేసే అల్ట్రాటెక్, కోటి విలువ చేసే కర్ణాటక బ్యాంకు షేర్లు ఉన్నాయని చెప్పాడు. ఇవి కేవలం షేర్లు మాత్రమే.. పొలం, ఇళ్లు ఇతర ఖాతాలో డబ్బులు లెక్కగడితే చాలానే ఉంటుంది. ఇక, ఆ పెద్దాయన ఆస్తి గురించి తెలిసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. మరి, కోట్లు ఉన్నా సింపుల్‌గా జీవితాన్ని సాగిస్తున్న ఈ పెద్దాయనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
👆He is holding worth Rs 80 crores larsen and toubro (approx) shares Rs 21 crores worth Ultrtech cement shares Rs 1 crore worth Karnataka bank shares. Still leading simple life 😀😀
This is all I want at the end of my life. pic.twitter.com/ndV9z1RqJM
— Rohit Singh (@Mr_Chartist) September 26, 2023