iDreamPost
android-app
ios-app

హుక్కాపై నిషేదం విధించిన ప్రభుత్వం..!

  • Published Feb 08, 2024 | 8:44 PM Updated Updated Feb 08, 2024 | 8:44 PM

Ban on Hookah: దేశంలో హుక్కా వినియోగంతో యువత తమ ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నారు.. ప్రజా ఆరోగ్యాన్ని రక్షించే క్రమంలో అక్కడ హుక్కాపై నిషేదం విధించారు.

Ban on Hookah: దేశంలో హుక్కా వినియోగంతో యువత తమ ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నారు.. ప్రజా ఆరోగ్యాన్ని రక్షించే క్రమంలో అక్కడ హుక్కాపై నిషేదం విధించారు.

హుక్కాపై నిషేదం విధించిన ప్రభుత్వం..!

హుక్కా లేదా వాటర్‌పైప్‌ను మొఘల్ భారతదేశంలోని ఫతేపూర్ సిక్రీలో అక్బర్ వద్ద ఉండే పర్షియన్ వైద్యుడు అబుల్-ఫత్ గిలానీ కనిపెట్టాడు. తర్వాత ఇది దేశం మొత్తం వ్యాపించింది.. మొదట హుక్కా మాదకద్రవ్యాల వినియోగం నిషిద్దంగా ఉన్నప్పటికీ.. ప్రభువులు, సంపన్నులు దీన్ని బాగా వాడటంతో ప్రాచుర్యం బాగా పెరిగిపోయింది. ప్రస్తుతం హుక్కాలో పలు రకాలు మార్కెట్ లో దొరుకుతున్నాయి. కొంతమంది యువత బలహీనత క్యాష్ చేసుకుంటూ హుక్కాలో డ్రగ్స్ ని వాడటంతో ఎంతోమంది అనారోగ్యంపాలవుతున్నారు. ప్రజా ఆరోగ్యాన్ని రక్షించే క్రమంలోన హుక్కా ధూమపానంపై నిషేదం విధించింది ప్రభుత్వం. ఇంతకీ ఏ రాష్ట్ర ప్రభుత్వం హుక్కాపై నిషేదం విధించిందో తెలుసా? పూర్తి వివరాల్లోకి వెళితే..

కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. హుక్కా వినియోగంతో ఎంతోమంది తమ ఆరోగ్యాన్ని రిస్క్ లో పడేసుకుంటున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని రక్షించే లక్ష్యంతో తమ రాష్ట్రాన్ని దాని భార నుంచి కాపాడేందుకు కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హుక్కా విక్రయాలు, ధూమపానం వినియోగంపై పూర్తిగా నిషేదం విధించింది.  ఈ విషయం  రాష్ట్ర ఆరోగ్యశాఖా మంత్రి దినేష్ గుండూరావు సోషల్ మీడియా వేధికగా గురువారం ప్రకటించారు. ‘ప్రజా ఆరోగ్యం, యువతను రక్షించే లక్ష్యంతో హుక్కాపై రాష్ట్ర వ్యాప్తంగా నిషేదాన్ని విధిస్తున్నాం. హుక్కా దూమపానం వల్ల యువత ఆరోగ్యం పూర్తిగా నాశనం అవుతుంది. అందుకే సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం ను సవరించాం’ అని మంత్రి దినేష్ తెలిపారు.

ఇటీవల యువత హుక్కాకు బాగా అలవాటయ్యారు. దీంతో చిన్న వయసు నుంచే ఆరోగ్యం క్షీణిస్తున్న పరిస్థితి నెలకొంటుంది. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం హుక్కా బార్ లపై నిషేదం విధించాలనే యోచనలో ఉంది. ఈ క్రమంలోనే పొగాకు వినియోగానికి చట్టపరమైన వయసు 18 నుంచి 21 సంవత్సరాలకు పెంచుతున్నట్లు ఆరోగ్య మంత్రి దినేష్ సెప్టెంబర్ 2023లోనే ప్రకటించారు. హుక్కాలో వాడే పదార్ధాలు వ్యసనాలకు దారి తీస్తున్నాయని.. ఇవి ప్రాణాలు తీయడమే కాదు.. నేరాలు చేయడానికి కూడా ప్రేరేపిస్తాయని గత ఏడాది హర్యానా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పలు బార్ లు, హూటళ్లు, రెస్టారెంట్లు, వాణిజ్య సంస్థల్లో వినియోగదారులకు హుక్కా సేవించడంపై నిషేధం విధించింది.