Venkateswarlu
Venkateswarlu
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత సీనియర్ నటి జయ లలిత మరణం తర్వాత.. ఆమె వారసులెవరన్న దానిపై పెద్ద రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. జయ లలిత వారసులం తామేనంటూ ఆమె మేనకోడలు, మేనల్లుడు తెరపైకి వచ్చారు. ఇదే సమయంలో తాను జయ లలిత, శోభన్ బాబుల కూతుర్ని అంటూ జయలక్ష్మి అనే మహిళ సంచలన స్టేట్‌మెంట్ ఇచ్చింది. రెండేళ్ల క్రితం జయలక్ష్మి చెప్పిన విషయాలు మీడియాలో పెద్ద చర్చకు దారి తీశాయి. తర్వాత జయ లక్ష్మి మీడియాకు, ప్రజలకు దూరం అయ్యారు.
ఇన్నేళ తర్వాత మళ్లీతెరపైకి వచ్చారు. శుక్రవారం దిండుగల్ జిల్లా కొడైకెనాల్‌లో మీడియా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేశారు. జయలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ జయ లలిత, శోభన్ బాబుల కుమార్తెను నేనే. ఇందుకోసం అవసరం అయితే డీఎన్‌ఏ టెస్టు కూడా చేయించుకుంటా. వివిధ కారణాల వల్ల జయను వ్యక్తిగతంగా కలుసుకోలేకపోయాను. సీఎంగా ఉన్నపుడు పని మీద రెండు సార్లు కలిశాను. ఆమె అపోలోలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నపుడు కూడా కలిశాను. ఆమె సినిమాల్లో నటించే సమయంలో నేను పోయస్ గార్డెన్‌లో ఉన్నాను.
అమ్మ రాసుకున్న డైరీ నా దగ్గర ఇప్పటికీ ఉంది. ఆమె దుస్తులు, వస్తువులు కూడా నా దగ్గర ఉన్నాయి. డీఎన్‌ఏ టెస్టు చేయించుకుంటే ఆ వివరాలను కోర్టుకు కూడా వివరిస్తా. లోకసభలో పోటీ చేయటానికి ‘‘ అఖిల భారత ఎంజీఆర్ మున్నేట్ర కళగం’’ ఏర్పాటు చేశాను. మొత్తం 39 నియోజకవర్గాల్లో మా పార్టీ పోటీ చేస్తుంది’’ అని అన్నారు. మరి, తాను జయ లలిత, శోభన్ బాబుల కూతుర్ని అంటూ జయలక్ష్మి అనటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.