iDreamPost
android-app
ios-app

19 ఏళ్ల తర్వాత తండ్రిని వెతుక్కుంటూ జపాన్‌ నుంచి వచ్చిన కొడుకు!

Japanese Son Meet His father After 19 Years: 19 ఏళ్ల తరువాత జపాన్ కు చెందిన ఓ కుర్రాడు తండ్రిని వెతుక్కుంటూ భారత్ కి వచ్చాడు. తండ్రి అచూకీ కోసం దేశంలో అనువణువు గాలించి మరీ వెతికి చివరకు పట్టుకున్నాడు. అయితే ఈ క్రమంలో అతడు చేసిన సాహసలు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తాయి.

Japanese Son Meet His father After 19 Years: 19 ఏళ్ల తరువాత జపాన్ కు చెందిన ఓ కుర్రాడు తండ్రిని వెతుక్కుంటూ భారత్ కి వచ్చాడు. తండ్రి అచూకీ కోసం దేశంలో అనువణువు గాలించి మరీ వెతికి చివరకు పట్టుకున్నాడు. అయితే ఈ క్రమంలో అతడు చేసిన సాహసలు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తాయి.

19 ఏళ్ల తర్వాత తండ్రిని వెతుక్కుంటూ జపాన్‌ నుంచి వచ్చిన కొడుకు!

సమాజంలో ఎన్నో సంఘటనలు చోటుచేసుకుంటాయి. కొన్ని ఘటనలు మాత్రం  హృదయాలను ధ్రవింప చేస్తాయి. కారణంగా రక్త సంబంధీకులు ఏళ్ల తరబడి ఎడబాటుగా ఉండి.. అసలు బతికి ఉన్నారా లేదా? అనే సందేహాలతో కాలం గడుపుతుంటారు. అయితే కొందరు మాత్రం తమ వారి ఆచూకి కనిపెట్టేందుకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ..దేశాలు, ఖండాలు దాటి వెళ్తుంటారు. ఇలా ఏళ్ల తరువాత ఒక్కసారి కన్నవారు, రక్తసంబంధీకులు కనిపిస్తే..ఆ సంతోషంతో మాటలతో చెప్పలేనిది. అలాంటి ఆనందాన్ని ఓ తండ్రీకొడుకులు ఆస్వాదించారు. తండ్రిని వెతకుంటూ జపాన్ నుంచి భారత్ కి వచ్చిన యువకుడు.. 19 ఏళ్ల తరువాత కలిశాడు. హృదయానికి కదిలించే ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. మరి.. ఈ తండ్రీకొడుకుల కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం….

భారత్ లోని పంజాబ్ రాష్ట్రం, అమృత్ సర్ ప్రాంతానికి చెందిన సుఖ్ పాల్ థాయిలాండ్ వెళ్లాడు. అక్కడ జపనీస్ మహిళ సాచీని తో పరిచయం ఏర్పడి..ప్రేమకు దారి తీసింది. చివరకు వారిద్దరు 2002లో వివాహం చేసుకున్నారు. వారు జపాన్ లోని టోక్యో సమీపంలో చిబాకెన్ లో నివాసం ఉండేవారు. చాలా కాలం వారి సంసారం ఎంతో సంతోషంగా సాగింది. ఆ తరువాత వారి వైవాహిక బంధంలో గొడవలు జరిగి..ఇద్దరు విడిపోయారు. అలా  సుఖ్ పాల్ , సాచీ దంపతులు విడిపోయే సమయానికి వారికి రెండేళ్ల కుమారుడు రిన్ తకహటా ఉన్నాడు. అతడు తల్లి వద్దనే ఉంటూ పెరిగి పెద్దయ్యాడు.  2007లో భారత్ కు తిరిగి వచ్చిన సుఖ్ పాల్ కు కొడుకు, భార్యతో ఎలాంటి సంబంధాలు లేవు. వారు ఎలా ఉన్నారు అనే విషయం కూడా ఆయనకు తెలియదు.

ఇదే సమయంలో జపాన్ లో ఉంటున్న  రిన్ తన తండ్రిని కలవడానికి ఇటీవలే పంజాబ్ వచ్చాడు. కేవలం తన తండ్రి పాత ఫోటో , చిన్నపాటి అడ్రెస్ సాయంతో సుఖ్ పాల్ ను వెతికేందుకు ఇండియాకు వచ్చాడు. ఇక తండ్రి కోసం అవిశ్రాంతంగా వెతికాడు. చివరకు  19 ఏళ్ల తరువాత  తన తండ్రిని కలిసి భావోద్వేగానికి గురయ్యాడు.  ఇద్దరు పరస్పరం ఆలింగనం చేసుకుని కన్నీటి పర్యతం అయ్యారు. రెండేళ్ల వయస్సులో కొడుకును చివరగా చూసి.. తాజాగా పెద్ద వాడిగా చూడటంతో ఆ తండ్రి సంతోషానికి అవధులు లేకుండాపోయాయి.

ఈ సందర్భంగా సుఖ్ పాల్ సింగ్ మాట్లాడుతూ… తన ఫోటో సాయంతో ప్రజలందర్ని అడుగుతూ వస్తూ..చివరకు తనని  కనుకున్నాడని తెలిపాడు. తన కుమారుడిని కలవడం నిజంగా నమ్మలేకున్నానని, ఇదంతా ఓ కలలా ఉందని సుఖ్ పాల్ అన్నారు. తన కొడుకుని కలవాలని చాలా సార్లు అనుకున్నట్లు, అయితే అది సాధ్యం కాక వదిలేశాని తెలిపాడు. ఇలా తన కొడుకే తన కోసం వెతుక్కుంటూ వస్తాడని ఊహించలేదని కన్నీరు పెట్టుకున్నాడు సుఖల్ పాల్ సింగ్. ఆయన కుమార్తె కూడ.. రిన్ రావడంపై సంతోషం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు తాను ఒక్కదాన్నే అనే భావన ఉండేదని, ఇప్పుడు తనకు ఓ అన్నయ్య ఉండటం సంతోషంగా ఉందని తెలిపింది.

ఇక రిన్ విషయానికి వస్తే.. అతడు జపాన్ లోని ఒసాకా యూనివర్సిటీ ఆఫ్ ఆర్ట్స్ లో ఫ్యామిలీ ట్రీ అనే ప్రాజెక్టులో పని చేస్తున్నాడు. ఆ సమయంలోనే తన తల్లివైపు కుటుంబ సభ్యులే తెలుసు తప్ప.. తండ్రి గురించి, ఆయన వైపు కుటుంబ సభ్యుల గురించి ఏం తెలియదు. ఆవిషయాన్ని గ్రహించిన రిన్.. తన తండ్రి గురించి తల్లిని అడిగాడు. దీంతో ఆమె అసలు స్టోరీ చెప్పడంతో తన తండ్రిని ఎలాగైనా కలవాలని సంకల్పించాడు. చివరకు  19 ఏళ్ల తరువాత జపాన్ నుంచి ఇండియాకు వచ్చి ఆగష్టు 18న తన తండ్రిని కలుసుకున్నాడు. ప్రస్తుతం వీరికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.