P Krishna
దేశంలో ఉన్న సంపన్నులు ఆదాయపన్ను చెల్లించడం వల్ల దేశాభివృద్దికి దోహదపడినవారు అవుతారని అంటారు.. కానీ కొంతమంది బడా వ్యాపారులు, సెలబ్రెటీలు, రాజకీయ నేతలు పన్ను ఎగవేస్తూ తప్పించుకుంటారు.. అలాంటి వారిపై ఈ మధ్య ఐటీ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు.
దేశంలో ఉన్న సంపన్నులు ఆదాయపన్ను చెల్లించడం వల్ల దేశాభివృద్దికి దోహదపడినవారు అవుతారని అంటారు.. కానీ కొంతమంది బడా వ్యాపారులు, సెలబ్రెటీలు, రాజకీయ నేతలు పన్ను ఎగవేస్తూ తప్పించుకుంటారు.. అలాంటి వారిపై ఈ మధ్య ఐటీ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు.
P Krishna
ఇటీవల దేశ వ్యాప్తంగా పలు చోట్ల ఆదాయపన్నుశాఖ అధికారులు దాడులు చేస్తూ పన్ను ఎగవేతదారులకు చుక్కలు చూపిస్తున్నారు. అక్రమంగా సంపాదించిన డబ్బుని పలు రకాలుగా దాచిపెట్టి పన్ను ఎగవేస్తున్న బడా బాబులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు ఐటీ అధికారులు. సెలబ్రెటీలు, రాజకీయ నేతలు, బడా వ్యాపారులు ఎవ్వరినీ వదలడం లేదు. ఇప్పటి వరకు దేశంలో ఎన్నో ఐటీ దాడులు జరిగినా.. ఇప్పటి వరకు కనీ వినీ ఎరుగని రీతిలో డబ్బు పట్టబడింది. ఎంతగా అంటే ఐదు రోజుల నుంచి కౌంటింగ్ చేస్తున్నా.. తరగని సొమ్ము. డబ్బు లెక్కించలేక కౌంటింగ్ మిషన్లు మొరాయిస్తున్నాయంటే అర్థం చేసుకోవొచ్చు. ఈ సొమ్ము ఓ కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో దొరకడం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకి వెళితే..
ఇటీవల ఒడిశా ప్రధాన కేంద్రంగా ఆదాయపన్నుశాఖ అధికారులు డిస్టిలరీ కంపెనీలపై దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహూ కుటుంబానికి చెంది మద్యం కంపెనీలో సోదాలు నిర్వహించగా భారీ ఎత్తున డబ్బులు బయటపడ్డాయి. బీరువాలు, బెడ్ షీట్స్ కింద, ఇతర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కుప్పలు తెప్పలుగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. దీంతో నివ్వెరపోయిన ఐటీ అధికారులు కౌంటింగ్ మిషన్లు తీసుకు వచ్చి లెక్కించడం ప్రారంభించారు. ఈ డబ్బు లెక్కింపు ఇంకా కొనసాగుతుందని.. ఈ స్థాయిలో డబ్బు పట్టుబడటం ఐటీ చరిత్రలోనే ప్రథమం అని అంటున్నారు. బౌద్ద్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తో పాటు ఆ సంస్థ ప్రమోటర్లు, ఇలరులపై ఈ నెల 6న ఐటీ సోదాలు నిర్వహించారు. ఆదివారం నాటికి ఐదు రోజులు అయ్యాయి. ఇప్పటి వరకు రూ.351 కోట్ల నగదు పట్టుబడటం దేశ వ్యాప్తంగా సంచలంగా మారింది. బౌద్ద్ డిస్టిలరీ కంపెనీ కొంతకాలంగా భారీ ఎత్తున పన్ను ఎగవేస్తుందని ఆరోపణలు రావడంతో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. కాగా, ఇప్పటి వరకు పట్టుబడిన సొమ్ము దేశవ్యాప్తంగా ఆ సంస్థ, డిస్ట్రిబ్యూటర్లు సంబంధితన వ్యక్తులు నిర్వహించిన నగదు అమ్మకాలత వచ్చిందని.. అవి లెక్కల్లో లేకుండా చూసుకున్నట్టు ఐటీ అధికారులు భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఇంత భారీ ఎత్తున డబ్బు పట్టుబడటం ఐటీ చరిత్రలో ఇదే మొదటిసారి అని అంటున్నారు అధికారులు. జార్ఖండ్ కి చెందిన కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహూ ప్రస్తుతం డిస్టిలరీ కంపెనీలో పార్ట్‌నర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాంచిలోని ఆయన ఇళ్లు, ఆఫీసుల్లో ఆదాయపన్నుశాఖ అధికారులు దాడులు దాడులు నిర్వహించారు. కాకపోతే.. ఇప్పటి వరకు దీరజ్ ప్రసాద్ ఇంట్లో ఎంత నగదు పట్టుకున్నారన్న విషయం వెల్లడించలేదు ఐటీ అధికారులు. ఒక బాధ్యాతయుతమైన ప్రజా ప్రతినిధి అయి ఉండి.. ఐటీ ఎగవేతను ప్రోత్సహించడంపై రాజకీయంగా తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పై బీజేపీ నేతలు అవినీతి ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఈ ఆరోపణలపై స్పందిస్తూ.. ఎంపీ ధీరజ్ వ్యాపారాలకు పార్టీకి ఎలాంటి సంబంధం లేదని.. ఆయన వ్యాపార లావాదేవీలపై ఐటీ అధికారులకు ఆయనే క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ అన్నారు.