భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ.. ఇస్రో మరో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. చంద్రయాన్-3 ప్రయోగంలో భాగం ఎల్వీఎం-3 ఎం-4 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. శుక్రవారం మధ్యాహ్నం 2:35 నిమిషాలకు తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి దూసుకెళ్లింది ఈ రాకెట్. స్వదేశీ పరిజ్ఞానంపై మనకు ఉన్న నమ్మకాన్ని మరింత పెంచేలా మూన్ మిషన్‌కు ఇస్రో కృషి చేసింది. . అమెరికా, చైనా, రష్యాలకు భిన్నంగా భారత్ చంద్రుడిపైకి వెళ్లనుంది. చంద్రుని దక్షిణ ధ్రువంపై ఎవరికి తెలియని నిగూఢ రహస్యాలను ఛేదించేందుకు చంద్రయాన్-3 ప్రయోగం చేసింది.
శుక్రవారం చంద్రయాన్-3లో భాగంగా ఎల్వీఎం-3 ఎం4 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. 140 కోట్ల మంది భారతీయుల ఆశలను నింగిలోకి మోసుకెళ్లింది. గురువారం మధ్యాహ్నం1.05 కి కౌంట్ డౌన్ ప్రారంభం కాగా శుక్రవారం సరిగ్గా మధ్యాహ్నం 2.35 గంటలకు నింగిలోకి ఎల్వీఎం-3 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఎల్వీఎం 3ఎం4 రాకెట్ విజయవంతంగా భూకక్ష్యలోకి ప్రవేశించింది. భూ కక్ష్యలో 24 రోజుల పాటు ఉండనుంది. ఇక మరోవైపు ఈ చంద్రయాన్-3 ప్రయోగాన్ని ప్రజలు ఎంతో ఆసక్తికగా తిలకించారు. ఇప్పటి వరకు చంద్రుడిపై అమెరికా ,రష్యా, చైనాలు చేసిన ప్రయోగం ఒక ఎత్తు అయితే.. తాజాగా భారత్ చేపట్టిన ఈ ప్రయోగం మరో ఎత్తు. చంద్రయాన్-3 ప్రయోగం ద్వారా రోవర్ ను చంద్రుడిపై దక్షిణ వైపు ల్యాండ్ కానుంది.
చంద్రయాన్-3 తొలి దశ విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు ఆనందంలో మునిగిపోయారు. ఇక ఎల్వీఎం 3 ఎం4 రాకెట్ 24 రోజుల పాటు భూకక్ష్యలోనే తిరుగుతుంది. అనంతరం భూకక్ష్యను దాటి చంద్రుడి వైపు వెళ్తుంది. ఆగష్టు 23 లేదా 24 తేదీల్లో చంద్రుడిపై దిగనుంది. సుమారు3.48 లక్షల కిలోమీటర్లు ఈ రాకెట్ ప్రయాణం చేయనుంది. ఈ చంద్రయాన్ ప్రయాణం 40 రోజుల పాటు సాగనుంది. అక్కడ సురక్షితంగా దిగిన అనంతరం ల్యాండర్, రోవర్ లు 14 రోజుల పాటు అక్కడ పరిశోధనలు చేసే విధంగా శాస్త్రవేత్తలు రూపొందించారు. జాబిల్లిపై ప్రయోగాల కోసం భారత్ మూడోసారి చేపట్టిన ఈ యాత్రపై యావత్ దేశంతో పాటు ప్రపంచ దేశాలు కూడా ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నాయి.