iDreamPost
android-app
ios-app

చంద్రుడిపై ప్రగ్యాన్ దిగిన వీడియో రిలీజ్ చేసిన ఇస్రో!

చంద్రుడిపై ప్రగ్యాన్ దిగిన వీడియో రిలీజ్ చేసిన ఇస్రో!

చంద్రయాన్ 3 సక్సెస్ భారతీయులు ఆస్వాదిస్తూనే ఉన్నారు. యావత్ ప్రపంచమే ఇస్రోని కీర్తిస్తోంది. అంతరిక్ష పరిశోధనల్లో భారత్ చెరగని ముద్ర వేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎవరూ చూడని చంద్రుని దక్షిణ ధృవంపై ల్యాండ్ అయి ఔరా అనిపించింది. చంద్రయాన్-3 కి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇస్రో ఎప్పటికప్పుడు ఫొటోలు, వీడియోలు ట్విట్టర్ లో పోస్టు చేస్తూనే ఉంది. ఇప్పటికే ల్యాండ్ అవుతున్న సమయంలో తీసిని ఫొటోలు, ల్యాండ్ అయిన తర్వాత తీసిన ఫొటోలు కూడా పోస్ట్ చేసింది. ఇప్పుడు తాజాగా రోవర్ ప్రగ్యాన్ చంద్రుడిపై దిగుతున్న వీడియో పోస్ట్ చేసింది.

విక్రమ్ ల్యాండర్ చందమామ మీద ల్యాడ్ అయిన కొన్ని గంటల తర్వాత రోవర్ ప్రగ్యాన్ బయటకు వచ్చింది. అయితే రోవర్ సక్సెస్ ఫుల్ గా మూన్ మీదకు వచ్చినట్లు ఇస్రో ఆగస్టు 24న ప్రకటించింది. ఇప్పుడు ఆగస్టు 25న రోవర్ ప్రగ్యాన్ ల్యాండర్ విక్రమ్ నుంచి బయటకు దిగుతున్న వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియో చూసి యావత్ భారతదేశం గర్వంగా ఫీలవుతోంది. ఇవి మర్చిపోలేని క్షణాలు అంటూ అందరూ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. ఇస్రో భారతదేశ ఖ్యాతని మరో మెట్టుకు తీసుకెళ్లిందంటూ కామెంట్ చేస్తున్నారు. ఇకపై అంతరిక్ష ప్రయోగాలు అనగానే మొదట భారతదేశం పేరే వినిపిస్తుందని చెబుతున్నారు.

ఇంక రోవర్ ప్రగ్యాన్ విషయానికి వస్తే.. దీనికి సంబంధించి ఒక వార్త జోరుగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. రోవర్ ప్రగ్యాన్ చంద్రునిపై దిగిన తర్వాత దానికి టైర్ల ముద్రలు ఇస్రో, జాతీయ చిహ్నంతో పడతాయని చెప్పుకొచ్చారు. అవి శాశ్వతంగా చంద్రునిపై అలాగే ఉంటాయంటూ చాలామంది చెబుతున్నారు. అయితే ఆ వార్తల్లో ఏమాత్రం నిజంలేదని తేలింది. అది చంద్రయాన్ ప్రయోగానికి 10 గంటల ముందు క్రియేట్ చేసిన ఒక ఫొటోగా తెలిసింది. కాకపోతే దానిని అందరూ నిజం అనుకుని షేర్ చేశారు. ఆ ఫొటో బాగా వైరల్ అయిన తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది.