P Venkatesh
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో సరికొత్త చరిత్ర సృష్టించనున్నది. బ్లాక్‌హోల్ అధ్యయనమే లక్ష్యంగా పీఎస్‌ఎల్వీ-సీ58 రాకెట్‌ను ప్రయోగించింది. నేడు నింగిని చీల్చుకుంటూ పీఎస్‌ఎల్వీ-సీ58 దూసుకెళ్లింది.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో సరికొత్త చరిత్ర సృష్టించనున్నది. బ్లాక్‌హోల్ అధ్యయనమే లక్ష్యంగా పీఎస్‌ఎల్వీ-సీ58 రాకెట్‌ను ప్రయోగించింది. నేడు నింగిని చీల్చుకుంటూ పీఎస్‌ఎల్వీ-సీ58 దూసుకెళ్లింది.
P Venkatesh
ఇస్రో న్యూ ఇయర్ కు విజయంతో స్వాగతం పలికింది. కొత్త సంవత్సరం మొదటి రోజే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అంతరిక్ష ప్రయోగాల్లో అత్యంత క్లిష్టమైన కృష్ణ బిలాల (బ్లాక్‌హోల్) అధ్యయనమే లక్ష్యంగా పీఎస్‌ఎల్వీ-సీ58 రాకెట్‌ను ప్రయోగించింది. నేడు శ్రీహరికోటలో ఉన్న సతీశ్‌ధావన్ రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి నింగిలోకి దూసుకెళ్లింది పీఎస్‌ఎల్వీ-సీ58 వాహకనౌక. ఈ వాహకనౌక 21.5 నిమిషాల్లో నిర్ధేశిత కక్ష్యలోకి అత్యాధునిక ఎక్స్‌పోశాట్ ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనుంది. ఎక్స్ కిరణాలపై అధ్యయనం చేయనున్నట్లు ఇస్రో ప్రకటించింది. కాగా పీఎస్‌ఎల్‌వీ-సీ58కి కౌంట్‌డౌన్ ఆదివారం ఉదయం 8:10 గంటలకు ప్రారంభమైంది. 25 గంటల కౌంట్‌డౌన్ అనంతరం నేడు (సోమవారం) ఉదయం 9:10 గంటలకు షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి నింగిని చీల్చుకుంటూ దూసుకెళ్లింది.
కాగా ఇస్రో చేస్తున్న ఈ సరికొత్త ప్రయోగం ఎక్స్-రే ఖగోళ శాస్త్రంలో సంచలనాత్మక విషయాలను వెలుగులోకి తెచ్చేందుకు ఎక్స్‌పోశాట్ కీలకం కానుంది. విశ్వంలోని పల్సర్‌లు, బ్లాక్‌హోల్ ఎక్స్ రే బైనరీలు, యాక్టివ్ గెలాక్సీ న్యూక్లియోలు, న్యూట్రాన్ స్టార్స్, నాన్ థర్మల్ సూపర్ నోవా అవశేషాలతో సహా విశ్వంలో గుర్తించబడిన 50 ప్రకాశవంతమైన మూలాలను ఎక్స్‌పోశాట్ అధ్యయనం చేయనున్నది. ఇక గతేడాది చంద్రయాన్-3 ప్రయోగంతో చరిత్ర సృష్టించింది ఇస్రో. చంద్రుడి దక్షిణ ద్రువంపైకి చేరుకున్న ప్రపంచంలోనే మొదటి దేశంగా ఇస్రో రికార్డ్ క్రియేట్ చేసింది. ఆ సక్సెస్ అనంతరం ఇస్రో సూర్యుడి రహస్యాలను చేధించేందుకు ఆదిత్య ఎల్1ను ప్రయోగించింది.
#WATCH | PSLV-C58 XPoSat Mission launch | ISRO launches X-Ray Polarimeter Satellite (XPoSat) from the first launch-pad, SDSC-SHAR, Sriharikota in Andhra Pradesh.
(Source: ISRO) pic.twitter.com/ua96eSPIcJ
— ANI (@ANI) January 1, 2024