iDreamPost
android-app
ios-app

ISROకు పెరిగిన క్రేజ్.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేతికి NASA శాటిలైట్!

  • Author singhj Published - 05:35 PM, Sat - 26 August 23
  • Author singhj Published - 05:35 PM, Sat - 26 August 23
ISROకు పెరిగిన క్రేజ్.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేతికి NASA శాటిలైట్!

చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3ని సక్సెస్​ఫుల్​గా దించి అంతరిక్ష రంగంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సరికొత్త చరిత్రను లిఖించింది. దీంతో ఇస్రోపై ప్రపంచ దేశాలన్నీ ప్రశంసల వర్షం కురిపిస్తున్నాయి. అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) కూడా ఇస్రోను మెచ్చుకుంది. అలాగే ఇస్రోతో కలసి సంయుక్తంగా అభివృద్ధి చేసిన SAR (NISAR) శాటిలైట్​ను ప్రయోగించే బాధ్యతలను ఇస్రోకు అప్పజెప్పింది. భూమి కక్ష్యను పరిశీలించే నిసార్ శాటిలైట్ ప్రయోగానికి ముందు దీనికి తుది మెరుగులు దిద్దుతోంది ఇస్రో. ఈ ఉపగ్రహం మొత్తం భూగోళాన్ని 12 రోజుల్లో మ్యాప్ చేయగలదని తెలుస్తోంది.

భూకంపాలు, సునామీలతో పాటు అగ్నిపర్వతాలు, కొండచరియలు సహా భూమిపై ఉన్న పర్యావరణ వ్యవస్థలు, మంచు ద్రవ్యరాశి, వృక్ష సంపద, సముద్ర మట్టం పెరుగుదల, భూగర్భ జలాలు, సహజ ప్రమాదాల గురించి అర్థం చేసుకునేందుకు అవసరమైన సమాచారాన్ని నిసార్ ఉప్రగహం అందిస్తుంది. ఈ శాటిలైట్​ ఎల్, ఎస్ డ్యుయల్ బ్యాండ్ సింథటిక్ ఆపర్చ్యుర్ రాడార్ (SAR)ను కలిగి ఉంటుంది. అందులో ఎల్​ బ్యాండ్​ ఎస్​ఏఆర్​ను కాలిఫోర్నియా జెట్ ప్రపల్షన్ లేబొరేటరీస్ డెవలప్ చేసింది. ఎస్​ బ్యాండ్ ఎస్​ఏఆర్​ను మాత్రం మన ఇస్రో అభివృద్ధి చేసింది.

నిసార్ ఉపగ్రహాన్ని 2024లో ఇస్రో ఆధ్వర్యంలో శ్రీహరికోటలోని సతీష్​ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది నాసా. కాగా, జాబిల్లి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3ని సక్సెస్​ఫుల్​గా దించి అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్రను లిఖించింది ఇస్రో. అదే ఉత్సాహంతో సూర్యుడి రహస్యాలను కనుగొనేందుకూ సిద్ధమవుతోంది. వచ్చే నెల 2వ తేదీన ఆదిత్య-ఎల్​1 ప్రయోగం చేపట్టేందుకు ఇస్రో రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. కరోనాగ్రఫీ అనే పరికరం సాయంతో సౌర వాతావరణాన్ని లోతుగా, క్షుణ్నంగా అధ్యయనం చేయడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం.