iDreamPost
android-app
ios-app

గొప్ప మనస్సు: బంగ్లాలో వరద బాధితుల ఆకలి తీరుస్తున్న ‘ఇస్కాన్’

Iskcon Temple: ఇటీవల బంగ్లాదేశ్ లో భారీగా వానలు కురిశాయి. ఈ వరదల దాటికి సర్వం కోల్పోయి లక్షలాది మంది సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఇస్కాన్ వరద బాధితుల ఆకలి తీరుస్తుంది.

Iskcon Temple: ఇటీవల బంగ్లాదేశ్ లో భారీగా వానలు కురిశాయి. ఈ వరదల దాటికి సర్వం కోల్పోయి లక్షలాది మంది సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఇస్కాన్ వరద బాధితుల ఆకలి తీరుస్తుంది.

గొప్ప మనస్సు: బంగ్లాలో వరద బాధితుల ఆకలి తీరుస్తున్న ‘ఇస్కాన్’

ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ (ఇస్కాన్) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శ్రీకృష్ణుని భక్తిని, భగవద్దీత సందేశాన్ని ప్రపంచచానికి  వ్యాప్తీ చేయడానికి  ఈ ఇస్కాన్ సంస్థ కృషి  చేస్తుంది.  భారత దేశంతో పాటు ప్రపంచంలోని అనేక దేశాల్లో ఇస్కాన్ టెంపులు ఉన్నాయి. ఇక్కడ ఎంతో మంది శ్రీకృష్ణుడి సేవలో నిమగ్నమై  ఉంటారు. ఇలా కేవలం భక్తికి సంబంధించిన కార్యక్రమాలే కాకుండే, అనేక సేవ కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. ఎక్కడైనా ప్రకృతి విపత్తు సంభవించినప్పుడు ఇస్కాన్ భక్తులు సేవలు అందిస్తుంటారు. ఇలాంటివి ఎన్నో గొప్ప కార్యాక్రమలు ఇస్కాన్ సంస్థ నిర్వహిస్తుంది. తాజాగా బంగ్లాదేశ్ లో కూడా వరద బాధితల విషయంలో ఇస్కాన్ భక్తులు అండగా నిలిచారు.

ఇటీవల బంగ్లాదేశ్ లో భారీగా వానలు కురిశాయి. అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. గ్రామాల్లోకి వరద నీరు చేరి.. తినే వస్తువులు నీట మునిపోయాయి. ఇలా బంగ్లాలో కురిసిన భారీ వర్షాలకు లక్షలాది మంది వరదనీటిలో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్నారు. ఎంతో మంది ఆకలితో అలమట్టిస్తున్నారు. ఎవరైన అన్నదానం చేస్తారేమో అని సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఇస్కాన్ భక్తులు వరద బాధితులు అక్కున చేర్చుకున్నారు. రిస్క్ తీసుకుని మరీ..పడవల ద్వారా వరద నీటిలో ప్రయాణిస్తూ బాధితులకు వద్దకు చేరి వారికి ఆహారాన్ని అందించారు. ఇలా బంగ్లాదేశ్ లో వరదలు వచ్చిన ప్రతీసారి ఇస్కాన్ భక్తులు సహయం చేస్తుంటారు. అయితే కొద్ది రోజుల క్రితమే కొందరు పశువుల రూపంలో ఉన్న మనుషులు  బంగ్లాదేశ్ లో ఉన్న ఇస్కాన్ ఆలయంపై దాడి చేసి ధ్వంసం చేశారు.

ఇలా తమపై దాడి జరిగినా కూడా ఇస్కాన్ భక్తులు..తాము చేసే మానవసేను ఆపలేదు. తమపై దాడి చేసిన ప్రాంతంలోనే వరద బాధితల కడుపులు నింపారు. ఇటీవ‌ల బంగ్లాదేశ్‌లో మైనారిటీ అధ్యాత్మిక స్థ‌లాల‌పై దాడులు జ‌రుగుతున్నాయి. ఈ దాడుల్లో  అనేక మంది తీవ్రంగా గాయపడుతున్నారు. ఇలా దాడులకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని ఇస్కాన్ టెంపుల్ అధికారులు ప్రభుత్వాన్ని కోరారు. మొత్తంగా వరద బాధితులకు ఇస్కాన్ చేసిన సాయంపై ప్రశంసల వర్షం కురుస్తుంది. ఇది కదా నిజమైన దైవ సేవా అంటే అని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరి.. ఇస్కాన్ భక్తులు చేసిన ఈ సాయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.