iDreamPost
android-app
ios-app

రైలు బోగీలపై కనిపించే NE, ER, SR, CR అంటే ఏంటో తెలుసా?

  • Published Jun 08, 2024 | 4:30 PM Updated Updated Jun 08, 2024 | 4:30 PM

Unknown Facts: రైలు బోగీలపై కొన్ని నంబర్లు, అక్షరాలు కనిపిస్తుంటాయి. వీటి అర్ధమేంటో అనేది చాలా మందికి తెలియదు. బోగీలపైన SR, ER, NE అని అక్షరాలు కనబడతాయి. వీటి అర్ధమేంటో తెలుసా?

Unknown Facts: రైలు బోగీలపై కొన్ని నంబర్లు, అక్షరాలు కనిపిస్తుంటాయి. వీటి అర్ధమేంటో అనేది చాలా మందికి తెలియదు. బోగీలపైన SR, ER, NE అని అక్షరాలు కనబడతాయి. వీటి అర్ధమేంటో తెలుసా?

రైలు బోగీలపై కనిపించే NE, ER, SR, CR అంటే ఏంటో తెలుసా?

భారతీయ రైల్వేని భారతదేశానికి లైఫ్ లైన్ అని పిలుస్తారు. నిత్యం లక్షలాది మంది రైళ్లలో ప్రయాణం చేస్తున్నారు. అయితే రైలు బోగీల మీద ఇంగ్లీష్, హిందీ భాషల్లో నంబర్లు, అక్షరాలు రాసి ఉంటాయి. కోడ్ లు ఉంటాయి. అవేమిటో చాలా మందికి అర్థం కావు. ఉదాహరణకు రైలు బోగీ మీద 8439 అనే నంబర్ రాసి ఉంటే.. దానర్థం 1984లో ఆ బోగీ తయారుచేయబడిందని అర్ధం. అలానే ఆ బోగీ ఏసీ+ఏసీ 2 టైర్ కోచ్ అని అర్ధం. అదే 04052 అంటే ఆ బోగీ 2004లో తయారైందని.. అది ఏసీ 2 టైర్ కోచ్ అని అర్ధం. అలానే రైలు బయట కోచ్ ల మీద నంబర్స్ ఉన్నట్టే రైలులోపల బెర్త్ నంబర్ ఉంటాయి. బోగీలకు కూడా ఒక నంబర్ కూడా ఉంటుంది. ఆ నంబర్ తో పాటు మొదట్లో ఇంగ్లీష్, హిందీ భాషల్లో అక్షరాలు కనిపిస్తాయి.

డబ్ల్యూఆర్ అని, ఈఆర్ అని, ఎన్ఆర్ అని, సీఆర్ అని, ఎస్ఆర్ అని ఇంగ్లీష్ లో రాసి ఉంటాయి. మరి వీటి అర్ధమేంటో ఎప్పుడైనా తెలుసుకోవాలనిపించిందా? డబ్ల్యూఆర్ అంటే వెస్టర్న్ రైల్వే, ఈఆర్ అంటే ఈస్టర్న్ రైల్వే అని అర్థం. ఎన్ఆర్ అంటే నార్తర్న్ రైల్వే అని, ఎస్ఆర్ అంటే సౌతర్న్ రైల్వే అని.. సీఆర్ అంటే సెంట్రల్ రైల్వే అని అర్థం. దిక్కులను బట్టి భారతీయ రైల్వేలను పలు విభాగాలుగా విభజించారు. డబ్ల్యూఆర్ అనేది పశ్చిమ దేశానికి చెందినది. ఎస్ఆర్ అనేది దక్షిణ భారతదేశానికి చెందింది. ఈఆర్ అంటే తూర్పు భారతదేశానికి, ఎన్ఆర్ అనేది ఉత్తర భారతదేశానికి చెందినది. సీఆర్ అంటే కేంద్ర రైల్వే విభాగానికి చెందినది. ఈ వెస్టర్న్ రైల్వే 1951లో నవంబర్ 5న ఏర్పడింది.

బాంబే బరోడా, సెంట్రల్ ఇండియా రైల్వే ఇతర రాష్ట్రాల రైల్వేస్ తో విలీనం అయినప్పుడు వెస్టర్న్ రైల్వే ఏర్పడింది. దక్షిణ రైల్వే 1951లో ఏప్రిల్ 14న మద్రాస్, సదరన్ మహారథ రైల్వే, దక్షిణ భారతదేశ రైల్వే, మైసూర్ రాష్ట్ర రైల్వేతో విలీనం అయినప్పుడు సౌతర్న్ రైల్వే ఏర్పడింది. కొన్ని రైళ్లకు ఎన్ఈ అని రాసి ఉంటుంది. అంటే నార్త్ ఈస్టర్న్ రైల్వే అని అర్థం. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన రైలు అని అర్థం. ఈ అక్షరాలను బట్టి ఏ రైలు ఏ రాష్ట్రానికి పోతుందో అనేది తెలుస్తుంది. ఎప్పుడైనా పొరపాటున తొందరలో ఎక్కకుండా ఆ అక్షరాలను బట్టి ఎక్కడికి వెళ్తుందో తెలుసుకుని ఆగిపోవచ్చు. లేదంటే అస్సామే.