Swetha
సాధారణంగా ఈ మధ్య కాలంలో ఏదైనా హాస్పిటల్ కు వెళ్తే.. ఖచ్చితంగా పర్సులు ఖాళీ అవ్వాల్సిందే. కానీ, ఇప్పుడు చెప్పుకోబోయే ఓ డాక్టర్ గురించి తెలుసుకుంటే మాత్రం. ఇంకా ఇలాంటి డాక్టర్స్ ఉన్నారా అని ఆశ్చర్యపోవాల్సిందే.
సాధారణంగా ఈ మధ్య కాలంలో ఏదైనా హాస్పిటల్ కు వెళ్తే.. ఖచ్చితంగా పర్సులు ఖాళీ అవ్వాల్సిందే. కానీ, ఇప్పుడు చెప్పుకోబోయే ఓ డాక్టర్ గురించి తెలుసుకుంటే మాత్రం. ఇంకా ఇలాంటి డాక్టర్స్ ఉన్నారా అని ఆశ్చర్యపోవాల్సిందే.
Swetha
ఇప్పటివరకు ఉచిత వైద్యం చేయడం. లేదా ఐదు రూపాయలకే వైద్యం అందించడం అనేవి కేవలం సినిమాలలోనే చూసి ఉంటాం. రియాలిటీలో ఇటువంటివి చూడడం చాలా కష్టం. అందులోను ఈ మధ్య కాలంలో ఒక్కసారి చిన్న ఫీవర్ కే హాస్పిటల్ కు వెళ్ళమంటే చాలు.. ఇక జేబులు ఖాళీ అవ్వాల్సిందే. ఇక పెద్ద పెద్ద హాస్పిటల్స్ గురించైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్థిక స్థోమత బాగున్న వారైతే ఎలాగూ ఒకలా వైద్యం చేయించుకుంటారు. కానీ, ఆసుపత్రిలో వసూళ్ళు చేసే డబ్బులకు భయపడి.. కనీస వైద్యానికి నోచుకోని వారు మన చుట్టూ ఎంతోమంది ఉన్నారు. కానీ, రోగుల వద్ద ఉన్నంత అమౌంట్ ను మాత్రమే తీసుకుని వారికీ పూర్తి సదుపాయాలను అందించే వారు మాత్రం చాలా కొంతమంది ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీలోని డాక్టర్ కూడా అటువంటి వారే. వారి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఆమె పేరు డాక్టర్ ఇందు ప్రియ, ఆమె ఒక చిల్డ్రన్ స్పెషలిస్ట్. ఆమె తన భర్త కలిసి ప్రస్తుతం ఓ హాస్పిటల్ నడుపుతున్నారు. ఆయన ఓ ఆర్థోపెడిక్ సర్జన్. వారిద్దరూ కలిసి ఎంబీబిస్ పీజీ ఫినిష్ చేసిన తర్వాత.. కోయంబత్తూర్ లోని ఓ కార్పొరేట్ హాస్పిటల్ లో వర్క్ చేసేవారు. వారు తిరిగి వారి స్వస్థలం వెళ్లే ఆలోచనలో ఉండగా.. వారికీ ఓ ఆలోచన వచ్చింది . అదేంటంటే.. కేవలం రూ.30 కన్సల్టేషన్ ఫీ తీసుకుని అదే ఊరిలో రోజుకు రెండు గంటలు .. వారి ప్రాక్టీస్ ను సాగించాలని. ఈ క్రమంలోనే వారు ఈ హాస్పిటల్ ను ప్రారంభించారు. కానీ, వారు అనుకున్నట్లు తక్కువ కన్సల్టెన్సీ ఫీ కాకుండా .. ఓ డ్రాప్ బాక్స్ ను పెట్టారు. అంటే పేషంట్స్ వైద్యం చేయించుకున్న తర్వాత .. వారికీ నచ్చిన అమౌంట్ ను ఆ డ్రాప్ బాక్స్ లో వేయొచ్చు. అంటే స్థోమత ఉన్న వారిని లేని వారిని ఈ హాస్పిటల్ సమానంగా చూస్తుంది. తక్కువ ఫీ తీసుకుంటున్నారు కదా అని.. వైద్యంలో మాత్రం ఎక్కడ లోటు చేయరు ఈ డాక్టర్స్.
పైగా , అక్కడకు వచ్చిన పేషంట్స్ కూడా ఈ హాస్పిటల్ గురించి మంచి రివ్యూ నే ఇస్తూ ఉంటారు. నెల ఆఖరిలో చేతిలో డబ్బులు లేనపుడు .. ఏం చేయాలో అర్ధం కాక ఎంతో మంది పేద వారు భయపడుతూ ఉంటారు . కానీ, ఆ ఊరిలో మాత్రం భయపడరు. ఎందుకంటే అక్కడ ఆ దంపతులిద్దరూ వారి ప్రాక్టీస్ ను కొనసాగిస్తున్నారు కాబట్టి. ఈ క్రమంలో డాక్టర్ ఇందు ప్రియ మాట్లాడుతూ.. “12వ తరగతిలో నేను స్టేట్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. అప్పుడు ఎవరైనా పెద్దయ్యాక ఏం చేయాలి అని అడిగితే, డాక్టర్ అవ్వాలనుకుంటున్నా అని చెప్పేదాన్ని. అందరు ఇదే రకంగా డాక్టర్స్ అవుతారు. కానీ, అందరు ఇలానే ఎందుకు వైద్యం చేయట్లేదంటే.. దానికి సమాధానం ఎవరి వద్ద ఉండదు. దేవుడి దయ వలన నేను నా భర్త ఈ వృత్తిలో .. ప్రజలకు ఈ సేవలను అందించగలుగుతున్నాం. ” అంటూ చెప్పుకొచ్చారు ఇందు ప్రియ. ఏదేమైనా , సమాజంలో ఇంకా ఇటువంటి డాక్టర్స్ ఉన్నారంటే.. నిజంగా ఆశ్చర్య పోవాల్సిందే. మరి, ఈ డాక్టర్ దంపతులిద్దరూ తమ వంతు సాయంగా సమాజానికి అందిస్తున్న సేవలపై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.