iDreamPost
android-app
ios-app

దేశంలోనే తొలి హైటెక్ బిచ్చగాడు.. గుండెపోటుతో మృతి!

  • Published May 11, 2024 | 4:02 PM Updated Updated May 11, 2024 | 4:02 PM

Indias First High Tech Beggar: చాలా మంది యాచకులు ఏదైనా పాత్రలో చిల్లర అడగటం చూస్తుంటాం.. కానీ బిహార్ కి చెందిన ఓ యాచకుడు డిజిటల్ బిచ్చగాడుగా పేరు తెచ్చుకున్నాడు.

Indias First High Tech Beggar: చాలా మంది యాచకులు ఏదైనా పాత్రలో చిల్లర అడగటం చూస్తుంటాం.. కానీ బిహార్ కి చెందిన ఓ యాచకుడు డిజిటల్ బిచ్చగాడుగా పేరు తెచ్చుకున్నాడు.

దేశంలోనే తొలి హైటెక్ బిచ్చగాడు.. గుండెపోటుతో మృతి!

సాధారణంగా గుడి మెట్లు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్, రద్దీగా ఉండే సర్కిల్స్ వద్ద కొంతమంది యాచకులు బిక్షాటన చేస్తూ చిల్లర అడుగుతుంటారు. ఎవరైనా దయతలచి తమకు తోచినంత పాత్రలో వేస్తుంటారు. దేశ వ్యాప్తంగా లక్షల సంఖ్యల్లో బిక్షటాన చేస్తూ జీవిస్తున్నారు. కానీ.. బీహార్ లోని రైల్వే స్టేషన్ లో ఓ బిచ్చగాడు మాత్రం వీటన్నింటికి భిన్నంగా భిక్షాటన చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచేవాడు. మెడలో క్యూఆర్ కోడ్ ప్లకార్డు, చేతిలో ట్యాబ్ ని పట్టుకొని బిక్షాటన చేసేవాడు. అందుకే అతడికి డిజిటల్ బిచ్చగాడు అని పేరు పెట్టారు. అతని అసలు పేరు రాజు. తాజాగా హైటెక్ బిచ్చగాడు గుండెపోటుతో కన్నుమూయడంతో విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే..

దేశంలో   గుడి మెట్లు, రైల్వే స్టేషన్, వీధులు, బస్టాండ్ల వద్ద యాచకులు చిల్లర అడుగుతూ కనిపిస్తుంటారు. తమకు తోచిన చిల్లర ఇస్తే చల్లగా ఉండాలని దివిస్తుంటారు. అయితే రాజు అనే యాచకుడి స్టైల్ వేరు. బిహార్ లోని బెట్టియి రైల్వే స్టేషన్ వద్ద బిక్షాటన చేసుకుంటూ రాజు బికారీ కథ వేరు. హైటెక్ బెగ్గర్ గా పిలుచుకునే ఆయన దేశంలోని తొలి డిజిటల్ బెగ్గార్ గా పేరు తెచ్చుకున్నారు. ఇటీవల స్టేషన్ లో ఆయన బిక్షాటన చేస్తున్న సమయంలో ఆరోగ్యం క్షీణించి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలోనే ఆయనకు గుండెపోటు రావడంతో కన్నుమూసినట్లు వార్తలు వస్తున్నాయి.

భారత ప్రధాన మంత్రి మోదీ పిలుపునిచ్చిన డిజిటల్ ఇండియా స్ఫూర్తితో రాజు బికారి ఈ కొత్త అవతారం ఎత్తినట్లు పలు సందర్భాల్లో చెప్పుకున్నాడు.ఈ డిజిటల్ పద్దతి రాక ముందు దాదాపు 32 ఏళ్లుగా రాజు బికారీకి భిక్షాటనే జీవనోపాధి. మోడీ ఎంటే రాజు బికారీకి ఎంతో ఇష్టం.. ఆయన ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా వినేవాడు. అంతకు ముందు ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్నపుడు తన తండ్రి అంటూ చెప్పుకొని తిరిగేవాడు. అప్పట్లో రాజు బికారీ కి బెట్టియా రైల్వే స్టేషన్ క్యాంటిన్ లో రెండు పూటల ఆహారం అందించేవారు. కొద్దిరోజులుగా మతిస్థిమితం కోల్పోయినట్లు ప్రవర్తిస్తున్న రాజు అనారోగ్యానికి గురికావడం.. అంతలోనే హార్ట్ ఎటాక్ రావడంతో కన్నుమూశారు. యూట్యూబ్ లో పలువురు నెటిజన్లు రాజు బికారీ ఇక లేడు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.