iDreamPost
android-app
ios-app

ఈ అమ్మాయిని కాపాడటానికి ఇండియా పెద్ద పోరాటమే చేసింది!

  • Published Apr 19, 2024 | 12:37 PM Updated Updated Apr 19, 2024 | 12:37 PM

ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయ యువతిని ఇండియాకు తిరిగి రప్పించడం కోసం దేశం పెద్ద పోరాటమే చేసింది. ఎట్టకేలకు ఆమె క్షేమంగా తిరిగి వచ్చింది. ఆ వివరాలు..

ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయ యువతిని ఇండియాకు తిరిగి రప్పించడం కోసం దేశం పెద్ద పోరాటమే చేసింది. ఎట్టకేలకు ఆమె క్షేమంగా తిరిగి వచ్చింది. ఆ వివరాలు..

  • Published Apr 19, 2024 | 12:37 PMUpdated Apr 19, 2024 | 12:37 PM
ఈ అమ్మాయిని కాపాడటానికి ఇండియా పెద్ద పోరాటమే చేసింది!

దేశమంటే మట్టి కాదోయ్‌.. దేశమంటే మనుషులోయ్‌ అన్నారు పెద్దలు. మిగతా సమయాల్లో ఎలా ఉన్నా.. విపత్కర పరిస్థితులు.. ఆపద సమయాల్లో.. దేశ ప్రజలంతా ఏకతాటిపైకి వస్తారు. సమైక్యతను చాటుతారు. గతంలో ఇలంటి సంఘటనలు బోలేడు జరగ్గా.. ఈ మధ్య కాలంలో అలాంటి సంఘటనలు కొన్ని వెలుగు చూశాయి. గల్ఫ్‌ దేశాల్లో ఉరిశిక్ష పడ్డ వ్యక్తిని కాపాడ్డం కోసం కేరలీయులంతా ఏకమైన ఘటన గురించి చదివాం. ఇప్పుడు మరో యువతి కోసం దేశం మొత్తం కదలి వచ్చింది. ఆ అమ్మాయిని కాపడ్డం కోసం దేశం పెద్ద పోరాటమే చేసింది. ఇంతకు ఎవరా యువతి.. ఆమెకు వచ్చిన సమస్య ఏంటి.. ఎలా దాన్ని పరిష్కరించారు అన్న వివరాలు మీకోసం..

ప్రస్తుతం ఇరాన్‌, ఇజ్రాయెల్‌ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. ఇప్పటికే రష్యా-ఉక్రెయిన్‌ మధ్య వార్‌తో ప్రపంచ దేశాలు తలలు పట్టుకుంటున్నాయి. ఇప్పుడు ఇరాన్‌, ఇజ్రాయెల దేశాలు కూడా ఆ జాబితాలో చేరితే.. ఇక మూడో ప్రపంచ యుద్ధమే అంటున్నారు నిపుణులు. ఇదిలా ఉంటే.. ఇజ్రాయెల్‌తో సంబంధం ఉందనే అనుమానంతో ఈ నెల 13న హర్మూజ్‌ జలసంధి సమీపంలో.. కార్గో షిప్‌ ఎంఎస్‌సీ ఏరీస్‌ను ఇరాన్‌ స్వాధీనం చేసుకుంది. ఈ నౌక ఇజ్రాయెల్‌కు సంబంధించిందే అని.. అందుకే దాన్ని స్వాధీనం చేసుకున్నామని ఇరాన్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే నౌకను బంధించడానికి.. ఇండియాకు సంబంధం ఏంటి.. అంటే.. దీనిలో 17 మంది భారతీయులున్నారు.

వారిని సురక్షితంగా ఇండియాకు తిరిగి తీసుకురావడం కోసం.. భారత్‌ రంగంలోకి దిగింది. ఈ నౌకలో చిక్కుకున్న 17 మంది భారతీయులను విడిపించడం కోసం విదేశీ వ్యవహరాల శాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌ రంగంలోకి దిగారు. మూడు రోజుల క్రితం ఆయన ఇరాన్‌ విదేశాంగ మంత్రి హుసేన్‌ అమీర్‌ అబ్దుల్లాతో దీనిపై చర్చించారు. ఇక జైశంకర్‌ అభ్యర్థన మేరకు ఇండియన్‌ సిబ్బందిని.. టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయ అధికారులు కలిసేందుకు ఇరాన్‌ అనుమతించింది. చర్చల తర్వాత నౌకలో చిక్కుకున్న కేరళ, త్రిసూర్‌కు చెందిన డెక్‌ క్యాడెట్‌ ఆన్‌ టెస్సా జోసెఫ్‌ని ఇరాన్‌ విడిచిపెట్టింది. మిగతా 16 మంది సురక్షితంగానే ఉన్నారని.. వారి గురించి దిగులు పడవద్దని.. వారంతా ఇండియాలోని తమ కుటుంబ సభ్యులతో టచ్‌లో ఉన్నారని.. రణ్‌ధీర్‌ జైస్వాల్‌ వెల్లడించారు. వారిని కూడా వీలైనంత త్వరగా ఇరాన్‌ నుంచి విడిపించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఇరాన్‌ స్వాధీనం చేసుకున్న కార్గో షిప్‌ ఎంఎస్‌సీ ఏరిస్‌ షిప్‌లో ఉన్న ఆన్‌ టెస్సా జోసెఫ్‌ గురువారం సురక్షితంగా కొచ్చిన్‌కు తిరిగి వచ్చారు. ఆమెకు సాదర స్వాగతం పలికారు అధికారులు. మిగిలిన 16 మందిని విడిపించడం కోసం భారత్‌.. ఇరాన్‌తో టచ్‌లో ఉందని.. త్వరలోనే వారిని సురక్షితంగా ఇండియాకు తీసుకుని వస్తామని తెలిపారు.