iDreamPost
android-app
ios-app

Indian Railways: పర్యావరణ పరిరక్షణకు భారత రైల్వే శాఖ కీలక నిర్ణయం! ఆ సౌకర్యాలు అప్‌డేట్..

ఇండియన్ రైల్వే వ్యవస్థ ఇటీవల పర్యావరణ అనుకూలమైన  ప్రధాన రవాణ సాధనంగా మారుతుంది. పర్యావరణ పరిరక్షణ కోసం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా పలు విషయాలను వెల్లడించింది.

ఇండియన్ రైల్వే వ్యవస్థ ఇటీవల పర్యావరణ అనుకూలమైన  ప్రధాన రవాణ సాధనంగా మారుతుంది. పర్యావరణ పరిరక్షణ కోసం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా పలు విషయాలను వెల్లడించింది.

Indian Railways: పర్యావరణ పరిరక్షణకు భారత రైల్వే శాఖ కీలక నిర్ణయం! ఆ సౌకర్యాలు అప్‌డేట్..

భారతీయ రైల్వే వ్యవస్థ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిత్యం లక్షల మందిని  గమ్యస్థానాలకు చేర్చడంలో రైల్వే రవాణ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది. అలానే వివిధ సరకలు ను రవాణ చేయడంలోనూ  రైల్వే శాఖ ఎంతో ఉపయోగపడుతుంది. ఇక రైల్వే వ్యవస్థ కూడ తరచూ అనేక సదుపాయాలు కల్పిస్తుంటారు.  రైల్వే స్టేషన్లలో అత్యాధునిక సదుపాయాలు కల్పిస్తుంది. అలానే తాజాగా పర్యావరణ పరిరక్షణకు ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

ఇండియన్ రైల్వే వ్యవస్థ ఇటీవల పర్యావరణ అనుకూలమైన  ప్రధాన రవాణ సాధనంగా మారుతుంది. పర్యావరణ పరిరక్షణ కోసం కాలుష్యాన్ని పెంచే ఉద్గారాలను తగ్గించడం, వనరులు, ఇంధన సామర్థ్యాన్ని ప్రోత్సహించడం ద్వారా పర్యావరణంపై సానుకూల ప్రభావాన్ని చూపే కార్యక్రమాలను రైల్వే శాఖ నిరంతరం తీసుకుంటుంది. ఈ క్రమంలోనే డిజిల్ ద్వారా నడిచే రైళ్లలకు స్వస్థి పలకాలనే యోచనలో ఉంది. ఈ క్రమంలోనే భారతీయ రైల్వేలు ఏప్రిల్ వరకు 63,456 రూట్ కిలోమీటర్లు విద్యుదీకరించిందని ఓ కార్యక్రమంలో రైల్వే అధికారులు పేర్కొన్నారు.

ఇది భారతీయ రైల్వేల మొత్తం బ్రాడ్ గేజ్ వ్యవస్థ కంటే 96 శాతం కంటే ఎక్కువగా ఉంటుంది. మొత్తం 2,637  రైల్వే స్టేషన్లతో పాటు సర్వీస్ భవనాలకు 177 మెగావాట్ల కరెంట్ ఉత్పత్తి సామర్థ్యంతో సోలార్ ప్లాంట్ ను అందించామని రైల్వే మినిస్ట్రీ తెలిపింది.  ఈసందర్భంగా పర్యావరణ పరిరక్షణ కోసం ఇండియన్ రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 2024 నుంచి ఇండియన్ రైల్వే ఎన్విరాన్మెంట్  కాపాడేందుకు ప్రజలను చైతన్యపరిచే లక్ష్యంతో ‘మిషన్ లైఫ్’పై అడ్వకేసీ కార్యకలాపాలను కూడా తీసుకుంటుందని అధికారులు చెబుతున్నారు.

ఇప్పటి వరకు 249 అవగాహన, 147 యాక్షన్ కార్యక్రమాలను నిర్వహించారు. ప్రధాన రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి కోసం పర్యావరణ నిర్వహణ ప్లాన్ రూపంలో మార్గదర్శకాలను అధికారులు అందించాయి. పరిసర ప్రాంతాలలో నిర్మాణ ప్రభావాలను తగ్గించడానికి జోనల్ రైల్వేల్లో ఈ మార్గదర్శకాలను అనుసరించాలని అధికారులు పేర్కొంటున్నారు. అలానే ప్లాస్టిక్ నివారణకు ప్రధాన రైల్వే స్టేషన్లలో దాదాపు 826 ప్లాస్టిక్ బాటిల్ క్రషింగ్ మెషీన్లను ఏర్పాటు చేశారు. మొత్తంగా ఇలా పర్యావరణ  పరిరక్షణ కోసం రైల్వే శాఖ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది.