P Venkatesh
వర్షాభావ పరిస్థితులతో అల్లాడుతున్న రైతులకు గుడ్ న్యూస్. ఈ ఏడాది ముందుగానే రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్ మెంట్.
వర్షాభావ పరిస్థితులతో అల్లాడుతున్న రైతులకు గుడ్ న్యూస్. ఈ ఏడాది ముందుగానే రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్ మెంట్.
P Venkatesh
గతేడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. పంటలు పండించేందుకు సరిపడా నీరు లేక అష్టకష్టాలను అనుభవించారు. ఎల్ నినో ప్రభావంతో దేశమంతా కరువు పరిస్థితులు దాపరించాయి. కొన్ని చోట్ల నోటికాడికి వచ్చిన పంటలు నీటి ఎద్దడితో ఎండిపోయి పశువులకు మేతగా మారుతున్నాయి. దీంతో వ్యవసాయమే వృత్తిగా జీవిస్తున్న రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు తీపి కబురును అందించింది ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్ మెంట్. ఈ సారి ముందుగానే రుతుపవనాలు వచ్చే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. అంతే కాదు ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురుస్తాయని చల్లని కబురును అందించింది.
భారతదేశం వ్యవసాయాధారిత దేశం. మెజారిటీ ప్రజలు వ్యవసాయంపైనే ఆదారపడి జీవిస్తున్నారు. పంటలు బాగా పండాలంటే సాగు నీరు ఎంతో ముఖ్యం. ఎల్ నినో ప్రభావంతో వర్షాలు కురవక వ్యవసాయం అస్తవ్యస్తంగా మారిపోయింది. అయితే లానినోపరిస్థితుల కారణంగా ఈ ఏడాది రుతుపవనాలు ముందుగానే వచ్చి దేశ వ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా భగభగ ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో ప్రజలు ఇంట్లో నుంచి బయటికి రావాలంటేనే జంకుతున్నారు.
ఎండ తీవ్రతతో పలు ప్రాంతాల్లో తాగు నీటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే వర్షాకాలంలో ఈ సారైనా వర్షాలు పడతాయో లేదో అని ఆందోళన చెందుతున్న ప్రజలకు ఐఎండీ గుడ్ న్యూస్ అందించింది. ఈ ఏడాది జూన్-ఆగస్టు నాటికి లా నినా పరిస్థితులు ఏర్పడితే ముందుగానే రుతుపవనాలు వస్తాయని.. దీంతో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. దీంతో దేశ వ్యాప్తంగా ఉన్న రైతులు, సాధారణ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.