iDreamPost
android-app
ios-app

పైకి గోల్డ్ షాప్.. లోపల మాత్రం ఎక్కడ పట్టినా నోట్ల కట్టలే! ఎక్కడంటే?

  • Published May 27, 2024 | 12:40 PM Updated Updated May 27, 2024 | 12:40 PM

Bundles of Notes Everywhere: డబ్బు కోసం సామాన్యు నుంచి సంపన్నుల వరకు ఎన్నో రకాల పనులు చేస్తుంటారు. కొంతమంది ఎంత డబ్బు ఉన్నా.. ప్రభుత్వానికి ఏదీ లేదని బుకాయిస్తూ పన్నులు ఎగవేస్తుంటారు.

Bundles of Notes Everywhere: డబ్బు కోసం సామాన్యు నుంచి సంపన్నుల వరకు ఎన్నో రకాల పనులు చేస్తుంటారు. కొంతమంది ఎంత డబ్బు ఉన్నా.. ప్రభుత్వానికి ఏదీ లేదని బుకాయిస్తూ పన్నులు ఎగవేస్తుంటారు.

  • Published May 27, 2024 | 12:40 PMUpdated May 27, 2024 | 12:40 PM
పైకి గోల్డ్ షాప్.. లోపల మాత్రం ఎక్కడ పట్టినా నోట్ల కట్టలే! ఎక్కడంటే?

డబ్బు ఎవరికి చేదు.. డబ్బుకు లోకం దాసోహం అన్నారు పెద్దలు. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు డబ్బు సంపాదించడం కోసం ఎన్నో రకాల పనులు చేస్తున్నారు. ఎవరి స్థాయిలో వారు డబ్బు సంపాదిస్తున్నారు. కొంతమంది కోట్లు సంపాదించినా.. డబ్బుపై వ్యామోహం తగ్గదు. అంతకు రెట్టింపు సంపాదన కావాలనే కోరికతో ఉంటారు. సంపన్నుల ఇళ్లల్లో కోట్ల కొద్ది నల్లధనం మూలుగుతూ ఉంటుంది. ప్రభుత్వానికి నిజాయితీగా కట్టాల్సిన ఇన్‌కం టాక్స్ కట్టకుండా ఎగవేస్తుంటారు. ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టకుండా అక్రమంగా డబ్బు దాచుకున్న వారిపై ఆదాయపన్ను శాఖ కొరడా ఝులిపిస్తుంది. తాజాగా ఓ బడా జ్యువెలరీ షాప్  యజమాని ఇంట నోట్ల కట్టలు బయటపడ్డాయి. వివరాల్లోకి వెళితే..

మహారాష్ట్ర లోని నాసిక్ లో ఉన్న ఓ జ్యువెలరీ షాప్ యజమాని ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులను ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేశారు. కానీ ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు ఆ యజమానికి చుక్కలు చూపించారు. నాసి్ లో ఉన్న సురానా జ్యువెలరీ షాప్  యజమాని కార్యలయంపై గురువారం సాయంత్రం రైడ్స్ చేశారు.. కానీ వారికి డబ్బు ఎక్కడా అంతు చిక్కలేదు. అయినా తమ ప్రయత్నం వీడలేదు.. తమకు వచ్చిన సమాచారం పక్కగా ఉందని తెలుసుకొని అన్ని కోణాల్లో 55 మంది టీమ్ తో రైడ్స్ చేశారు. రాకా కాలనీలో ఉన్న సురానా జ్యులరీ యజమాని బంగ్లలో సైతం చిల్లి గవ్వ దొరకలేదు. సంస్థ లాకర్లలో కొద్దిపాటి డబ్బు లభించింది. గురు, శుక్ర కూడా ఇదే పరిస్థితి. తాను అన్నీ సక్రమంగా ఫాలో అవుతున్నానని.. లెక్కలు సరిగా ఉన్నాయని జ్యులరీ షాపు యజమాని బుకాయించాడు.

ఐటీ అధికారులు మాత్రం నిను వీడేది లేదు అన్న చందంగా శనివారం సురానా జ్యులరీ షాపు యజమాని బంధువు బంగ్లలోని ఫర్నీచర్ బద్దలు కొట్టారు. అంతే అందులో నగదు కట్టలు పెద్ద ఎత్తున బయటపడ్డాయి. శనివారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సెలవు.. దీంతో నాసిక్ లోని ఎస్‌బీఐ ప్రధాన కార్యాలయానికి ఆ డబ్బు తరలించారు. దాదాపు 14 గంటల పాటు ఆ డబ్బు లెక్కించగా.. రూ.26 కోట్ల నగదు అని తేలింది.ఆ డబ్బు ఐటీ శాఖకు లెక్కల్లో చూపించనిది అని ఐటీ అధికారి తెలిపారు. రూ.90 కోట్ల విలువైన ఆస్తి పత్రాలను కూడా ఈ రైడ్స్ లో స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల పలు చోట్ల ఆదాయపన్ను శాఖ వారు ఆకస్మిక దాడులు చేస్తూ కోట్లు డబ్బు బయటకు లాగుతున్నారు.