iDreamPost
android-app
ios-app

రైలు ప్రయాణీకులకు ముఖ్య సూచన.. ఇకపై ఆ సీట్లు వీరికే..

  • Published May 17, 2024 | 12:41 PM Updated Updated May 17, 2024 | 1:50 PM

Important Note for Train Passengers: దేశంలో నిత్యం లక్షల సంఖ్యల్లో భారతీయ రైల్వేలో ప్రయాణం చేస్తుంటారు. ఈ క్రమంలోనే సీనియర్ సిటిజన్లకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది.

Important Note for Train Passengers: దేశంలో నిత్యం లక్షల సంఖ్యల్లో భారతీయ రైల్వేలో ప్రయాణం చేస్తుంటారు. ఈ క్రమంలోనే సీనియర్ సిటిజన్లకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది.

రైలు ప్రయాణీకులకు ముఖ్య సూచన.. ఇకపై ఆ సీట్లు వీరికే..

దేశంలో చాలా మంది రైలు ప్రయాణాలు చేయడానికి ఇష్టపడతారు. ఎందుకంటే బస్ టికెట్ కన్నా.. రైలు టికెట్ చవక. అంతేకాదు రైలు లో ఎన్నో సదుపాయాలు ఉంటాయి. ముఖ్యంగా సుదూర ప్రాంతాలు ప్రయాణాలు చేసేవారికి రైలు ప్రయాణం ఎంతో సౌకర్యంగా ఉంటుంది. అందుకే సామాన్యుల నుంచి సంపన్నుల వరకు రైలు ప్రయాణాలు చేస్తుంటారు. అందుకే భారతీయ రైల్వేలో ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణిస్తుంటారు. తాజాగా రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ ముఖ్య వార్త తెలిపింది. వివరాల్లోకి వెళితే..

భారతీయ రైల్వే ప్రతి ప్రయాణికుల సౌకర్యం కోసం అన్ని విధాలుగా ప్రయత్నిస్తుంది. నిత్యం ప్రయాణికులతో రైల్వే స్టేషన్లు రద్దీగా ఉంటాయి. రైల్వే శాఖ సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక రాయితీ కల్పిస్తుంది. రైలు ప్రయాణం చేసేవారికి లోయర్ బెర్త్ కి సంబంధించి రైల్వే శాఖ కొత్త నిబంధనను విడుదల చేసింది. ఇకపై కింద సీటును ఈ సీనియర్ సిటిన్లకు మాత్రమే రిజర్వ్ చేయనున్నట్లు తెలిపింది. ఈ ప్రత్యేక నిబంధనల ద్వారా సినియర్ సిటిజన్ల ప్రయాణం సులభం చేస్తుంది. లోయర్ బెర్త్ ను సీనియర్ సిటిజన్ లకు రిజర్వ్ చేయనుంది.

ఇకపై సీనియర్ సిటిజన్లకు లోయర్ బెర్త్ ను కేటాయించడం గురించి IRCTC ఓ వార్త తెలియజేసింది. సీనియర్ సిటిజన్లకు లోయర్ బెర్త్ ఎలా రిజర్వ్ చేయాలో రైల్వేశాఖ తెలిపింది. సాధారణ రిజర్వేషన్ కింద టికెట్లు బుక్ చేసుకుంటే సీటు అందుబాటులో ఉంటే సీటు కేటాయింపు ఉంటుంది అని రైల్వే శాఖ తెలిపింది. సీనియర్ సిటిజన్లకు లోయర్ బెర్త్ కేటాయిస్తే రిజర్వేషన్ బుక్ కింద లోయర్ బెర్త్ లభిస్తుంది. ఈ సీట్లు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన సీనియర్ సిటిజన్లకు అందుబాటు లో వస్తాయని తెలిపింది. ఒకవేళ ఈ విషయంలో ఏవైనా ఇబ్బంది ఉంటే.. టీటీఈ ని సంప్రదించవొచ్చు అని రైల్వే శాఖ తెలిపింది.