iDreamPost
android-app
ios-app

రానున్న రెండు రోజుల్లో ఉత్తరాదిన భారీ వానలు.. ఆ రాష్ట్రాలు జాగ్రత్త!

IMD Issues Orange Alert: కొన్ని రోజుల నుంచి పలు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఇది ఇలా ఉంటే.. రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురవనున్నాయాని ఐఎండీ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కొన్ని ప్రాంతాల ప్రజలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.

IMD Issues Orange Alert: కొన్ని రోజుల నుంచి పలు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఇది ఇలా ఉంటే.. రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురవనున్నాయాని ఐఎండీ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కొన్ని ప్రాంతాల ప్రజలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.

రానున్న రెండు రోజుల్లో ఉత్తరాదిన భారీ వానలు.. ఆ రాష్ట్రాలు జాగ్రత్త!

గతకొన్ని రోజుల నుంచి దేశ వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. ఉత్తరాదిన మొదలకుని, దక్షిణాదిలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు విజృభిస్తున్నాయి. క్లౌడ్ బరస్ట్ అని శాస్త్రవేత్తలు చెబుతున్న నేపథ్యంలో వానలు కుండపోతగా కురుస్తున్నాయి. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో  జనజీవనం స్తంభించింది. చాలా ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు విరిగిపోయి..చీకట్లో ఉండిపోయాయి. ఇప్పటికే భారీగా కురుస్తున్న వానలతో జనాలు అల్లడిపోతుంటే.. తాజాగా వారికి మరో షాకింగ్ న్యూస్ వచ్చింది. రాబోయే రెండు రోజుల్లో ఉత్తరాదిన  భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ నేపథ్యంలో 10 రాష్ట్రాలకు ఆరెంజ్  అలెర్ట్ జారీ చేశారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే…

కొన్ని రోజుల నుంచి పలు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఇక ప్రకృతి సృష్టించిన విలయానికి కేరళ గజగజ వణికిపోయింది. వందలామంది  మరణించగా, మరెందరో గల్లంతయ్యారు. ఆ రాష్ట్రంలో ఎక్కడ చూసిన వరదలు సృష్టించిన విధ్వంసమే కనిపిస్తుంది. ఇలా కేవలం కేరళ రాష్ట్రంలోని కాకుండా ఉత్తరాది రాష్ట్రాలైన హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరాకఖండ్ వంటి పలు రాష్ట్రాల్లను వరద నీరు ముచ్చెంత్తింది. కొండ చరియలు విరిగిపడి.. అనేక జాతీయ రహదారులు మూతపడ్డాయి. ఇదే సమయంలో వాతావరణ శాఖ మరో కీలక అలెర్ట్ జారీ చేసింది.

Heavy rains in two days

ఉత్తరాది రాష్ట్రాల్లో రాబోయే రెండు రోజుల్లో భారీ నుంచి అతిభారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. హిమాచల్ ప్రదేశ్, యూపీ, ఎంపీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాలతో పాటు  ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, మిజోరాం, త్రిపురం, అసోం, మేఘాలయ ల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ఈ క్రమంలోనే ఆగష్టు 7 బుధవారం ఆయా రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతారవణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది.

ఇదే సమయంలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హెచ్చరికలు జారీ చేసింది ఆ రాష్ట్రంలోని పది జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాని, అరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 48 గంటల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసి… ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా సిమ్లా, సిర్మౌర్, సోలన్, ఉన్నా, కులు, మండి, కాంగ్రా,హామీన్ ,పూర్,బిలాస్ పూర్ వంటి పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇలానే రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వాన కురిసింది. సాయంత్రం సమయంలో కూడా వర్షం పడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. మొత్తం ఉత్తరాది ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది.