iDreamPost
android-app
ios-app

Illicit Liquor: కల్తీ సారాతో 26 మంది మృతి.. 30 మందికి తీవ్ర అస్వస్థత.. సీఎం సీరియస్‌

  • Published Jun 20, 2024 | 8:56 AMUpdated Jun 20, 2024 | 8:56 AM

కల్తీ సారా సేవించి సుమారు 26 మంది చెందగా.. మరో 30 మంది తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన కలకలం రేపింది. ఆవివరాలు..

కల్తీ సారా సేవించి సుమారు 26 మంది చెందగా.. మరో 30 మంది తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన కలకలం రేపింది. ఆవివరాలు..

  • Published Jun 20, 2024 | 8:56 AMUpdated Jun 20, 2024 | 8:56 AM
Illicit Liquor: కల్తీ సారాతో 26 మంది మృతి.. 30 మందికి తీవ్ర అస్వస్థత.. సీఎం సీరియస్‌

మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని ప్రభుత్వాలు, ప్రముఖులు ఎన్ని రకాలుగా ప్రచారం చేసిన మందు బాబులు మాత్రం మారరు. మద్యం వల్ల ఎన్ని అనర్థాలు చోటు చేసుకుంటున్నాయో.. ఎన్ని కుటుంబాలు రోడ్డున పడుతున్నాయో.. ఎందరి జీవితాలు బలువుతున్నాయో నిత్యం చూస్తూనే ఉన్నా సరే.. మందుబాబులు మాత్రం తమ తీరు మార్చుకోవడం లేదు. ఇక సమాజంలో జరిగే పలు నేరాలకు మద్యపానమే ప్రధాన కారణం. అయితే దీని వల్ల జనాలకు ఎంత నష్టమో ప్రభుత్వాలకు అంత లాభం. చాలా రాష్ట్రాల్లో మద్యం మీద వచ్చే ఆదాయంతోనే బండిని ముందకు లాగిస్తున్నాయి అనేది బహిరంగ రహస్యం.

రేట్లు ఎంత పెంచినా.. కల్తీ చేసినా సరే.. మద్యం డిమాండ్‌ మాత్రం తగ్గడం లేదు. ఇక ఆల్కహాల్‌ సేవించే వారిలో తెలుగు రాష్ట్రాల ప్రజలే ముందు వరుసలో ఉంటారు. ఇక కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్లు.. ఆహార పదార్థాలతో పాటు మద్యాన్ని కూడా కల్తీ చేస్తుంటారు. దాన్ని తాగితే తీవ్ర అనారోగ్య సమస్యలతో పాటు ప్రాణాలు కూడా పోతాయి. తాజాగా ఇదే సంఘటన చోటు చేసుకుంది. కల్తీ మద్యం తాగి సుమారు 26 మంది చనిపోగా.. 30 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆవివరాలు..

కల్తీ సారా సేవించి 26 మంది చనిపోగా.. మరో 60 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో 30 మంది తీవ్ర అస్వస్థతకు గురైన సంఘటన తమిళనాడులో వెలుగు చూసింది. రాష్ట్రంలోని కళ్లకురిచ్చి జిల్లాలో కల్తీ సారా తాగి ఇప్పటి వరకు మృతి చెందారు. మరో 30 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటన తమిళనాడును కుదిపేస్తుంది. దీనిపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం అవుతుండటంతో.. ముఖ్యమంత్రి స్టాలిన్‌ స్పందించారు. కల్తీ సారా ఘటనపై సీబీ-సీఐడీ విచారణకు ఆదేశించారు.

ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతేకాక ఘటన చోటు చేసుకున్న కళ్లకురుచ్చి జిల్లా కలెక్టర్‌, ఎస్పీ సహా పలువురు అధికారులపై బదిలీ వేటు వేశారు. ఇక ఈ దారుణానికి కారమైన వారిలో ఒకరిని అరెస్ట్‌ చేశారు పోలీసులు. అతడి వద్ద నుంచి భారీగా కల్తీ సారాను సీజ్‌ చేశారు. అలానే బాధితులకు వైద్యం అందిచడం కోసం 18 ప్రత్యేక వైద్య బృందాలను చెన్నై నుంచి కళ్లకురిచ్చికి పంపించినట్లు ప్రభుత్వం తన ప్రకటనలో వెల్లడించింది.

కల్తీ మద్యం విక్రయానికి పాల్పడుతున్న వారి గురించి ప్రజలు అధికారులకు తెలియజేస్తే వెంటనే వారిపై చర్యలు తీసుకుంటామని సీఎం స్టాలిన్ వెల్లడించారు. సమాజాన్ని నాశనం చేసే ఇలాంటి నేరాలను ఉక్కుపాదంతో అణచివేస్తామని తెలిపారు. కల్తీ మద్యం సేవించి.. ఇంత మంది చనిపోవడం తనను తీవ్రంగా కలచి వేసిందని చెప్పుకొచ్చారు. ఈ మేరకు స్టాలిన్‌ ట్వీట్‌ చేశారు. ఇక కల్తీ సారా తాగి అస్వస్థతకు గురైన వారిని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి