Keerthi
ikea store: ప్రపంచంలోనే అతిపెద్ద ఫర్నీచర్ రిటైలర్‌గా గుర్తింపు పొందిన ఐకియా సంస్థ త్వరలోనే మూసివేస్తున్నట్ల సమాచారం అందింది కారణం తెలిస్తే..
ikea store: ప్రపంచంలోనే అతిపెద్ద ఫర్నీచర్ రిటైలర్‌గా గుర్తింపు పొందిన ఐకియా సంస్థ త్వరలోనే మూసివేస్తున్నట్ల సమాచారం అందింది కారణం తెలిస్తే..
Keerthi
ప్రపంచంలోనే అతిపెద్ద ఫర్నీచర్ స్టోర్ గా గుర్తింపు పొందిన ఐకియా గురించి అందరికి తెలిసిందే. ఇది స్వీడన్ కు చెందిన అతిపెద్ద సంస్థగా గుర్తింపు పొందింది. దీనిని భారత్ లోని పలు నగరాల్లో ఐకియా స్టోర్ లను నడుపుతోన్న విషయం తెలిసిందే. అలాగే హైదరాబాద్ మహానగరంలో కూడా ఐకియా ను స్థాపించడం కోసం దాదాపుగా 12 ఏళ్లుగా కృషి చేయగా చివరికి 2018లో సాధ్యమైయింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని 13 ఎకరాల విస్తీర్ణంలో ఐకియా మాల్ అనేది అందుబాటులోకి వచ్చింది. దీని తర్వాత ముంబయి నగరంలో కూడా ఈ ఐకియా స్టోర్ ను ప్రారంభించారు. అయితే ఉన్నటుండి.. ఏ ఐకియా సంస్థ మాల్ కు సంబంధించి ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. అదేమిటంటే..
దేశ ఆర్ధిక రాజధాని ముంబయి నగరంలో ఇటీవలే ఐకియా స్టోర్ అనేది ప్రారంభించిన విషయం తెలిసిందే. అలాగే దేశంలో 2025 నాటికి 25వ స్టోర్ గా తెరవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఐకియా అప్పట్లో ప్రకటించింది. కానీ, ఉన్నటుండి ఈ సంస్థ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ముంబయిలో తాము ప్రారంభించిన స్టోర్ ను ఈ ఏడాది మధ్యనాటికి మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే ఈ స్టోర్ మూసివేతకు గల కారణంలు కూడా వెల్లడించింది. అదేమిటంటే.. ముంబయిలోని ఐకియా స్టోర్ మూసివేతకు అక్కడ తక్కువ విస్తీర్ణమే కారణమని పేర్కొంది. కాగా, 70వేల అడుగుల చదరపు విస్తీర్ణంలో.. ఆర్ సిటీ అనే పేరుతో ప్రారంభించిన మాల్ 2022 జూన్ లో ఐకియా ప్రారంభించింది. అయితే, స్థల విస్తీర్ణత లేకపోవడం వల్లే ఐకియా వస్తువులను కస్టమర్లలకు అందించలేక పోయామని, అందుకే ఈ ఏడాది మధ్యనాటికి ఈ స్టోర్ ని మూసివేస్తామని తాజాగా వెల్లడించింది.
అయితే, దీనివల్ల భారత్ లో ఉన్న సంస్థలకు సంబంధించి ఇతర యూనిట్లు పై ప్రభావితం కావని, మా వినియోగదారులకు అత్యుత్తమ సేవాలను అందించడం కొనసాగిస్తాం అని కంపెనీ గురువారం తెలిపింది. దీనితో పాటు భారత్‌లో ఐకియాకు ముంబయి ఒక కీలకమైన మార్కెట్ అని, ఆ నగరంతో పాటు మహారాష్ట్రలోని ఇంతర ప్రాంతాలలో పెట్టుబడులను కొనసాగిస్తామని కంపెనీ తెలిపింది. అలాగే ఇప్పటికే ఉన్న నవీ ముంబయి సైట్‌ను రిటైల్ డెస్టినేషన్‌గా మరింత అభివృద్ధి చేయడంతో పాటు.. పూణెలో కొత్తగా విస్తరించి, ఆన్‌లైన్ ద్వారా మరింత అందుబాటులోకి తేస్తామని చెప్పింది. ఇక మహారాష్ట్రపై మరింత దృష్టిసారించాం అని పేర్కొంది. అలాగే వర్లీలోని చిన్న స్టోర్ తో పాటు నవీ ముంబయిలోని 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అతిపెద్ద ఔట్ లెట్ ని ఐకియా నడుపుతోంది.
ప్రస్తుతం ఐకియా సంస్థ హైదరాబాద్, నవీ ముంబయి, బెంగళూరులో పెద్ద స్టోర్‌లను నడపడంతో పాటు.. ముంబయిలో మరో రెండు చిన్న స్టోర్లు ఉన్నాయి. అలాగే త్వరలో ఢిల్లీ-ఎన్‌సీఆర్, గురుగ్రామ్‌లో ఐకియా యాంకర్ షాపింగ్ సెంటర్‌ను ప్రారంభించనుంది. ఇక ముంబయిలో ఆర్ సిటీ స్టోర్ మూసివేత వల్ల ప్రభావితమైన సిబ్బందికి, ఇతర మార్కెట్‌లలో అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేసింది. మరి, త్వరలో ముంబయిలోని ఐకియా స్టోర్ మూసివేయడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.