EPFO: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. నెలకు రూ.10,500 పెన్షన్.. కేంద్రానికి ప్రతిపాదన!

Monthly 10,500 Rupees For Employees: ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఇక నుంచి ప్రతి నెలా 10,500 రూపాయలు పొందే అవకాశం కనిపిస్తుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. ఈ అంశం మీద కేంద్రం పరిశీలిస్తుంది.

Monthly 10,500 Rupees For Employees: ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఇక నుంచి ప్రతి నెలా 10,500 రూపాయలు పొందే అవకాశం కనిపిస్తుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. ఈ అంశం మీద కేంద్రం పరిశీలిస్తుంది.

ఎంప్లాయిస్ పెన్షన్ స్కీంని ఈపీఎఫ్ఓ నిర్వహిస్తుంది. ఈపీఎస్ పెన్షన్ లెక్కించేందుకు 2014కి ముందు పీఎఫ్ వేతన పరిమితి రూ. 6,500గా ఉండేది. సెప్టెంబర్ 1 2014 తర్వాత ఈ పరిమితిని 15 వేల రూపాయలకు పెంచింది కేంద్రం. అంతే మళ్ళీ అప్పటి నుంచి దీని మీద ఎలాంటి సవరణలు చేయలేదు. దీంతో గత కొన్నేళ్లుగా పీఎఫ్ వేతన పరిమితిని 21 వేల రూపాయలకు పెంచాలన్నా డిమాండ్లను వినిపిస్తున్నారు. అయితే ఈ డిమాండ్లు త్వరలోనే నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎంప్లాయిస్ పెన్షన్స్ స్కీం (ఈపీఎస్) కంట్రిబ్యూషన్ గరిష్ట వేతన పరిమితిని 21 వేల రూపాయలకు పెంచాలని కేంద్ర కార్మిక ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది.

ఈ ప్రతిపాదనకు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) ఆమోదించినట్లైతే ఈపీఎఫ్ఓ సెక్టార్లలో పని చేసే ఉద్యోగులకు పెన్షన్ పెరుగుతుంది. ప్రస్తుతం 15 వేల రూపాయలుగా ఉన్న ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ గరిష్ట వేతన పరిమితిని 21 వేలకు పెంచాలని కేంద్ర కార్మిక ఉపాధి కల్పన మంత్రిత్వశాఖ.. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపించింది. ఈ ప్రతిపాదనకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపితే కనుక 15 వేల రూపాయల గరిష్ట వేతన పరిమితి 21 వేల రూపాయలకు పెరుగుతుంది. అప్పుడు గరిష్ట పెన్షన్ 10,500 రూపాయలకు పెరుగుతుంది. ఈపీఎఫ్ పెన్షన్ ని ఎలా లెక్కిస్తారో చూడండి. 

ఈపీఎస్ పెన్షన్ = యావరేజ్ శాలరీ x పెన్షనబుల్ సర్వీస్ / 70 ఫార్ములా ప్రకారం పెన్షన్ ని లెక్కిస్తారు. బేసిక్ శాలరీ, డియర్ నెస్ అలవెన్స్ కలిపి యావరేజ్ శాలరీగా లెక్కగడతారు. గరిష్ట వేతన పరిమితి 15 వేలు, పెన్షనబుల్ సర్వీస్ 35 ఏళ్ళు బట్టి లెక్క చూస్తే.. 15000 x 35 / 70 = 7,500 వస్తుంది. ప్రస్తుతం అందుతున్న పెన్షన్ గరిష్టంగా నెలకు రూ. 7,500గా ఉంది. గరిష్ట వేతన పరిమితిని 21 వేల రూపాయలకు పెంచితే కనుక 21000 x 35 / 70 = 10,500 వస్తుంది. గరిష్ట పెన్షన్ నెలకు 10,500 వస్తుంది. ఇప్పుడున్న దానికి అదనంగా రూ. 2500 పెన్షన్ వస్తుంది. కేంద్రం కనుక ఈ ప్రతిపాదనను ఆమోదిస్తే అర్హత గల ఉద్యోగులందరికీ పదవీ విరమణ తర్వాత నెల నెలా 10,500 పెన్షన్ అనేది లభిస్తుంది. అంటే ఈపీఎస్ కింద ఉద్యోగులకు ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ (సంస్థ కలిపే) పెన్షన్ అనేది 8.33 శాతంగా ఉంటుంది. అప్పుడు ఈపీఎస్ కాంట్రిబ్యూషన్ 21,000 x 8.33% = 1,750 రూపాయలు. నెలకు 1750 రూపాయలు ఈపీఎస్ కింద యాడ్ అవుతాయి. మొత్తం ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ చూసుకుంటే ఉద్యోగి, సంస్థ ఇద్దరి వాటా రూ. 3,290 అవుతుంది. దీనికి మిగిలిన మొత్తాన్ని కలిపి కేంద్రం ఉద్యోగి పదవీ విరమణ సమయంలో అందజేస్తుంది.

Show comments