iDreamPost
android-app
ios-app

IC 814 వివాదం: హైజాకర్ల పేర్ల విషయంలో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్

  • Published Sep 03, 2024 | 11:28 AM Updated Updated Sep 03, 2024 | 11:28 AM

IC 814 Kandahar Hijacking Netflix: ఇటీవల విడుదలైన ఐసీ 814: ది కాందహార్ హైజాక్ వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ ఈ సిరీస్ విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతుంది. కాగా ఈ సిరీస్ ని బ్యాన్ చేయాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలైంది. అంతేకాదు నెట్ ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ హెడ్ మోనికా షెర్గిల్ కి కేంద్రం సమన్లు జారీ చేసింది. అసలేమైందంటే?

IC 814 Kandahar Hijacking Netflix: ఇటీవల విడుదలైన ఐసీ 814: ది కాందహార్ హైజాక్ వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ ఈ సిరీస్ విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతుంది. కాగా ఈ సిరీస్ ని బ్యాన్ చేయాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలైంది. అంతేకాదు నెట్ ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ హెడ్ మోనికా షెర్గిల్ కి కేంద్రం సమన్లు జారీ చేసింది. అసలేమైందంటే?

  • Published Sep 03, 2024 | 11:28 AMUpdated Sep 03, 2024 | 11:28 AM
IC 814 వివాదం: హైజాకర్ల పేర్ల విషయంలో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్

‘ఐసీ 814: ది కాందహార్ హైజాక్’ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో ఆగస్టు 29న విడుదలై సంచలన హిట్ నమోదు చేసుకుంది. అయితే ఇంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సిరీస్ పై పిటిషన్ వేశారు. ఈ సిరీస్ లో నిజమైన హైజాకర్లని హిందూ పేర్లతో తప్పుగా చూపించారని పిటిషన్ లో పేర్కొన్నారు. భోళా, శంకర్ సహా పలు హిందూ పేర్లను రియల్ హైజాకర్ల పేర్లుగా పెట్టారని ఆరోపించారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని పేర్కొన్నారు. ఈ సిరీస్ ని అనుభవ్ సిన్హా డైరెక్ట్ చేశారు. ఐసీ 814: ది కాందహార్ హైజాక్ ఓటీటీ సిరీస్ ని నిషేధించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. హైజాకర్ల వాస్తవ గుర్తింపు గురించి వాస్తవాలను వక్రీకరించారని ఆరోపణలు చేశారు. హిందూ సేన ప్రెసిడెంట్, రైతు అయిన సుర్జీత్ సింగ్ యాదవ్ ఈ పిటిషన్ వేశారు. ఈ ఓటీటీ సిరీస్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) సర్టిఫికెట్ ని రద్దు చేయాలని, పబ్లిక్ చూడకుండా నిషేధించాలని కేంద్ర, మహారాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.

హైజాకర్ల వాస్తవ గుర్తింపులకు సంబంధించి కీలకమైన వాస్తవాలను వక్రీకరించడమే కాకుండా చారిత్రక సంఘటనలను తప్పుగా చూపించారని.. ఇది జనాల్లో నిజంలా నాటుకుపోతుందని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ సిరీస్ ని ప్రేక్షకులను చూడకుండా, అపార్థం చేసుకోకుండా, హాని జరగకుండా కోర్టు జోక్యం చేసుకోవాలని పిటిషన్ లో కోరారు. కాగా కేంద్ర ప్రభుత్వం నెట్ ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ హెడ్ మోనికా షెర్గిల్ కి సమన్లు జారీ చేసింది. దేశం యొక్క సెంటిమెంట్స్ తో ఆడుకునే హక్కు ఎవరికీ లేదంటూ ఆమెకు సమన్లు పంపింది కేంద్ర ప్రభుత్వం. నెట్ ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ హెడ్ కి ఈ వివాదం మీద వివరణ కోరుతూ కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ సమన్లు పంపినట్లు అధికవర్గాలు చెబుతున్నాయి.

1999లో పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థ హర్కత్-ఉల్-ముజాహిదీన్ హైజాక్ చేసిన ఇండియన్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్ విషయంలో ఈ సిరీస్ లో చూపించిన వివాదాస్పద అంశాలపై వివరణ ఇవ్వాలని కోరింది. కాందహార్ లో ఐసీ-814 ఫ్లైట్ హైజాక్ వాస్తవ సంఘటన ఆధారంగా ఈ సిరీస్ ని తెరకెక్కించారు. విజయ్ శర్మ, పంకజ్ కపూర్, నజీరుద్దీన్ షా, మనోజ్ పహ్వ, అరవింద్ స్వామి, దియా మీర్జా, ఆదిత్య శ్రీవాస్తవ, అమృత పూరీ తదితరులు నటించారు. ఈ సిరీస్ లో ఐదుగురు హైజాకర్లు ఉంటారు. ఇబ్రహీం అక్తర్, షాహిద్ అక్తర్ సయ్యద్, సన్నీ అహ్మద్ కాజీ, జహూర్ మిస్ట్రీ, షాకీర్ కోడ్ నేమ్స్ భోళా, శంకర్, డాక్టర్, బర్గర్, చీఫ్ గా ఉన్నాయి. దీని వల్ల ఉగ్రవాదుల అసలు పేర్లు కాకుండా హిందువుల పేర్లు జనాల్లోకి వెళ్తాయని.. హిందువులే ఉగ్రవాదులు అన్నట్లుగా ముద్ర పడిపోతుందని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ నెట్ ఫ్లిక్స్ ని వివరణ కోరింది.