iDreamPost
android-app
ios-app

మరో సివిల్స్ కోచింగ్ సెంటర్ నిర్లక్ష్యం.. ప్రమాదానికి గురైన అభ్యర్థులు!

రావూస్ అనే సివిల్స్ కోచింగ్ సెంటర్ లో వరదల్లో చిక్కుకుని ముగ్గురు విద్యార్థులు మరణించిన సంగతి తెలిసింది. ఈ ఘటన దేశమొత్తాన్ని కలచి వేసింది. వరద నీరు వస్తున్నా..తప్పించుకునే పరిస్థితి ఆ కోచింగ్ సెంటర్ లోనే ప్రాణాలు విడిచారు. తాజాగా మరో కోచింగ్ సెంటర్ నిర్లక్ష్యం బయటపడింది.

రావూస్ అనే సివిల్స్ కోచింగ్ సెంటర్ లో వరదల్లో చిక్కుకుని ముగ్గురు విద్యార్థులు మరణించిన సంగతి తెలిసింది. ఈ ఘటన దేశమొత్తాన్ని కలచి వేసింది. వరద నీరు వస్తున్నా..తప్పించుకునే పరిస్థితి ఆ కోచింగ్ సెంటర్ లోనే ప్రాణాలు విడిచారు. తాజాగా మరో కోచింగ్ సెంటర్ నిర్లక్ష్యం బయటపడింది.

మరో సివిల్స్ కోచింగ్ సెంటర్ నిర్లక్ష్యం.. ప్రమాదానికి గురైన అభ్యర్థులు!

వారం రోజుల క్రితం ఢిల్లీలోని ఓ సివిల్స్ కోచింగ్ సెంటర్ లో విషాదం చోటుచేసుకున్నా సంగతి తెలిసింది. రావూస్ అనే సివిల్స్ కోచింగ్ సెంటర్ లో వరదల్లో చిక్కుకుని ముగ్గురు విద్యార్థులు మరణించిన సంగతి తెలిసింది. ఈ ఘటన దేశమొత్తాన్ని కలచి వేసింది. వరద నీరు వస్తున్నా..తప్పించుకునే పరిస్థితి ఆ కోచింగ్ సెంటర్ లోనే ప్రాణాలు విడిచారు. చనిపోయిన వారిలో తెలంగాణకు చెందిన యువతి కూడా ఉన్నారు. ఈఘటనతో వసతులు సరిగ్గాలేని కోచింగ్ సెంటర్లపై అధికారులు చర్యలు తీసుకుంటున్నరు. ఈ ఘటన మరవక ముందే.. మరో కోచింగ్ సెంటర్ నిర్వాకం బయటపడింది. సివిల్స్ ప్రిపేర్ అవుతున్న పలువురు విద్యార్థులు ప్రమాదానకి గురయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నగరంలోని గోమతి నగర్‌లో ఉన్న కోచింగ్ సెంటర్‌లో  ఇద్దరు విద్యార్థులు ప్రమాదానికి గురయ్యారు. శనివారం రాత్రి తరగతులు ముగించుకున్న విద్యార్థులు తమ ఇళ్లకు వెళ్లేందుకు రెడీ అయ్యారు. రాత్రి 8 గంటలకు లిఫ్ట్ ఎక్కారు. ఇక లిఫ్ట్ స్టార్టయ్యాక అకస్మాత్తుగా మధ్య ఆగిపోయింది. కిందకు వెళుతున్న సమయంలో లిఫ్ట్ మధ్యలోనే భవనంలోని ఐదో అంతస్తులో ఆగిపోయింది. ఇలా ఒక్కసారిగా లిఫ్ట్ మధ్యలో ఆగిపోవడం ఆ విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే రక్షించాలంటూ కేకలు వేశారు. అయితే వాళ్లను రక్షిచేందుకు ఎవరు ధైర్యం చేయలేదు. దీంతో లిఫ్టులో ఇరుక్కుపోయిన శోభా సింగ్ అనే మహిళ..తన పరిస్థితిని తన భర్త పవన్ సింగ్ ఫోన్ చేసి తెలిపింది.

అతను కోచింగ్ సెంటర్‌కు చేరుకుని అధికారులకు ఫోన్ చేశాడు. అయితే పవన్ కు అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు.  దీంతో ఈ వ్యవహారాన్ని పవన్ వీడియోగా రికార్డ్ చేసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ అయ్యింది. వీడియో చూసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని లిఫ్ట్‌ ఆపరేటర్‌ సహాయంతో లోపాన్ని సరిచేసి అందులో ఇరుక్కున్న ఇద్దరు సివిల్స్ అభ్యర్థులను కాపాడారు.  ఈ ఘటన జరిగిన సమయంలో లిఫ్ట్‌కు సంబంధించిన మాస్టర్ కీ సెక్యూరిటీ గార్డు వద్ద లేకపోవడంతో బాధితులను రక్షించడంలో జాప్యం జరిగిందని పోలీసులు తెలిపారు. ఆ ఇద్దరు విద్యార్థులు దాదాపు 45 నిమిషాల పాటు ఆ లిఫ్ట్ లోనే భయం భయంగా గడిపారు. ఇలా మరో కోచింగ్ సెంటర్ నిరక్ష్యంతో సివిల్స్ విద్యార్థులు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు.