iDreamPost
android-app
ios-app

కూరలో టమాటా వేశాడని.. భర్తను వదిలేసిన భార్య!

కూరలో టమాటా వేశాడని.. భర్తను వదిలేసిన భార్య!

టమాటాను చూస్తే.. సామాన్యులకు చిక్కను దొరకను అన్నట్లు ఉంది. రోజు రోజూకు టమాటా ధర ఆకాశం వైపే చూస్తుంది కానీ… కిందకు చూడటం లేదు. చాలా ప్రాంతాల్లో టమాటా ధరలు సెంచరి దాటగా.. మరికొన్ని ప్రాంతాల్లో డబుల్ సెంచరి కొట్టింది. పేద, మధ్యతరగతి వారు టమాటాను బంగారంలాగా చూస్తున్నారు. ఇంకా దారుణం ఏమిటంటే టమాటా ధరలకు భయపడి.. కూరల్లో వేసుకోవడమే మానేశారు. అలానే ఈ టమాటా కొన్ని కుటుంబాల్లో మంట పెడుతుంది. తాజాగా మధ్యప్రదేశ్ లోని ఓ దంపతుల మధ్య టమాటా చిచ్చు పెట్టింది. కూరలో టమాటా వేశాడని భర్తను  ఓ భార్య వదిలేసింది. ఈ విచిత్ర ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని షాహడోల్ అనే ప్రాంతంలో  సంజీవ్ వర్మన్ అనే వ్యక్తికి ఆరతి అనే యువతితో 8 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి నాలుగేళ్ల కుమార్తె ఉంది. సంజీవ్ టిఫిన్ సెంటర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.  టిఫిన్ సెంటర్ లో వంటలు చేస్తున్న సమయంలో కూరలో టమాటాలను వినియోగించే వాడు.  దీనిని సంజీవ్ భార్య ఆరతి గమనించింది.  భర్తపై  ఆగ్రహం వ్యకం చేస్తూ.. ఇంకోసారి వంటలో టమాటలు వేస్తే.. ఇంటి నుంచి వెళ్లిపోతానని బెదిరించింది. అయితే  ఆరతి దెబ్బకు భయపడిన సంజీవ్. ఇలాంటి తప్పు  మళ్లీ చేయనని, భవిష్యత్ లో ఎప్పుడూ  టమాటా జోలికి వెళ్లని భార్యకు మాట ఇచ్చాడు. అయినా ఆగ్రహంతో ఉన్న ఆమె.. భర్త మాటలను అస్సలు పట్టించుకోలేదు. ఇంకా దారుణం ఏమిటంటే.. భర్తపై కోపంతో కుమార్తెను తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది.

దీంతో ఆందోళన చెందిన సంజీవ్ వర్మన్.. తన భార్య కోసం వివిధ ప్రాంతాల్లో గాలించాడు. అయినా ఫలితం లేకుండా పోవడంతో చివరకు పోలీసులను ఆశ్రయించాడు. జరిగిన విషయం చెప్పి.. భార్య మిస్సింగ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు సంజీవ్ భార్య ఆరతి ఫోన్ నెంబర్ తీసుకుని ట్రేస్ చేశారు. ఆమె.. తన సోదరి  ఇంటివద్ద ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దరిని పోలీస్ స్టేషన్ కు పిలిపించి.. వారి మధ్య సయోధ్య కుదిర్చారు. అయితే పోలీసులు  ఆరతి వర్మతో మాట్లాడినప్పుడు.. తన భర్త తాగొచ్చి తనను, కుమార్తెను కొడుతుంటాడని ఫిర్యాదు చేశారు.  చివరకు ఇద్దరి మాట్లాడిన పోలీసులు.. ఆ దంపతులను ఒకటి చేశారు.  ఇదే విధంగా వివిధ ప్రాంతాల్లో టమాటాల కొనుగోలు, విక్రయాల విషయమై పలు వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. మరి.. ఈ విచిత్ర ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: బాలుడి ప్రాణం తీసిన లాలీపాప్! అసలేం జరిగిందంటే?