iDreamPost

రామమందిరానికి యాచకుల భారీ విరాళం! ఎంతంటే..?

Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిర నిర్మాణం పనులు శర వేగంగా సాగుతోన్నాయి. ఈ నిర్మాణం కోసం ఎంతో మంది విరాళాలు ఇచ్చారు. తాజాగా యాచకులు కూడా రామాలయానికి విరాళం అందించారు.

Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిర నిర్మాణం పనులు శర వేగంగా సాగుతోన్నాయి. ఈ నిర్మాణం కోసం ఎంతో మంది విరాళాలు ఇచ్చారు. తాజాగా యాచకులు కూడా రామాలయానికి విరాళం అందించారు.

రామమందిరానికి యాచకుల భారీ విరాళం! ఎంతంటే..?

అయోధ్య రామమందిర నిర్మాణం అనేది హిందూవుల చిరకాల కల. ఆ కల నిరవేరే సమయం ఆసన్నమైంది. రామ మందిర నిర్మాణ పనులు శర వేగంగా సాగుతోన్నాయి. శతాబ్దాల వివాదంగా ఉన్న ఈ వ్యవహారంలో  అయోధ్యలో రామాలయం నిర్మాణానికి మార్గం సుగమం చేస్తూ.. సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో కోర్టు ఆదేశాలకు అనుగుణంగా రామమందిర నిర్మాణం జరుగుతోంది. 2020 ఆగష్టు 5న అయోధ్య రామమందిర నిర్మాణ పనులు లాంఛనంగా ప్రారంభమ్యాయి. ఇక ఈ  నిర్మాణానికి దేశ విదేశాల నుంచి ఎంతో మంది విరాళాలు ఇస్తున్నారు. అలానే సామాన్యులు సైతం తమ సామర్థ్యం మేరకు రామ మందినిర్మాణానికి విరాళాలు ఇస్తున్నారు. తాజాగా యాచకులు కూడా రామాలయానికి విరాళం అందించారు.

హిందూవుల ఆరాధ్య దైవం శ్రీరామ చంద్రుడు. ఆయన జన్మస్థలం అయోధ్య నగరంలో రామమందిర నిర్మాణం జరుగుతోంది. 2020 ఆగష్టులో ప్రారంభించిన ఈ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరికొద్ది  నెలల్లో పూర్తి నిర్మాణం పూర్తై ప్రారంభం కూడా జరగనుంది. ఇక ప్రారంభోత్సవానికి  దేశంలోనే ప్రముఖలందరికి అయోధ్య ట్రస్టు ఆహ్వానాలు పంపిస్తుంది. ఇప్పటికే చాలా మందికి ఆహ్వానాలు పంపగా.. మరికొందరి పంపించనుంది. ఇది ఇలా ఉంటే.. అయోధ్య రామ మందిర నిర్మాణం ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు విరాళాలు వస్తూనే ఉన్నాయి.

Huge donation by beggars to Ram Mandir

దేశ విదేశాల్లో ఉన్న పారిశ్రామిక వేత్తలు, ఇతర ప్రముఖులు ఆలయ నిర్మాణానికి భారీగా విరాళాలు ఇస్తున్నారు. అలానే కొందరు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా రామమందిరానికి విరాళాలు ఇచ్చారు. అంతేకాక ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ రామాలయానికి సామాన్య జనం సైతం తమ వంతుగా ఉడత సాయం చేస్తున్నారు. వివిధ రూపాల్లో శ్రీరామ చంద్రుడికి విరాళాలు అందిస్తున్నారు. ఇటీవలే గుజరాత్ కి చెందిన ఓ నగల వ్యాపారి.. రామమందిరం థీమ్ తో ఓ హారాన్ని చేయించారు. తాజాగా కొందరు యాచకులు కూడా తమవంతుగా స్వామివారికి విరాళం అందించాలని భావించారు.

అయోధ్య రామమందిరానికి యూపీ రాష్ట్రంలోని ఉత్తర కాశీకి చెందిన యాచకులు విరాళం అందించారు. యాచకుల సంఘం తరపున రూ.4.50 లక్షలు రామమందిర నిర్మాణం కోసం సేకరించారు. యూపీలోని 27 జిల్లాలకు చెందిన యాచకులు ఈ విరాళాలు సేకరించారు. మొత్తం 300 మంది కాశీలో భిక్షాటన చేస్తూ ఈ డబ్బును పోగు చేశారు. వచ్చే నెల 22న జరిగే రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ విరాళం అందించనున్నారు. మరోవైపు చెప్పులు కుట్టేవారు, రజకులు, స్వీపర్లు కూడా విరాళాలు అందించారు.

ఇక, రామాలయం నిర్మాణానికి సంబంధించి.. అయ్యోధ్య ట్రస్టు అవసరమైన నిర్ణయాలు తీసుకుంటోంది. 2024 జనవరి నాటికి ఆలయ గర్భగుడి సిద్ధమవుతుందని ట్రస్టు చెబుతోంది. ఇక 2.7 ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన ఆలయాన్ని నిర్మిస్తున్నారు. మందిరం పొడవు 360 అడుగులు, వెడల్పు 235 అడుగులు ఉండనుంది. ఈ రామ మందిరాన్ని మూడు అంతస్తులతో నిర్మించనున్నారు. ఈ మందిరం ఎత్తు 161 అడుగులు ఉంటుంది. రెండున్నర అడుగుల పొడవు ఉన్న 17 వేల రాళ్లను అయోధ్య రామమందిర నిర్మాణంలో ఉపయోగిస్తున్నారు. ఇక, రామాలయం నిర్మాణంలో విరాళలు ఇస్తూ ప్రముఖ పారిశ్రామిక వేత్తల మొదలు.. సామాన్యుల వరకు భాగస్వాములు అవుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి