iDreamPost
android-app
ios-app

చిన్నారుల బ్రెయిన్ పై స్మార్ట్‌ఫోన్స్ ప్రభావం! పరిశోధనల్లో సంచలన విషయాలు!

  • Published Mar 23, 2024 | 5:22 PM Updated Updated Mar 23, 2024 | 5:25 PM

ప్రస్తుత జనరేషన్ లో చాలామంది పిల్లలు చేతిలో స్మార్ట్ ఫోన్ లేకపోతే తిండి కూడా తినని పరిస్థితిలో ఉన్నారు. ఇలా చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు మారాం చేయకుడాదని, అన్నం తినాలని వాళ్లకి స్మార్ట్ ఫోన్స్ ఇవ్వడం అలవాటు చేస్తున్నారు. కానీ, ఇలా చేయడం వలన పిల్లల పై ఊహించని దుష్ప్రభావాలు ఎదురవుతాయని తాజాగా కొన్ని పరిశోధనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ప్రస్తుత జనరేషన్ లో చాలామంది పిల్లలు చేతిలో స్మార్ట్ ఫోన్ లేకపోతే తిండి కూడా తినని పరిస్థితిలో ఉన్నారు. ఇలా చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు మారాం చేయకుడాదని, అన్నం తినాలని వాళ్లకి స్మార్ట్ ఫోన్స్ ఇవ్వడం అలవాటు చేస్తున్నారు. కానీ, ఇలా చేయడం వలన పిల్లల పై ఊహించని దుష్ప్రభావాలు ఎదురవుతాయని తాజాగా కొన్ని పరిశోధనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

  • Published Mar 23, 2024 | 5:22 PMUpdated Mar 23, 2024 | 5:25 PM
చిన్నారుల బ్రెయిన్ పై స్మార్ట్‌ఫోన్స్ ప్రభావం! పరిశోధనల్లో సంచలన విషయాలు!

ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ ల వినియోగం అనేది అవసరం దగ్గర నుంచి అనివార్యంగా మారింది. దీంతో స్మార్ట్ ఫోన్ లేనిదే చాలామందికి రోజు కూడా గడవడం లేని పరిస్థితి నెలకొంది. అందులోకి మార్కెట్లో రకరకాల స్మార్ట్ ఫోన్స్ అనేవి అందుబాటులోకి రావడంతో ప్రజలు కూడా వాటిని కొనుగోలు చేయడంలో ముందంచులో ఉన్నారు. అయితే ఇలా రకరకాల ఫీచర్లతో మార్కెట్ లోకి దిగిన ఫోన్ లను కొనేసి ట్రెండ్ గా నివలని తహతహపడే వారు ఒక్క విషయం మాత్రం గుర్తించడం లేదు. అదేమిటంటే.. మన దగ్గర కొత్త ఫీచర్లతతో లేటెస్ట్ మోడల్ ఫోన్ ఉందని సంబరపడే వారందరూ.. తమకు తెలియకుండానే తమ పిల్లల విషయంలో అనేక నష్టలకు కారణమవుతున్నారు. ఎందుకంటే.. నేటి కాలంలో చిన్నారులు ఈ స్మార్ట్ ఫోన్ లకు బానిసలు అయిపోతున్నారు. నిరంతరం ఫోన్ లోనే కాలం గడిపెస్తూ.. ప్రపంచంతో సంబంధం లేకుండా ఉంటున్నారు. కానీ, ఇలా చేయడం చాలా ప్రమాదకరమని, దీని వలన పిల్లల పై ఊహించని దుష్ప్రభావాలు ఎదురవుతాయని తాజాగా కొన్ని పరిశోధనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ఇప్పుడున్న జనరేషన్ లో చాలామంది పిల్లలు చేతిలో స్మార్ట్ ఫోన్ లేకపోతే తిండి కూడా తినని పరిస్థితిలో ఉన్నారు. ఇలా చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు మారాం చేయకుడాదని, అన్నం తినాలని వాళ్లకి స్మార్ట్ ఫోన్స్ ఇవ్వడం అలవాటు చేస్తున్నారు. కానీ, ఇలా చేయడం వలన పిల్లల పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని తాజా పరిశోధనలో కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. అందులో పిల్లలు మొబైల్ ఫోన్లను అతిగా వాడటం వల్ల మెదడు, వినికిడి,మాట్లాడే సామర్థ్యంపై ప్రభావం చూపుతుందని ఆ పరిశోధనలో తేలింది. అంతేకాకుండా.. మొబైల్ ఫోన్ల నుంచి వెలువడే నీలి కాంతి వలన పిల్లల మెదడు అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది. ఇది వారి నిద్ర పై కూడా ప్రభావితం చేస్తుంది. దీంతో వారి ఏకాగ్రతను కోల్పోయి, నేర్చుకునే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. అలాగే తరుచుగా మొబైల్ ఫోన్లు వాడటం వల్ల పిల్లల వినికిడి సామర్థ్యం కూడా తగ్గిపోతుందని పరిశోధనల్లో తేలింది.

Can children get smartphones Sensational facts 02

వీటితో పాటు మొబైల్ ఫోన్ల నుంచి వచ్చే పెద్ద శబ్దం పిల్లల చెవుల సున్నితమైన కణజాలాలను దెబ్బతీస్తుంది. దీని కారణంగా.. వారు వినికిడిలో ఇబ్బంది పడవచ్చు. ఇక స్మార్ట్‌ఫోన్‌ వినియోగం చిన్నారుల్లో సామాజిక, భావోద్వేగ సమస్యలకు దారి తీస్తుందని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే.. పిల్లలు మొబైల్ ఫోన్ ఎక్కువగా ఉపాయోగించడం వలన ఇతరులతో మాట్లాడడానికి ఆసక్తి చూపించారని, అలా వారిలో ఒంటరితనం, నిరాశ పెరుగుతుందని చెబుతున్నారు.అందుచేతనే ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో.. 99% మంది మొబైల్ ఫోన్‌లు, గాడ్జెట్‌లకు బానిసలుగా మారుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబతోంది. అయితే దేశంలో సుమారు 66% మంది తల్లిదండ్రులకు తమ పిల్లలకు అధిక స్క్రీన్ సమయం ప్రమాదకరమని తెలియదు.

కాగా, ఇటీవల అధ్యయనం ప్రకారం..  65% కుటుంబాలు తమ పిల్లలు అన్నం తినడానికి టీవీలు చూపిస్తున్నారని తేలింది. ఇలా 12 నెలల వయసులో ఉన్న పిల్లవాడు కూడా రోజుకు 53 నిమిషాలు స్మార్ట్ ఫోన్‌లు చూస్తున్నారు.  ఇక అదే పిల్లవాడికి 3 సంవత్సరాల వయసుకు  స్క్రీన్ సమయం గంటన్నరకు పెరుగుతుంది. అందువలన పిల్లలకు మొబైల్ ఫోన్‌లకు దూరంగా ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే పిల్లలు పడుకునే ముందు ఎట్టి పరిస్థితుల్లో ఫోన్‌ ఇవ్వడకూడదని, ఆ ఫోన్ల వల్ల కలిగే నష్టాలను చిన్నారులకు అర్థమయ్యేలా వివరించాలని చెబుతున్నారు. అయితే అందుకు బదులుగా ఇతర విషయాలపై దృష్టి మళ్లించేలా అలవాటు చేయాలని సూచిస్తున్నారు. మరి, రెగ్యూలర్ గా మొబైల్ ఫోన్స్ వినియోగిస్తున్న పిల్లలకు ఎదురయ్యే దుష్ప్రభావాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.