iDreamPost
android-app
ios-app

అందమే ఆమెకు పెట్టుబడి.. గుడ్డిగా నమ్మిన అతడిని

  • Published Feb 28, 2024 | 7:59 AM Updated Updated Feb 28, 2024 | 7:59 AM

అందమే ఆమెకు పెట్టుబడి.. యువకులే టార్గెట్‌. బ్యూటీని ఎరగా వేసి.. వల పన్ని తనను గుడ్డిగా నమ్మిన వారి జీవితాలను నాశనం చేస్తుంది సదరు యువతి. తాజాగా ఓ యువకుడికి ఇదే పరిస్థితి ఎదురయ్యింది. ఆ వివరాలు..

అందమే ఆమెకు పెట్టుబడి.. యువకులే టార్గెట్‌. బ్యూటీని ఎరగా వేసి.. వల పన్ని తనను గుడ్డిగా నమ్మిన వారి జీవితాలను నాశనం చేస్తుంది సదరు యువతి. తాజాగా ఓ యువకుడికి ఇదే పరిస్థితి ఎదురయ్యింది. ఆ వివరాలు..

  • Published Feb 28, 2024 | 7:59 AMUpdated Feb 28, 2024 | 7:59 AM
అందమే ఆమెకు పెట్టుబడి.. గుడ్డిగా నమ్మిన అతడిని

పైన ఫొటోలో ఉన్న యువతిని చూశారుగా.. మత్తెక్కించే కళ్లతో.. ఎంతో అందంగా కనిపిస్తుంది కదా. సినిమా హీరోయిన్లకు మించి ఫోజులు ఇస్తూ.. సోషల్‌ మీడియాలో ఫొటోలను అప్‌లోడ్‌ చేస్తుంటుంది. అక్కడితే ఆగితే బాగానే ఉంది.. కానీ కర్మ కాలి ఎవరైనా యువకులు ఆమె ఫొటోలు చూసి కామెంట్‌ చేశారా.. ఇక వారి పని గోవింద. తన అందాన్ని పెట్టుబడిగా పెట్టుకుని.. సదరు యువతి చేసే దందా గురించి తెలిస్తే.. భయంతో ఒణికిపోతారు. తాజాగా ఓ యువకుడు ఇలానే సదరు యువతిని చూసి మనసు పారేసుకున్నాడు. ఆమెను గుడ్డిగా నమ్మాడు. ఫలితం జైల్లో ఊచలు లెక్కబెడుతున్నాడు. ఇంతకు ఏం జరిగింది.. ఆమె అతడిని ఎలా మోసం చేసింది అంటే..

సదరు యువతిది మన దేశం కాదు. పాకిస్తాన్‌ యువతి. మ్యాటర్‌ అర్థం అయ్యింది కదా.. అవును హనీ ట్రాపింగ్‌కు పాల్పడింది. అందంతో వలపు వల విసిరి.. సదరు యువకుడి దగ్గర నుంచి దేశ భద్రతకు సంబంధించిన సమాచారాన్ని రాబట్టింది. ఇంతకు ఆమె చేతిలో మోసపోయిన వ్యక్తి ఎవరూ అంటే.. ఆర్మీ క్యాంటీన్‌లో పని చేస్తున్న విక్రమ్ సింగ్(31). ఈ మాయలేడి వలలో చిక్కుకున్న యువకుడు దేశ భద్రతకు సంబంధించిన సమాచారాన్ని లీక్ చేశాడు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని ఆర్మీ క్యాంటీన్‌లో వెలుగు చూసింది.

విక్రమ్ సింగ్ సదరు పాకిస్తాన్‌ యువతి పన్నిన హనీట్రాప్‌లో పడిపోయినట్లు పోలీసులు గుర్తించారు. సామాజిక మీడియా ద్వారా వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత విక్రమ్‌ సింగ్‌.. పాక్‌ మహిళా ఏజెంట్లతో వ్యూహాత్మకంగా ముఖ్యమైన సమాచారాన్ని పంచుకుంటున్నాడని రాజస్తాన్‌ పోలీసు నిఘా విభాగం వెల్లడించింది. ఐఎస్‌ఐ కోసం గూఢచర్యం చేసినట్లుగా విక్రమ్ సింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

విక్రమ్ సింగ్ బికనీర్‌లోని దుంగార్‌ఘర్‌ ప్రాంతంలో ఉండేవాడు. చాలా ఏళ్లుగా అతడు బికనీర్‌ మహాజన్ ప్రాంతంలో ఆర్మీ క్యాంటీన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. ఇక గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో ఐఎస్‌ఐ కార్యకలాపాలపై నిఘా ఉంచినట్లు పోలీసు ఇంటెలిజెన్స్ అదనపు డైరెక్టర్ జనరల్ సంజయ్ అగర్వాల్ తెలిపారు. ఈ నిఘా ఆపరేషన్‌లో విక్రమ్ సింగ్ సోషల్ మీడియా ద్వారా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ హ్యాండ్లర్‌లతో నిరంతరం కమ్యూనికేషన్‌ జరుపుతున్నట్లు వారు గుర్తించారు. విక్రమ్ సింగ్ కార్యకలాపాలను ట్రాక్ చేస్తున్న నిఘా బృందం అతను హనీట్రాప్‌లో పడి.. ముఖ్యమైన సమాచారాన్ని పాకిస్తాన్‌ వారికి చేరవేస్తున్నట్లు గుర్తించారు.

అగర్వాల్‌ మాట్లాడుతూ.. ఐఎస్ఐతో సంబంధం ఉన్న అనిత అనే మహిళతో విక్రమ్‌కు ఏడాది క్రితం పరిచయం ఏర్పడిందని తెలిపారు. ఈ పాకిస్తానీ ఏజెంట్ ఆదేశాల ప్రకారం.. విక్రమ్ ఆర్మీ ప్రాంతాలకు సంబంధించిన ఫోటోగ్రాఫ్‌లు, లొకేషన్‌లు, నిషేధిత ప్రాంతాల వీడియోలు, అలాగే యూనిట్‌లు, అధికారులకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని సోషల్‌ మీడియా ద్వారా చేరవేసినట్లు అధికారులు గుర్తించారు.