Dharani
Free LPG Cylinder: హోలీ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు శుభవార్త చెప్పింది. ఒక్క రూపాయి చెల్లించకుండా ఉచితంగా గ్యాస్ సిలిండర్ పొందవచ్చని ప్రకటించింది. ఆ వివరాలు..
Free LPG Cylinder: హోలీ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు శుభవార్త చెప్పింది. ఒక్క రూపాయి చెల్లించకుండా ఉచితంగా గ్యాస్ సిలిండర్ పొందవచ్చని ప్రకటించింది. ఆ వివరాలు..
Dharani
ఖర్చులు పెరుగుతున్నాయి.. ఆదాయం మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగానే ఉంది. నిత్యవసరాల ధరలు భారీగానే పెరుగుతున్నాయి. కూరగాయలు, వంట నూనెల ధరలు మాత్రం తగ్గడం లేదు. గుడ్డిలో మెల్లలాగా.. గ్యాస్ ధరలు మాత్రం కాస్త తగ్గాయి. గతేడాది గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరను భారీగా తగ్గించిన కేంద్రం.. తాజాగా ఉమెన్స్ డే నాడు కూడా 100 రూపాయలు తగ్గించిన సంగతి తెలిసిందే. ఇక తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తోంది . కొన్ని రోజుల క్రితమే రేవంత్ సర్కార్ ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలో తాజాగా హోలీ పండుగ సందర్భంగా శుభవార్త చెప్పారు. ఉచితంగా గ్యాస్ సిలిండర్ అందిస్తామని ప్రకటించారు. ఆ వివరాలు..
హోలీ పండుగ సందర్భంగా ఫ్రీగా గ్యాస్ సిలిండర్ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది ఓ రాష్ట్ర ప్రభుత్వం. ఇంతకు ఈ బంపరాఫర్ ఎక్కడ అంటే ఉత్తరప్రదేశ్‌లో. హోలీ సందర్భంగా యూపీలో 1.75 కోట్ల అర్హులైన లబ్ధిదారులకు సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉచితంగా గ్యాస్ సిలిండర్ అందివ్వనున్నారు. ఎందుకంటే.. గతేడాది అనగా.. 2023, నవంబర్‌లో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలోని 1.75 కోట్ల మంది అర్హులైన కుటుంబాలకు ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద ఉచిత ఎల్‌పీజీ సిలిండర్ రీఫిల్ పంపిణీ ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద లబ్ధిదారులకు ఏడాదికి రెండుసార్లు ఉచితంగా గ్యాస్ సిలిండర్లను అందిస్తారు. గత నవంబర్‌లో దీపావళి సందర్భంగా ఉచితంగా ఎల్‌పీజీ సిలిండర్లు అందించారు. ఇప్పుడు హోలీ సందర్భంగా మరోసారి గ్యాస్ సిలిండర్‌ను ఫ్రీగా ఇవ్వనన్నారు.
ఇక మీరు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు అయితే.. యోగి ప్రభుత్వం అందించే ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని మీరు కూడా వినియోగించుకోవచ్చు. దీని కోసం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులు తమ బ్యాంకు ఖాతాను ఆధార్‌తో అనుసంధానించవలసి ఉంటుంది. 2016లో ప్రధాని నరేంద్ర మోదీ ఉజ్వల పథకాన్ని ప్రారంభించారు. దీని కింద ఇప్పటి వరకు సుమారు 9 కోట్ల మందికి పైగా ఉచిత ఎల్‌పీజీ కనెక్షన్లు అందించారు. ఈ పథకంలో ప్రభుత్వం ఒక్కో సిలిండర్‌కు రూ.300 సబ్సిడీ ఇస్తుంది. ఇది 31 మార్చి 2025 వరకు అందుబాటులో ఉంటుంది. దీనికి తాజాగా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. లబ్ధిదారులందరూ ఒక ఏడాదిలో 12 ఎల్‌పీజీ సిలిండర్‌లను ఈ సబ్సిడీ కింద పొందవచ్చు.