iDreamPost
android-app
ios-app

మసీదు ప్రారంభోత్సవానికి భారీగా వెళ్లిన హిందువులు, క్రైస్తవులు!

మతసామరస్యం వెల్లువిరిసే ఘటనలు తరచూ అనేకం జరుగుతుంటాయి. అవి చూసినప్పుడు దేశమంతా ఇలా కదా ఉండాల్సింది అనే భావన ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. తాాజాగా అలాంటి అనుభూతి కలిగించే దృశ్యం తమిళనాడులో చోటుచేసుకుంది.

మతసామరస్యం వెల్లువిరిసే ఘటనలు తరచూ అనేకం జరుగుతుంటాయి. అవి చూసినప్పుడు దేశమంతా ఇలా కదా ఉండాల్సింది అనే భావన ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. తాాజాగా అలాంటి అనుభూతి కలిగించే దృశ్యం తమిళనాడులో చోటుచేసుకుంది.

మసీదు ప్రారంభోత్సవానికి భారీగా వెళ్లిన హిందువులు, క్రైస్తవులు!

జనవరి 22న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం జరిగిన విషయం తెలిసిందే.  ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. ఈ వేడుకను చూసేందుకు లక్షలాది మంది భక్తులు అయోధ్యా నగరానికి తరలి వెళ్లారు. రాములోరి ప్రాణ ప్రతిష్ట వేడుకను ప్రత్యక్షంగా వీక్షించారు. ఇక అయోధ్య నిర్మాణంలో అన్ని మతాల వారి సహకారం ఉన్న సంగతి తెలిసిందే. నిర్మాణం విషయంలో ఎంతో మంది ముస్లింల సహాకారం కూడా ఉంది. ఆలయ నిర్మాణంలోని వివిధ పనులను ముస్లిం సోదరులు చేశారు. ఇలా మతసామరస్యానికి ప్రతీకగా అయోధ్య ఆలయ నిర్మాణం జరిగింది. తాజాగా ఓ మసీదు ప్రారంభోత్సవంలో కూడా ఆ ఏకీభావం కనిపించింది. ఈ వేడుకకు హిందువులు, క్రైస్తవులు భారీగా తరలి వెళ్లారు. తమిళనాడులో ఈ అద్భుతమైన ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే…

తమిళనాడులోని ప్రాంతంలో మతసామరస్యం వెల్లివిరిసింది. శివగంగ జిల్లా ఇలాయాంకుడి సమీపంలోని సాలై గ్రామంలో మసీదు ప్రారంభోత్సవం జరిగింది. ఆ గ్రామంలో కొంతకాలం క్రితం నుంచి మసీద్ నిర్మాణం పనులు జరిగాయి. జనవరి 21 ఈ మసీదు ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు ఆ గ్రామంలోని హిందువులు, క్రైస్తవులు  భారీగా తరలి వెళ్లారు. అంతేకాక ఈ కార్యక్రమంలోని పనుల్లో హిందువులు, క్రైస్తవులు సహయం చేశారు. పూలు, పండ్లు, కొబ్బరి కాయలు తీసుకుని హిందువులు మసీద్ కు వెళ్లగా.. అక్కడి ముస్లింలు వీరికి ఘన స్వాగతం పలికారు. అలానే పూలు, పండ్లు, కొవ్వొత్తులతో క్రైస్తవులు మసీదుకు వెళ్లారు. అక్కడ అన్ని మతాల వారు కలిసిమెలసి ఉండటం చూసి.. అందరూ సంతోషం వ్యక్తం చేశారు. తమ గ్రామంలో ఎన్నో ఏళ్ల నుంచి ఇలా అన్ని మతాల వాళ్లం కలిసిమెలసి వేడుకలు జరుపుకుంటామని స్థానికులు తెలిపారు. ఇక ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన వారికి హిందువూలు కూల్ డ్రింక్స్ అందించారు. అలానే క్రైస్తవులు పండ్లు అందించారు. ఇక ఈ ప్రారంభోత్సవానికి వచ్చిన వారికి ముస్లిం సోదరులు బిర్యాని అందించారు. ఇక మసీద్ ప్రారంభోత్సవానికి సంబంధించి ఆహ్వాన ప్లెక్సీలో సైతం..మూడు మతాలు ప్రతిభించేలా రూపొందించారు.

ఈ మసీద్ ప్రారంభోత్సవానికి స్థానిక హిందువులు, క్రైస్తవులు చాలా సహకారం అందించారని, ఆ మసీద్ ఇమామ్ తెలిపారు. వంటకు కావాల్సిన కట్టెలు, శామియాన, టెంట్ వంటి వాటిని ఉచితంగా అందించారని తెలిపారు. అలానే మసీద్ లో కొన్ని నిర్మాల కోసం జేసీబీని సైతం ఉచితంగా ఇచ్చారని ఇమామ్ తెలిపారు. ఇలా అందరి అభిమానాలు చూసి..తాము సాలై గ్రామంలో ఉన్నామా లేక స్వర్గంలో ఉన్నామా అనే సందేహం వచ్చిందని ఆయన తెలిపారు. తమ గ్రామంలో ఏలాంటి మత విబేధాలు లేకుండా ప్రశాంతంగా ఉన్నామని చర్చి స్టిస్టర్ అన్నారు.

ఇక్కడ అన్ని మతాలు వారు అన్నదమ్ముల జీవిస్తున్నారని ఆమె తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఉన్నట్లు ఇక్కడ అసలు మత ఘర్షణలు, విబేధాలు లాంటివి లేవని ఆమె తెలిపారు. హిందూ,ముస్లిం, క్రైస్తవులు ఓకే కుటుంబాల కలిసి జీవిస్తున్నామని సిస్టర్ తెలిపారు. ఈ మసీదు వేడుకలో మూడు మతాల వారు ఒకరినొకరు ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని స్నేహ భావాన్ని ప్రదర్శించారు. తమ తరానికే కాకుండా రాబోయ తరాల వారికి కూడ ఆదర్శంగా నిలిచారు. రాబోయే తరలా వారు కూడా ఇలానే మతసామరస్యాన్ని పాటించాలని ఇక్కడి గ్రామస్తులు కోరుతున్నారు. మరి.. మతసామరస్యాన్ని వెల్లువిరిసేలా చేసిన ఈ గ్రామస్తులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.