iDreamPost
android-app
ios-app

హిమాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వం కొత్త బిల్లు.. పార్టీ మారే MLAలకు చుక్కలే!

Himachal Pradesh: పార్టీ మారే ఎమ్ఎల్ఏలకు ఝలక్ ఇచ్చింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. కొత్త బిల్లును తీసుకొచ్చింది. ఇక పార్టీ మారాలనే ఆలోచన కూడా చేయరేమో. ఇంతకీ ఎక్కడంటే?

Himachal Pradesh: పార్టీ మారే ఎమ్ఎల్ఏలకు ఝలక్ ఇచ్చింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. కొత్త బిల్లును తీసుకొచ్చింది. ఇక పార్టీ మారాలనే ఆలోచన కూడా చేయరేమో. ఇంతకీ ఎక్కడంటే?

హిమాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వం కొత్త బిల్లు.. పార్టీ మారే MLAలకు చుక్కలే!

ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు అధికారం కోసం పార్టీలు మారుతున్న సంఘటనలు దేశవ్యాప్తంగా చోటుచేసుకుంటున్నాయి. పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే ఆ పార్టీని వదిలి వెంటనే గెలిచిన పార్టీలోకి మారుతున్నారు పలువురు ఎంఎల్ఏలు. ఇలా పార్టీలు మారే ప్రజా ప్రతినిధులతో అటు రాజకీయ పార్టీలకు.. ఇటు ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. పూటకో పార్టీ మారే ఎంఎల్ఏలపై చర్యలు తీసుకోవాలని రాజకీయ పార్టీలు కోరుతున్నాయి. ఈ క్రమంలో హిమాచల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ మారే ఎమ్ఎల్ఏలకు ఝలక్ ఇచ్చింది. పార్టీ ఫిరాయించిన ఎమ్ఎల్ఏలకు పెన్షన్ నిలిపివేయనున్నారు.

పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీ కోసం పనిచేసే నాయకులు కొందరైతే.. అధికారమే లక్ష్యంగా పార్టీ మారే నాయకులు కొందరున్నారు. ఇలాంటి వారికి చెక్ పెట్టేందుకు ఫిరాయింపులను అరికట్టేందుకు హిమాచల్ రాష్ట్ర ప్రభుత్వం కీలక బిల్లును తీసుకొచ్చింది. ఇక ఇప్పుడు పార్టీ మారే ఎమ్ఎల్ఏలకు ఈ పెన్షన్ ను నిలిపివేయనున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మేరకు కొత్త బిల్లు ప్రవేశపెట్టింది. హిమాచల్ ప్రదేశ్ శాసనసభ (సభ్యుల భత్యాలు, పెన్షన్) సవరణ బిల్లు 2024ను సీఎం సుఖ్‌విందర్ సింగ్ సుఖు మంగళవారం ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టగా దాన్ని ఆమోదించారు.

రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం ఏ సమయంలోనైనా అనర్హులుగా ఉన్నట్లయితే, చట్టం ప్రకారం ఒక వ్యక్తి పెన్షన్‌కు అర్హులు కాదు అని ఆ బిల్లులో పేర్కొన్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఆమోదించిన కొత్త బిల్లు ప్రకారం ఇతర పార్టీలకు ఫిరాయించిన ఎమ్మెల్యేలకు పెన్షన్ నిలిపివేస్తారు. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకు ఇది వర్తిస్తుంది. హిమాచల్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బిల్లుపై దేశ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలు కోరుకునేది ఇది కదా అంటూ పలువురు తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. మరి పార్టీ ఫిరాయించిన ఎమ్ఎల్ఏలకు పెన్షన్ నిలిపి వేసేలా తీసుకొచ్చిన బిల్లుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.