Marriage Age: అమ్మాయిల వివాహ వయసు.. సర్కార్ కొత్త చట్టం.. ఇకపై 18 కాదు.. ఎంతంటే

Marrige Age For Women Raised: ఇప్పటి వరకు అమ్మాయికి పెళ్లి వయసు అనగానే 18 ఏళ్లు నిండితే చాలు అనుకునేవారు. కానీ ఇకపై అలా కుదరదు. ప్రభఉత్వం అమ్మాయిల వివాహ వయసును పెంచింది. ఆ వివరాలు..

Marrige Age For Women Raised: ఇప్పటి వరకు అమ్మాయికి పెళ్లి వయసు అనగానే 18 ఏళ్లు నిండితే చాలు అనుకునేవారు. కానీ ఇకపై అలా కుదరదు. ప్రభఉత్వం అమ్మాయిల వివాహ వయసును పెంచింది. ఆ వివరాలు..

ఇప్పటి వరకు అమ్మాయికి పెళ్లి చేయాలంటే.. కనీసం 18 ఏళ్లు నిండాల్సిందే అని ప్రభుత్వం రూల్ తీసుకొచ్చింది. 18 సంవత్సరాలు నిండకుండా అమ్మాయికి పెళ్లి చేస్తే.. అది బాల్యం వివాహం కిందకు వస్తుంది. దాంతో ప్రభుత్వం అలాంటి వివాహం చేసిన వారిపై చర్యలు తీసుకునేది. ఇక అమ్మాయికి అయినా అబ్బాయికి అయినా 18 ఏళ్లు నిండితేనే మేజర్లుగా పరిగణిస్తారు. అయితే ఇకపై అలా కుదరదు. ఆడపిల్లకు 18 సంవత్సరాలు నిండితే చాలు అనేకునేవారికి ప్రభుత్వం షాకిచ్చింది. యువతుల వివాహ వయస్సును పెంచుతూ బిల్లు పాస్ చేసింది. ఆ వివరాలు..

మహిళల వివాహ వయస్సుకు సంబంధించి హిమాచల్ ప్రదేశ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అమ్మాయిల పెళ్లి వయసు 18 సంవత్సరాలు కాదని.. దాన్ని 21 ఏళ్లకు పెంచుతూ..  హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా మన దేశంలో మహిళల వివాహ వయస్సు 18 ఏళ్లుగా ఉండగా.. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం మాత్రం దాన్ని 21 ఏళ్లకు పెంచింది. ఈ మేరకు హిమాచల్ ప్రదేశ్ సర్కార్.. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి.. దానికి ఆమోదం కల్పించింది.

అయితే లింగ సమానత్వం కోసమే ఈ కొత్త చట్టాన్ని తీసుకువచ్చినట్లు హిమాచల్ ప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ బిల్లును హిమాచల్ ప్రదేశ్ ఆరోగ్య, సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి ధని రామ్ శాండిల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లును ఇంతకు ముందే అనగా గతేడాది ఫిబ్రవరిలో జరిగిన బడ్జెట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టినా.. అప్పుడు ఆమోదం పొందలేదు. దాంతో మరోసారి ఈ బిల్లును అసెంబ్లీ ముందుకు తీసుకువచ్చారు. ఈ సారి బిల్లు ఆమోదం పొందింది.

హిమాచల్ ప్రదేశ్‌లో మహిళల కనీస వివాహ వయస్సును 18 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు పెంచుతూ ఈ బిల్లులో సవరణలు రూపొందించారు. రెండు వారాలపాటు జరగనున్న అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తొలిరోజే ఈ బిల్లును ప్రవేశపెట్టడం గమనార్హం. ఇక ఈ బిల్లు ప్రవేశపెట్టడానికి గల కారణాలను మంత్రి ధని రామ్ శాండల్ వివరించారు. అమ్మాయిలకు చిన్నతనంలోనే పెళ్లి చేయకుండా నిషేధించేందుకు.. బాల్య వివాహ చట్టం 2006ను రూపొందించామని తెలిపారు.

అయితే స్త్రీ, పురుషుల మధ్య.. లింగ సమానత్వాన్ని తొలిగించి.. మహిళలలు కూడా ఉన్నత విద్యను అభ్యసించే అవకాశాలు పెంచేందుకే ఈ మహిళల కనీస వివాహ వయస్సును పెంచాల్సిన అవసరం ఏర్పడిందని ఆయన చెప్పుకొచ్చారు. అసెంబ్లీ ఆమోదం పొందిన తర్వాత ఈ బిల్లును గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా‌ ఆమోదం కోసం పంపించారు. ఇక ఆ బిల్లు గవర్నర్ ఆమోదం పొందితే.. యువతుల వివాహ వయస్సును పెంచిన ముఖ్యమైన చట్టాన్ని రూపొందించిన తొలి రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ నిలవనుంది.

Show comments